హైదరాబాద్: సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం భారీ నజరానా ప్రకటించింది. ఆ సంస్థ ఆర్జించిన లాభాల్లో 21శాతం వాటాను కార్మికులకు బోనస్గా చెల్లించనున్నట్లు స్పష్టం చేసింది. కార్మికుల నుంచి వృత్తి పన్ను కూడా వసూలు చేయబోమని తెలిపింది.
సింగరేణికి మొత్తం రూ.491 కోట్ల లాభం రాగా అందులో కార్మికుల వాటాగా రూ.103 కోట్లు కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బోనస్ గా చెల్లించనుంది. దీంతో ఒక్కో కార్మికుడికి రూ.15వేల నుంచి 20 వేల వరకు లబ్ధి చేకూరనుంది.
సింగరేణి కార్మికులకు తీపి కబురు
Published Thu, Sep 24 2015 6:08 PM | Last Updated on Sun, Sep 2 2018 4:16 PM
Advertisement