సింగరేణి కార్మికులకు దసరా కానుక | Dussehra Bonus For Singareni Workers, A Profit Share Bonus Of Rs.711.18 Crore Will Be Paid On 16th Of This Month - Sakshi
Sakshi News home page

సింగరేణి కార్మికులకు దసరా కానుక

Published Thu, Oct 5 2023 3:40 PM | Last Updated on Thu, Oct 5 2023 4:16 PM

Dussehra Bonus For Singareni Workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సింగరేణి కార్మికులకు దసరా కానుకగా  లాభాల వాటా బోనస్  రూ.711.18 కోట్లను ఈ నెల 16వ తేదీన  చెల్లించనున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు.

సీఎం కేసీఆర్‌ ఇటీవల ప్రకటించిన విధంగా గత ఏడాది సింగరేణి సాధించిన రూ.2222.46 కోట్ల రూపాయలలో 32 శాతం లాభాల బోనస్‌ను దసరా పండుగకు వారం రోజుల ముందే చెల్లిస్తున్నట్లు ఆయన తెలిపారు. సగటున ఒక్కో ఉద్యోగికి రూ. ఒక లక్ష 53 వేల రూపాయల వరకు లాభాల బోనస్ అందనుందని  ఆయన పేర్కొన్నారు.

సింగరేణి సంస్థను లాభాల దిశగా నడిపిస్తున్న కార్మికులకు గతం లో కన్న ఎక్కువ శాతాన్ని లాభాల వాటా ప్రకటించిన సీఎం కేసీఆర్‌కు సింగరేణి ఉద్యోగుల తరఫున ఛైర్మన్‌ కృతజ్ఞతలు తెలిపారు. బోనస్ చెల్లింపుపై  డైరెక్టర్ ఫైనాన్స్ అండ్ పర్సనల్ బలరామ్ గురువారం సర్క్యులర్‌ను జారీ చేశారు.
చదవండి: ఏకపక్షంగా ఓట్లు తొలగించామనడం సరికాదు: సీఈసీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement