broadband users
-
కుర్రాళ్లోయ్ కుర్రాళ్లు.! నెలకు సగటున ఎంత డేటా వాడుతున్నారో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్‌లో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు గడిచిన ఐదేళ్ల కాలంలో రెట్టింపునకు పైగా పెరిగి 76.5 కోట్లకు చేరారని, 4జీ డేటా ట్రాఫిక్ 6.5 రెట్లు పెరిగిందని నోకియా తెలిపింది. భారత్‌లో మొత్తం డేటా వినియోగంలో 4జీ వాటా 99 శాతానికి చేరినట్టు పేర్కొంది. ఈ ఏడాది 5జీ సర్వీసులు మొదలవుతున్నా.. వచ్చే కొన్నేళ్లపాటు మొబైల్బ్రాడ్ బ్యాండ్ వృద్ధికి 4జీ టెక్నాలజీ సాయంగా నిలుస్తుందని నోకియా ఎంబిట్ పేరుతో విడుదలైన నివేదిక తెలిపింది. ‘‘మొబైల్ డేటా వినియోగం 2017 నుంచి 2021 మధ్య ఏటా 53 శాతం చొప్పున కాంపౌండెడ్ వార్షిక వృద్ధి రేటు (సీఏజీఆర్) నమోదు చేసింది. సగటు యూజర్ నెలవారీ డేటా వినియోగం మూడు రెట్లు పెరిగి 17జీబీకి చేరింది. మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు అప్ గత ఐదేళ్లలో మొబైల్ బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు 2.2 రెట్లు పెరిగారు. ఈ గణాంకాలన్నీ భారత్‌లో డేటా వినియోగం గణనీయంగా పెరిగినట్టు తెలియజేస్తున్నాయి’’ అని నోకియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్, భారత్ విభాగం హెడ్ సంజయ్ మాలిక్ తెలిపారు. మిలీనియల్స్ (23–38) రోజుకు 8 గంటల సమయాన్ని ఆన్లైన్లో గడుపుతున్నట్టు ఈ నివేదిక తెలిపింది. షార్ట్ వీడియో ఫార్మాట్, గ్రామీణ ప్రాంతాల్లో స్మార్ట్ఫోన్ల వినియోగం ఇవన్నీ భారత్‌లో డేటా వినియోగం వృద్ధికి మద్దతుగా నిలుస్తున్నట్టు పేర్కొంది. గతేడాది 16 కోట్లకు పైగా స్మార్ట్ఫోన్ల రవాణా జరిగిందని, ఇందులో 3 కోట్లు 5జీ ఫోన్లు ఉన్నట్టు తెలిపింది. -
కనీసం 2 ఎంబీపీఎస్ వేగం ఉండాలి
న్యూఢిల్లీ: ‘దేశంలో బ్రాడ్‌బ్యాండ్ నిర్వచనాన్ని మార్చాలి. ఇంటర్నెట్ కనీస వేగం ఇప్పుడున్న 512 కేబీపీఎస్ నుంచి 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలి’ అని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం తన లేఖలో టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ని కోరింది. నిర్వచనం మార్పు, వేగం పెంపు ప్రతిపాదనలు ఎన్నాళ్ల నుంచో పెండింగులో ఉన్నాయని ఫోరం తెలిపింది. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ, ఇంటర్నెట్ వేగం పెంపునకు ప్రణాళిక అన్న అంశంపై ట్రాయ్ సంప్రదింపుల పత్రంపై ఫోరం తన స్పందనను తెలియజేసింది. ‘కమ్యూనికేషన్ సాంకేతిక పరిజ్ఞానం కొన్నేళ్లుగా తీవ్రంగా మారిపోయింది. దేశంలో డేటా సేవలకు పూర్తిగా నూతన మార్కెట్లు పుట్టుకొచ్చాయి. ఇంటర్నెట్ ఆధారిత ఆధునిక అప్లికేషన్స్, వాటి వినియోగానికి ప్రస్తుత నిర్వచనం ప్రకారం నిర్దేశించిన దాని కంటే అధిక స్పీడ్ ఉండాలి. బ్రాడ్‌బ్యాండ్ ప్రస్తుత నిర్వచనం సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి తగ్గట్టుగా లేదు. హైస్పీడ్ కోరుకునే కస్టమర్ల అవసరాలను తీర్చదు’ అని లేఖలో బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం స్పష్టం చేసింది. దేశంలో 4జీ అమలైనప్పటికీ.. ప్రస్తుతం ఉన్న 512 కేబీపీఎస్ వేగం చాలా తక్కువ. 2 ఎంబీపీఎస్‌కు చేర్చాలన్న ప్రతిపాదన చాలా కాలంగా పెండింగులో ఉందని బ్రాడ్‌బ్యాండ్ ఇండియా ఫోరం ప్రెసిడెంట్ టి.వి.రామచంద్రన్ తెలిపారు. ప్రపంచ ప్రమాణాలే కాదు, నేషనల్ పాలసీ ప్రకారం కూడా ఈ వేగం తక్కువ అని ఆయన అన్నారు. ‘4జీ అమలైనప్పటికీ ప్రపంచంలోని మెరుగైన పద్ధతులతో పోలిస్తే సగం కంటే తక్కువగా వేగం ఉంది. టెక్నాలజీ ఏది వాడినా 2 ఎంబీపీఎస్ డౌన్లోడ్, అప్లోడ్ స్పీడ్ అందించేలా నెట్వర్క్ ఉంటేనే బ్రాడ్‌బ్యాండ్‌గా పరిగణించాలి. కస్టమర్ల అవసరాలకు తగ్గట్టుగా బేసిక్, ఫాస్ట్, అల్ట్రా–ఫాస్ట్ విభాగాలుగా బ్రాడ్‌బ్యాండ్ అందించాలి. సేవల అభివృద్ధి, వినియోగదార్ల అంచనాలకు అనుగుణంగా తరచూ పరిశీలన జరగాలి. 2 ఎంబీపీఎస్ కంటే వేగం అనే ప్రామాణికం ప్రధాన అవసరం ఇప్పుడు. అధిక నాణ్యత కలిగిన సేవలకై అదనపు మార్గదర్శకాలను ట్రాయ్ చేర్చాలి. 15 ఎంబీపీఎస్ వేగాన్ని ఫాస్ట్ బ్రాడ్‌బ్యాండ్‌గా, 30 ఎంబీపీఎస్‌ను అల్ట్రా ఫాస్ట్‌గా నిర్వచించాలి’ అని ఫోరం అభిప్రాయపడింది. గూగుల్, ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, ఇంటెల్, క్వాల్కామ్, జియో, స్టార్, సిస్కో వంటి సంస్థలు ఫోరం సభ్యులుగా ఉన్నాయి. -
1000జీబీ ఎయిర్టెల్ బోనస్ డేటా
బ్రాడ్‌బ్యాండు యూజర్లకు ఎయిర్టెల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎయిర్టెల్ తన బిగ్ బైట్ ఆఫర్‌ను 2018 అక్టోబర్ వరకు పొడిగిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద బ్రాడ్‌బ్యాండ్ యూజర్లు అదనంగా 1000జీబీ వరకు బోనస్ డేటా లభించనుంది. తొలిసారి ఈ ఆఫర్ 2017 మేలో లైవ్‌లోకి వచ్చింది. 2018 మార్చి 31తో ఈ ఆఫర్ ముగిసింది. కానీ ఈ ఆఫర్‌ను అక్టోబర్ వరకు పొడిగించనున్నట్టు ఎయిర్టెల్ తాజాగా ప్రకటించింది. ఈ ఆఫర్ ఎయిర్టెల్ రూ.1099, రూ.1299 ప్లాన్లపై అందుబాటులో ఉంటుంది. బేస్ ప్లాన్‌పై ఎంత స్పీడులో డేటా లభిస్తోందో, బోనస్ డేటా కూడా అదే నెట్ స్పీడును యూజర్లకు అందుబాటులో ఉంటుంది. అదనపు డేటాను ప్రతి నెలా క్యారీ ఫార్వర్డ్ చేయనున్నామని, అలా 2018 అక్టోబర్ 31 వరకు లేదా డేటా ముగిసే వరకు చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఈ ప్లాన్ ధరలు రీజన్ రీజన్‌కు వేరువేరుగా ఉన్నాయి. ఢిల్లీ యూజర్లకైతే రూ.1099 ప్లాన్‌పై 250జీబీ అదనపు డేటాతో పాటు 1000జీబీ బోనస్ డేటా లభిస్తోంది. 100 ఎంబీపీఎస్ స్పీడులో ఈ డేటాను ఎంజాయ్ చేసుకోవచ్చు. అపరిమిత లోకల్, ఎస్టీడీ కాల్స్‌ను కూడా యూజర్లు వినియోగించుకోవచ్చు.రెండో ఎయిర్టెల్ ప్లాన్ రూ.1299 కింద అపరిమిత కాల్స్‌ను, 250జీబీ బ్రాడ్‌బ్యాండ్ డేటాను, 1000జీబీ బోనస్ డేటాను యూజర్లు పొందుతారు. దీని స్పీడు కూడా 100ఎంబీపీఎస్. ఈ 1000 బోనస్ డేటాను పొందడమెలా? ఈ ఆఫర్‌ను పొందడానికి పేజీని విజిట్ చేసి, ప్లాన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం మీ వివరాలను నమోదు చేయాలి. ఒక్కసారి ఆ ప్రక్రియంతా అయిపోయిన తర్వాత, అదనపు డేటా ఏడు రోజుల తర్వాత బేస్ ప్లాన్‌కు యాడ్ అవుతుంది. ఈ ఆఫర్ పొండానికి రెండు ప్లాన్లలో(రూ.1099, రూ.1299) ఒకటి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. -
ఎయిర్టెల్ 1000 జీబీ బోనస్ డేటా
బ్రాడ్‌బ్యాండు మార్కెట్లో అడుగుపెట్టి, అక్కడ కూడా సంచలనాలు సృష్టించాలని రిలయన్స్ జియో ప్లాన్స్ వేస్తుండగా... దానికి ముందుస్తుగా ఎయిర్టెల్ కూడా తన కస్టమర్లకు బంపర్ ఆఫర్లను ప్రకటిస్తోంది.. తాజాగా ఎయిర్టెల్ కొత్త బోనస్ డేటా ఆఫర్‌ను తన కస్టమర్లకు తీసుకొచ్చింది. ఈ కొత్త బోనస్ డేటా ఆఫర్ కింద కొత్త కస్టమర్లకు 1000జీబీ వరకు అదనపు డేటా అందించనున్నట్టు పేర్కొంది. ఎయిర్టెల్ ఆఫర్ చేస్తున్న చౌకైన ప్లాన్లు రూ.899 నుంచి ప్రారంభమవుతాయని, దీని కింద నెలకు 60 జీబీ డేటాను, అదనంగా ఏడాదిలో 500జీబీ డేటాను అందించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఎయిర్టెల్ వెబ్సైట్ ప్రకారం ఈ ప్లాన్ స్పీడు 40 ఎంబీపీఎస్ వరకు అని తెలిసింది. మరో ప్లాన్ రూ.1099 కింద 40 ఎంబీపీఎస్ స్పీడులో నెలకు 100జీబీ డేటాను ఆఫర్ చేయనున్నామని, అంతేకాక 1000 జీబీ బోనస్ డేటాను వినియోగదారులకు అందించనున్నట్టు ప్రకటించింది. ఇలా రూ.1299 ప్లాన్‌కు, రూ.1499, రూ.1799 ప్లాన్లకు 1000జీబీ వరకు బోనస్ డేటాను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. కానీ ఇవన్నీ కొత్త కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ వెల్లడించింది. ప్రస్తుతం రిలయన్స్ జియో కూడా తన ఫైబర్ నెట్‌వర్క్‌ను లాంచ్ చేయడానికి టెస్టింగ్ చేస్తోంది. కొన్ని ప్రాంతాల్లో వీటిని లాంచ్చేసింది కూడా. కానీ దేశవ్యాప్తంగా లాంచ్ చేయడానికి జియో ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఇప్పటికే టెలికాం మార్కెట్లోకి జియో ఎంట్రీతో తీవ్ర కుదుపులోకి లోనైనా టెలికాం దిగ్గజాలు, బ్రాడ్‌బ్యాండ్ మార్కెట్లో జియోకు కౌంటర్ ఇచ్చేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నాయి.