Widespread
-
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీపై యాపిల్ షాకింగ్ న్యూస్!
ప్రముఖ మొబైల్ కంపెనీలను బ్యాటరీ కష్టాలువెన్నాడుతున్నాయి. స్మార్ట్ ఫోన్ బ్యాటరీ పేలుళ్లతో శాంసంగ్ భారీగా నష్టాలను మూటగట్టుకుంది. ఆపిల్ కూడా దాదాపు ఇదే బాటలో పయినిస్తోంది. తాజాగా ఐఫోన్ 6s బ్యాటరీ సమస్య సీరియస్ గానే ఉన్నట్టు యాపిల్ అంగీకరించింది. తాము మొదట ఊహించిన దానికంటే చాలా విస్తృతంగా ఉన్నట్టు భావిస్తున్నట్టు ధృవీకరించింది. మొదట్లో కొన్ని లిమిటెడ్ ఐ ఫోన్లలోనే సమస్య ఉందని చెప్పిన యాపిల్ స్థానిక ఏజెన్సీ నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో చివరికి చైనీస్ వెబ్ సైట్ లో తప్పును ఒప్పుకుంది. దీనికి సంబంధించి మంగళవారం ఒక నోటీసును వెబ్ సైట్ లో పోస్ల్ చేసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం సాఫ్ట్వేర్ లోసమస్య అయి వుండవచ్చని భావిస్తోంది. దీన్ని పరిష్కరించడానికి డేటా అదనపు విశ్లేషణ అవసరమవుతుందని తెలిపింది. మరోవైపుకొద్ది రోజుల కిందట చైనీస్ వాచ్ డాగ్ యాపిల్ 6 ఎస్ తో పాటు 5ఎస్ లో కూడా సమస్యలు ఉత్పన్నమైనట్టు రిపోర్ట్ చేసింది. అయితే దీనిపై యాపిల్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా ఐ ఫోన్ 6ఎస్ అకస్మాత్తుగా షట్ డౌన్ కావడం, పేలుడు సంభవిస్తున్నట్టుగా వినియోగదారులు ఫిర్యాదు చేశారు. దీంతో సమస్య ఉందని ఒప్పుకన్న సంస్థ సెప్టెంబర్ లేదా అక్టోబర్ 2015 లో విక్రయించిన ఐఫోన్ 6ఎస్ బ్యాటరీ ఉచితంగా రిపేర్ చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
గడప గడపకూ వైఎస్ఆర్సీపీకి విశేష స్పందన
-
సాక్షి భవిత అవగాహన సదస్సుకు విశేష స్పందన
-
‘ఎమ్మెల్యే ఉద్యోగ మేళా’కు విశేష స్పందన
భివండీ: పట్టణంలోని పద్మనగర్‌లో శివసేన ఎమ్మెల్యే రుపేశ్ మాత్రే ఏర్పాటు చేసిన ‘ఎమ్మెల్యే ఉద్యోగ మేళా’కు విశేష స్పందన లభించింది. అఖిల పద్మశాలి సమాజ్ మంగళ కార్యాలయంలో తెలుగు ప్రజాసేవ సంస్థ, మహేంద్ర సమాజ్ కళ్యాణ్ కారీ సంస్థ నేతృత్వంలో నిర్వహించిన ఈ మేళాలో సుమారు 9500 మంది పాల్గొన్నారని, వీరిలో 3,500 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఐసీఐసీఐ లాంబార్డ్, టాటా కంపెనీ, సెరికో, ఫేస్ సెట్టర్, ఫ్లిప్‌కార్ట్, స్నాప్‌డీల్, బిగ్‌బజార్, ఫాంటలూస్, టెక్ మహీంద్రా తదితర కంపెనీలు మేళాలో పాల్గొన్నాయి. -
వెన్నెల్లో హాయ్‌హాయ్
- బోటులో బ్రేక్‌ఫాస్ట్, క్యాండిల్ డిన్నర్‌కు విశేష స్పందన - ఆకర్షితులవుతున్న పర్యాటకులు - పుష్కర యాత్ర స్పెషల్స్ హౌస్‌ఫుల్ సాక్షి, విజయవాడ : పర్యాటకులను ఆకట్టుకునేందుకు ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రవేశపెట్టిన (ఏపీటీడీసీ) కొత్త ప్యాకేజీలకు విశేష స్పందన లభిస్తోంది. క్యాండిల్ డిన్నర్, బోటులో బ్రేక్‌ఫాస్ట్‌పై పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఉదయం కృష్ణానదిలో బోటులో తిరుగుతూ బ్రేక్‌ఫాస్ట్, రాత్రిపూట కొవ్వొత్తుల వెలుగులో డిన్నర్ చేసే కార్యక్రమాన్ని ఏపీటీడీసీ ఇటీవలే ప్రారంభించింది. ఈనెల 5వ తేదీన తొలిసారిగా క్యాండిల్ డిన్నర్‌ను ఏర్పాటుచేయగా, 30 మంది పర్యాటకులు పాల్గొన్నారు. 12వ తేదీ ఆదివారం ఒక కంపెనీ తన సిబ్బం దికి ఆటవిడుపు కలిగించడం కోసం 50 మందితో క్యాండిల్ డిన్నర్‌కు బుకింగ్ చేసుకుంది. సాధారాణ రోజుల్లో 10-15 మంది వస్తున్నట్లు తెలిసింది. వీనుల‘విందు’ క్యాండిల్ డిన్నర్ రాత్రి 8 నుంచి 9 గంటల వరకు ఉంటుంది. కృష్ణానదిలో బోటులో విహరిస్తూ చల్లనిగాలుల మధ్య వీనులవిందైన సంగీతం వింటూ రుచికరమైన వంటలు తినొచ్చు. మెనూలో రైస్‌తో పాటు పుల్కాలు, బిర్యానీ, పప్పు, రెండు రకాల కూరలు, స్వీట్స్, హాట్స్ ఉంటాయి. పెద్దలకు రూ.300, పిల్లలకు రూ.200 చెల్లించాలి. ఉదయం పూట సూర్యుడి లేలేత కిరణాలు తాకుతుండగా, నదిలో తిరుగుతూ ఇడ్లీ, పూరి, దోసె, గారెలు వంటి రుచికరమైన వంటలు వేడివేడిగా ఆరగించొచ్చు. ప్రచారం అవసరం క్యాండిల్ డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్‌కు ప్రచారం కల్పిస్తే మరింత ఆదాయం వచ్చే అవకాశం ఉందని పర్యాటకులు అభిప్రాయపడుతున్నారు. పుష్కర ప్యాకేజీలు ఫుల్ గోదావరి పుష్కరాల కోసం నగరం నుంచి రాజమండ్రికి ఏపీటీడీసీ ఏర్పాటుచేసిన రెండు ప్యాకేజీల బస్ సర్వీస్ ఈనెల 13 నుంచి 19వ తేదీ వరకు ఫుల్ అయిపోయాయి. విజయవాడ-రాజమండ్రి-అంతర్వేది- పాలకొల్లు- భీమవరం-విజయవాడ, విజయవాడ-రాజమండ్రి, భీమవరం-విజయవాడ ప్యాకేజీలను భక్తులు ఎక్కువగా బుక్ చేసుకున్నారని, ఏపీటీడీసీ విజయవాడ డివిజనల్ మేనేజర్ వీవీఎస్ గంగరాజు తెలిపారు. కాగా, గోదావరి పుష్కర స్పెషల్‌కు మంచి డిమాండ్ ఏర్పడటంతో ఏసీ బస్సు కావాలని ఉన్నతాధికారులను కోరినట్లు తెలిసింది. ఈ బస్సు వస్తే ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు రోజూ నడపాలని అధికారులు భావిస్తున్నారు. -
వన్‌టైం సెటిల్మెంట్కు విశేష స్పందన
రూ.3.07 కోట్ల బకాయిలు వసూలు చేసిన డీసీసీబీ హన్మకొండ : వన్‌టైం సెటిల్మెంట్ ద్వారా రుణాలు చెల్లించాలని డీసీసీబీ పాలకవర్గం ఇటీవల చేసిన ప్రకటనకు రైతుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ మేరకు అధికారులు జిల్లా వ్యాప్తంగా రూ.3.07కోట్ల మొండి బకాయిలు వసూలు చేయడం గమనార్హం. వివరాల్లోకి వెళితే.. పేరుకుపోయిన దీర్ఘకాలిక రుణాల వసూళ్లకు డీసీసీబీ పాలకవర్గం గత డిసెంబర్లో వన్‌టైం సెటిల్మెంట్ పథకాన్ని చేపట్టింది. అయితే గతంలో బావుల వద్ద పైపులైన్లు వేసుకునేందుకు, ట్రాక్టర్ల కొనుగోలు, పాడి, గొర్రెల పెంపకం, కోళ్ల పరిశ్రమల ఏర్పాటుకు డీసీసీబీ రైతులకు రుణాలు అందించింది. కాగా, 1992 సంవత్సరానికి ముందు రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాలు చెల్లించకపోవడంతో పెద్దఎత్తున పేరుకుపోయాయి. దీంతో బకాయిలు బ్యాంకును నష్టాల్లో చూపిస్తున్నాయి. అయితే వాటిని ఎలాగైనా రాబట్టుకోవాలనే ఆలోచనతో పాలకవర్గం, అధికారులు వన్‌టైం సెటిల్మెంట్కు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్లో దీర్ఘకాలిక రుణాలు ఏక మొత్తంలో చెల్లించిన రైతులకు లాభం చేకూర్చేందుకు పథకాన్ని ప్రకటించారు. కాగా, డీసీసీబీలో 1992 నుంచి 700 మంది రైతులకు చెందిన రూ.8.08కోట్లు బకాయిలు పేరుకుపోయాయి. అయితే వాటిని తిరిగి వసూలు చేయాలనే ఉద్దేశంతో డిసెంబర్లో ఒకే మొత్తంలో రుణాన్ని చెల్లించిన వారికి 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతుల నుంచి స్పందన వచ్చింది. అసలు, వడ్డీ కలుపుకుని మొత్తంలో 35 శాతం మాఫీని ప్రకటించడంతో రైతులు పాత బకాయిలు చెల్లించేందుకు ముందుకొచ్చారు. దీనికి తోడు డీసీసీబీకి చెందిన 26 ప్రత్యేక బృందాలు రైతులను నేరుగా కలిసి అవగాహన కల్పించడంతో పాటు ఒత్తిడి పెంచారు. ఈ క్రమంలో సుమారు 300 మంది రైతులు తమ బకాయిలు రూ.3.07 కోట్లు చెల్లించారు. కాగా, ఒకేసారి బకాయిలు చెల్లించడం ద్వారా 35 శాతం కింద డీసీసీబీకి రూ.1.07 లక్షల మాఫీ ద్వారా లబ్ధి చేకూరింది. అలాగే రైతులకు ప్రయోజనం కలిగింది. -
బుక్ ఫెయిర్‌కు విశేష స్పందన
జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందే భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్‌రావు పుస్తక పఠనంతోనే కేసీఆర్‌కు అపారమైన విజ్ఞానం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తోన్న 28వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కు పుస్తక ప్రియుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మూడో రోజైన శుక్రవారం పుస్తక ప్రదర్శనలోని స్టాళ్లు సందర్శకులతో కిక్కిరిసిపోయాయి. బాలసాహిత్యం, నవలలు, కమ్యూనిజం రచనలు, వ్యక్తిత్వ వికాసం, పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలు, గణితం, సామాజిక అంశాలతో కూడిన అనేక రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. జాతీయ, అంతర్జాతీయ మహనీయుల జీవిత చరిత్రల పుస్తకాలు ప్రతి ఒక్కరిన్ని ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల నోబుల్ బహుమతి అందుకున్న మలాల పుస్తకం ఈ ప్రదర్శనలో ప్రత్యేకంగా నిలిచింది. కవాడిగూడ : పుస్తక పఠనం ద్వారానే ముఖ్యమంత్రి కేసీఆర్ అపారమైన విజ్ఞానాన్ని సముపార్జించారని భారీ నీటిపారుదల శాఖ మంత్రి, కేసీఆర్ మేనల్లుడు టి.హరీష్‌రావు అన్నారు. పుస్తక ప్రదర్శనలో భాగంగా ఎన్టీఆర్ స్టేడియంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వందేళ్ల జీవిత అనుభవాలు పుస్తక రూపంలో చదువుకోవచ్చన్నారు. కొన్ని విలువైన పుస్తకాలు తిరిగి ముద్రణకు నోచుకోకపోవడంతో కనుమరుగు అవుతున్నట్టు ఆవేదన వ్యక్తం చేశారు. అలాంటి ముఖ్యమైన పుస్తకాలను ముద్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి చెరువులపై ఓ పుస్తకాన్ని ముద్రించాల్సి ఉండగా, పని ఒత్తిడి కారణంగా జాప్యం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పుస్తకాాలతో ఉన్న అనుబంధాన్ని హరీష్‌రావు వివరించారు. ఎమ్మెల్యే కాక మునుపు అన్నం తినగానే పుస్తకాలను పట్టుకొని ఊర్లో మంచి వాతావరణం కలిగిన చెరువు గట్టుకు వెళ్లి పుస్తకాలు చదవడం పూర్తయిన తర్వాతనే వచ్చేవారని తెలిపారు. ఎమ్మెల్యే అయిన తర్వాత నాలుగైదు రోజులు నాగర్జున సాగర్‌కు వెళ్లి సుమారు 20 పుస్తకాలు చదవడం పూర్తయాకే వచ్చేవారన్నారు. అంతటి పుస్తక పరిజ్ఞానంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ విశేషమైన, అపారమైన అనుభవాన్ని గడించారని తెలిపారు. ఉమ్మడి పాలనలో వచ్చిన జన్మభూమి విజన్ డాక్యుమెంట్ కేసీఆర్ రాసిందేనని వివరించారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ ద్వారా 800 ఏళ్ల చరిత్ర కలిగిన చెరువులను పునరుద్ధరించేందుకు, కాపాడుకునేందుకు చేస్తున్న యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై, సహకరించాలని కోరారు. కార్యక్రమంలో బుక్ ఫెయిర్ అధ్యక్షులు జూలూరు గౌరీ శంకర్, కార్యదర్శి చంద్రమోహన్, కవులు నందిని సిధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.