సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
సొంతంగా ఐఫోన్ తయారీ.. వీడియా వైరల్
Published Fri, Apr 14 2017 9:08 AM | Last Updated on Tue, Sep 5 2017 8:46 AM
స్మార్ట్ ఫోన్ మార్కెట్లో బ్రాండెట్ ఫోన్ గా ముద్రపడిన ఐఫోన్ కొనుక్కోవాలంటే మీరందరూ ఎక్కడికి వెళ్తారు.. ఆపిల్ స్టోర్ కు లేదా ఆన్ లైన్ ను ఆశ్రయిస్తారు. కానీ ఓ వ్యక్తి మాత్రం మీ అందరికీ భిన్నంగా ఆలోచించాడు. ఐఫోన్ కొనుక్కోవాలంటే వాటి వద్దకే వెళ్లాలా.. సింపుల్ గా మనమే తయారీచేసుకుంటే పోలా అని రంగంలోకి దిగేశాడు. ఐఫోన్ కు కావాల్సిన విడి భాగాలన్నింటిన్నీ చైనాలోని ఫేమస్ మార్కెట్ షెన్జెన్ నుంచి సేకరించి, బెస్ట్ సెల్లింగ్ మొబైల్ గా పేరు తెచ్చుకుంటున్న ఐఫోన్ 6ఎస్ ను తయారీచేసేశాడు.
తాను ఐఫోన్ 6ఎస్ ఎలా రూపొందించాడో తెలుపుతూ ప్రాథమిక ప్రక్రియ నుంచి తుది దశ వరకు ఐఫోన్ తయారీ వీడియోను యూట్యూబ్ లోని స్ట్రేంజ్ పార్ట్స్ ఛానల్ లో పెట్టాడు.ఇక అంతే ఆ వీడియోకు లైక్స్, కామెంట్స్ యూట్యూబ్ లో దంచికొడుతున్నాయి. కేవలం ఆ ఒక్క వీడియోతోనే ఆ ఛానల్ కు 20వేల మంది సబ్స్క్రైబర్లు యాడ్ అయ్యారు. అది కూడా కేవలం 22 గంటల్లోనేనట. ఆ వ్యక్తి రూపొందించిన వీడియోకు 2500 కామెంట్లు రాగా, 25వేల లైక్స్, లక్షల కొద్దీ వ్యూస్ వెల్లువెత్తాయి. మెటల్ బ్యాక్ కేసును సెర్చ్ చేయడం నుంచి వీడియో ప్రారంభమవుతుంది.
అక్కడి నుంచి ఐఫోన్ కు అవసరమైన విడిభాగాలన్నింటిన్నీ చైనాలోని షెన్జెన్ మార్కెట్లో వెతుకుతూ ఒక్కొక్కటిగా అమర్చడం ఈ వీడియోలో చూపించాడు ఆ వ్యక్తి. గ్లాస్ ప్యానల్, డిజిటైజర్, ఎల్సీడీ ప్యానల్, బ్యాక్ లైట్, లాజిక్ బోర్డు, బ్యాటరీ, కెమెరా మోడ్యుల్, హోమ్ బటన్, స్క్రీవ్యూస్ వంటి వాటిని ఆ వ్యక్తి మార్కెట్లో పొందడం, అమర్చడం, ఫెయిల్ అవ్వడం మళ్లీ అసెంబ్లింగ్ చేయడం వంటివన్నీ ఈ వీడియోలో చూపించాడు. ఎట్టకేలకు తన కోసం తాను సొంతంగా ఐఫోన్ 6ఎస్ తయారుచేసుకున్నట్టు పేర్కొన్నాడు.
Advertisement
Advertisement