స్మార్ట్ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్! | Apple admits the iPhone 6s battery problem is more widespread than first thought | Sakshi
Sakshi News home page

స్మార్ట్ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్!

Published Wed, Dec 7 2016 9:48 AM | Last Updated on Mon, Aug 20 2018 2:55 PM

స్మార్ట్ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్! - Sakshi

స్మార్ట్ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్!

ప్రముఖ మొబైల్ కంపెనీలను బ్యాటరీ కష్టాలువెన్నాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో  శాంసంగ్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఆపిల్ కూడా దాదాపు ఇదే బాటలో పయినిస్తోంది. తాజాగా  ఐఫోన్ 6s బ్యాటరీ సమస్య  సీరియస్ గానే  ఉన్నట్టు యాపిల్  అంగీకరించింది. తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది.

 
మొదట్లో  కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలోనే సమస్య ఉందని   చెప్పిన యాపిల్  స్థానిక  ఏజెన్సీ నుంచి  తీవ్ర ఒత్తిడి  రావడంతో చివరికి చైనీస్ వెబ్ సైట్ లో తప్పును ఒప్పుకుంది. దీనికి  సంబంధించి మంగళవారం ఒక నోటీసును వెబ్  సైట్ లో  పోస్ల్ చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్  లోసమస్య అయి వుండవచ్చని భావిస్తోంది. దీన్ని పరిష్కరించడానికి  డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది. మరోవైపుకొద్ది రోజుల కిందట  చైనీస్  వాచ్ డాగ్ యాపిల్ 6 ఎస్ తో పాటు 5ఎస్ లో  కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు  రిపోర్ట్ చేసింది.  అయితే దీనిపై యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా ఐ ఫోన్  6ఎస్   అకస్మాత్తుగా షట్ డౌన్  కావడం,  పేలుడు సంభవిస్తున్నట్టుగా   వినియోగదారులు ఫిర్యాదు చేశారు.  దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015 లో  విక్రయించిన  ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ ఉచితంగా  రిపేర్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement