
ముంబై: ప్రయివేట్ రంగ సంస్థ బజాజ్ అలియెంజ్ గత ఆర్థిక సంవత్సరానికి (2022 - 23) గాను పాలసీదారులకు రూ. 1,201 కోట్ల విలువైన బోనస్ ప్రకటించింది. వెరసి అర్హతగల పార్టిసిపేటింగ్ పాలసీదారులకు వరుసగా 22వ ఏడాదిలోనూ బోనస్ చెల్లింపులను చేపట్టనున్నట్లు తెలియజేసింది. తాజా బోనస్‌లో రెగ్యులర్ రివర్షనరీ బోనస్ రూ. 872 కోట్లు, టెర్మినల్, క్యాష్ బోనస్ రూ. 329 కోట్లు కలసి ఉన్నట్లు వెల్లడించింది. అంతక్రితం ఏడాది (2021 - 22) రూ. 11.62 లక్షలకుపైగా పాలసీదారులకు రూ. 1,070 కోట్ల బోనస్ చెల్లించింది.