సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతి ఎయిర్‌టెల్ సరికొత్త ప్యాక్‌ను ప్రవేశపెట్టింది. ముఖ్యంగా రిలయన్స్ జియో భారతదేశంలో టాప్ టెలికాం ఆపరేటర్‌గా దూసుకుపోతున్నతరుణంలో జియోను నిలువరించే ప్లాన్లలో భాగంగా ఈ కొత్త ఆఫర్ తీసుకొచ్చింది. ఈ క్రమంలోనే డేటా టారిఫ్‌ప్లాన్లనుంచి తన ఫోకస్‌ను హలో ట్యూన్స్ సెగ్మెంట్ వైపు మళ్లించింది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో ఉచిత డేటా, వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో పాటు ఉచిత హలో ట్యూన్లను కూడా అందిస్తుంది. ఇటీవల ప్రకటించిన రూ.219 ప్లాన్ తరహాలోనే మరో కొత్త ప్రీపెయిడ్ రీచార్జ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది.
టెలికాం టాక్ నివేదిక ప్రకారం రూ. 129 రీఛార్జ్ కొత్త ప్యాక్‌ను తీసుకొచ్చింది. ఇందులో అన్‌లిమిటెడ్‌కాలింగ్ , రోజుకు 1జీబీ 4 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం. దీనికి అదనంగా ఎయిర్‌టెల్ హలో ట్యూన్స్‌ను ఉచితంగా ఆఫర్ చేస్తోంది. ఈ ప్లాన్ 28 రోజులు వాలిడిటీ. అయితే ఈ ఆఫర్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment