ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999? | iPhone 6 for Rs 5,999 on Flipkart? Yes, but DON'T take that offer | Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999?

Published Thu, Sep 14 2017 6:49 PM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999? - Sakshi

ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6 ధర రూ.5,999?

ఆపిల్‌ తన ఐఫోన్‌ 10వ వార్షికోత్సవ సందర్భంగా ఐఫోన్‌ X అనే స్పెషల్‌ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ఐఫోన్‌ 8, ఐఫోన్‌ 8 ప్లస్‌ అనే రెండు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి లాంచ్‌ చేసింది. ఈ సందర్భంగా పాత ఐఫోన్లన్నింటి ధరలను తగ్గించేసింది. ఐఫోన్‌ 7, ఐఫోన్‌ 7 ప్లస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6 ప్లస్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీగా ధర కోత పెట్టింది. ఈ ధరల తగ్గింపుతో ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ స్మార్ట్‌ఫోన్లు 5,999 రూపాయలకు, 17,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చాయి. అయితే నిజంగా ఐఫోన్‌ 5,999 రూపాయలేనా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును. నిజంగా ఈ ఫోన్‌ రూ.5,999కే అందుబాటులోకి వచ్చింది. కానీ ఇక్కడ ఒక లాజిక్‌ ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్‌ 32జీబీ ఎడిషన్‌ అసలు ధర 25,999 రూపాయలు. అదనంగా ఈ ఫోన్‌పై 3,501 రూపాయల వరకు స్పెషల్‌ డిస్కౌంట్‌ను ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తోంది. అయితే ఈ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌లో కొనుగోలుచేస్తే, 20వేల రూపాయల వరకు తగ్గింపు లభించి, రూ.5999కే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లభించనుందట.
 
అది కూడా ఐఫోన్‌ 7 ప్లస్‌ లాంటి ఏదైనా హై-ఎండ్‌ ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసి దీన్ని కొనుగోలుచేస్తేనే, ఈ స్మార్ట్‌ఫోన్‌ రూ.5,999కు లభ్యంకానుంది. కానీ ఐఫోన్‌ 7 ప్లస్‌ లాంటి స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసి ఐఫోన్‌ 6ను ఎవరు కొనుగోలుచేస్తారు? ఇదే ఇక్కడ ప్రశ్నార్థకంగా మారింది. ఈ ఎక్స్చేంజ్‌ ఆఫర్‌ చాలా హాస్యాస్పదంగా, తప్పుదోవ పట్టించే విధంగా ఉందని పలువురంటున్నారు. ఐఫోన్‌ 6ఎస్‌ విషయంలో తీసుకున్న కూడా ఇదే విధమైన ఆఫర్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఐఫోన్‌ 6ఎస్‌ 32జీబీ వేరియంట్‌ అసలు రూ.37,999కు లిస్టు అయింది. కానీ ఫ్లిప్‌కార్ట్‌ దీన్ని రూ.17,999కు విక్రయిస్తోంది. ప్రీమియం, ఖరీదైన ఫోన్‌ను ఎక్స్చేంజ్‌ చేసి, దీన్ని కొనుక్కుంటే, ఈ ఆఫర్‌ వర్తిస్తుందని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement