టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే... | 10 Android smartphones that cost more than iPhone 6S in India | Sakshi
Sakshi News home page

టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే...

Published Mon, May 30 2016 1:56 PM | Last Updated on Sat, Aug 18 2018 4:45 PM

టాప్ టెన్  కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే... - Sakshi

టాప్ టెన్ కాస్ట్లీ స్మార్ట్ ఫోన్లు ఇవే...

ఇన్నిరోజులు అత్యధిక ధరలున్న స్మార్ట్ ఫోన్లు ఏవీ అంటే.. యాపిల్ ఐఫోన్ స్మార్ట్ ఫోన్లేనని చటుక్కున చెప్పేవాళ్లం. కానీ యాపిల్ ఐఫోన్ కంటే  మించి ధరలున్న  స్మార్ట్  ఫోన్లు మార్కెట్లో ఉన్నాయట. చాలా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు యాపిల్ లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ ఐఫోన్ 6ఎస్ ధరకి సమానంగా లేదా దానికంటే ఎక్కువగా ధరలను భారత మార్కెట్లో ఆఫర్ చేస్తున్నాయి.
ఐఫోన్ కంటే ధరలు అధికంగా ఉన్న 10 ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు....


1. హెచ్ టీసీ 10 :  మెటల్ డిజైన్ తో రూపొందిన ఈ ఫోన్ ను ఇటీవలే మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ధర రూ.52,990.  
                       ఫోన్ ఫీచర్లు...5.2 అంగుళాల 2కె డిస్ ప్లే  820  క్వాల్కం  స్నాప్ డ్రాగన్  ప్రాసెసర్
                                        1440x2560 ఫిక్సల్స్
                                         4జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్.
                                         12 మెగాఫిక్సెల్, అల్ట్రా మెగా ఫిక్సెల్ కెమెరా విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్
                                         5 మెగాఫిక్సె ల్ ఫ్రంట్ కెమెరా
                                         3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ
2. ఎల్ జీ జీ5 : జీ5 స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ ఇంకా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టలేదు. కానీ ఈ ఫ్లాగ్ షిప్ కు ఈ-కామర్స్ వెబ్ సైట్ లో ముందస్తు బుకింగ్  లు మొదలయ్యాయి. ధర హెచ్ టీసీ 10కి సమానంగా రూ.52,990గా కంపెనీ నిర్ణయించింది.
        ఎల్ జీ జీ5 ఫీచర్లు... 5.3 అంగుళాల క్వాడ్ హెచ్ డీ ఐపీఎస్ డిస్ ప్లే
                                   క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్
                                   4 జీబీ ర్యామ్, 32జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
                                  16 ఎంపీ అండ్ 8 ఎంపీ రెండు వెనుక కెమెరాలు
                                    8 ఎంపీ ముందు కెమెరా
                                    2800 ఎంఏహెచ్ బ్యాటరీ

3. సోనీ ఎక్స్ పీరియా : సోనీ ఎక్స్ పీరియా జడ్5  ప్రీమియం ను సోనీ ఆవిష్కరించింది. హెచ్ టీసీ, ఎల్జీలకు సమానమైన ధరనే సోనీ ఈ స్మార్ట్ ఫోన్ కు నిర్ణయించింది. దీని ధర కూడా రూ.52,990నే.
              ఫోన్ ఫీచర్లు....5.5 అంగుళాల యూహెచ్డీ రెజుల్యూషన్ ట్రిల్యుమినోస్ డిస్  ప్లే
                                క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్
                                3జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
                               23 మెగాపిక్సెల్ వెనుక కెమెరా
                               5మెగా పిక్సెల్ ముందు కెమెరా
                               3430 ఎంఏహెచ్ బ్యాటరీ

4. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్ 7 ఎడ్జ్ : శామ్ సంగ్ తన గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ను, గెలాక్సీ ఎస్7 లను రెండింటినీ రూ.56,900కు భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది.
       ఫోన్ ఫీచర్లు... ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో
                          5.1 అంగుళాల క్యూహెచ్ డీ అమోలెడ్ డిస్ ప్లే
                         ఆక్టా కోర్ ఎక్సీనోస్ 8890  ప్రాసెసర్
                         4 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
                         12 ఎంపీ వెనుక కెమెరా
                          5ఎంపీ ముందు కెమెరా
                         3600 ఎంఏహెచ్ బ్యాటరీ

5. బ్లాక్ బెర్రీ : కెనడా మొబైల్ హ్యాండ్ సెట్ల తయారీ కంపెనీ తొలిసారిగా ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ పై పనిచేసే స్మార్ట్ ఫోన్"ప్రివ్"ను భారత మార్కెట్లోకి ఈ జనవరిలో తీసుకొచ్చింది. దీని ధర రూ.55,649.
        స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు ... 5.4 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే
                               1.8 గిగాహెర్ట్జ్ హెక్జా కోర్ క్వాల్‌కామ్ స్నాప్ డ్రాగన్ 808 ప్రాసెసర్
                                 3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమరీ
                                18 ఎంపీ ముందు కెమెరా,
                                 2 ఎంపీ వెనుక కెమెరా
                               3,410 ఎంఏహెచ్ బ్యాటరీ

6.  శామ్ సంగ్ గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్ : రూ.57,900కి గతేడాది ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ.53,895లకి మార్కెట్లో లభ్యమవుతోంది.
     ఫోన్ ఫీచర్లు..5.7 అంగుళాల క్వాడ్ హెచ్ డీ డిస్ ప్లే
                      ఎక్సీనోస్ ఆక్టా కోర్ ప్రాసెసర్
                      4 జీబీ ర్యామ్,32 జీబీ స్టోరేజ్
                       3000 ఎంఏహెచ్ బ్యాటరీ

7.  సోనీ ఎక్స్ పీరియా జడ్3 ప్లస్ : ఐఫోన్ 6ఎస్ 16 జీబీ మోడల్ కంటే ఈ ఫోన్ ఖరీదే ఎక్కువ. ఈ ఫోన్ ప్రస్తుతం రూ.52,990కి మార్కెట్లో లభ్యమవుతోంది.
    ఈ ఫోన్ ఫీచర్లు...5.5 అంగుళాల హెచ్ డీ డిస్ ప్లే
                          క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 810 ప్రాసెసర్
                           3 జీబీ ర్యామ్, 32 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
                          20.7 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
                          5 మెగా పిక్సెల్ ముందు కెమెరా
                            2,930 ఎంఏహెచ్ బ్యాటరీ

8. శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 5 : ఈ స్మార్ట్ ఫోన్ ను రూ.51,400లకు భారత మార్కెట్లోకి శామ్ సంగ్ లాంచ్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోన్ రూ. 50,864లకు భారత మార్కెట్లో అందుబాటులో ఉంది.
    ఈ ఫోన్ ఫీచర్లు...5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే,
                           ఎక్సీ నోస్ ఆక్టా కోర్
                            4 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
                            16 మెగా పిక్సెల్ వెనుక కెమెరా
                              5 మెగా పిక్సెల్ ముందు కెమెరా

9. శామ్ సంగ్ గెలాక్సీ నోట్ 4 : శామ్ సంగ్ నోట్ సిరీస్ లో ఇది నాలుగో స్మార్ట్ ఫోన్. ఈ హ్యాండ్ సెట్ ను రూ.58,300గా 2014లో భారత మార్కెట్లోకి శామ్ సంగ్ ప్రవేశపెట్టింది.. ప్రస్తుతం ఇది రూ.49,900లకు మార్కెట్లో లభ్యమవుతోంది.
    ఈ ఫోన్ ఫీచర్లు... 5.7 అంగుళాల క్యూహెచ్ డీ డిస్ ప్లే
                         క్వాడ్ కోర్ స్నాప్ డ్రాగన్ 805 ప్రాసెసర్
                          3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
                        16 ఎంపీ వెనుక కెమెరా
                         3.7 ఎంపీ ముందు కెమెరా
                         3220 ఎంఏహెచ్ బ్యాటరీ  
10. హెచ్ టీసీ వన్(ఎమ్8) : ఈ పాత హెచ్ టీసీ వన్(ఎమ్8) ధర కూడా ఐఫోన్ కంటే ఎక్కువగానే ఉంది. రూ.48,000గా ఆన్ లైన్ రిటైలర్స్ లో లభ్యమవుతోంది. 2014లో ఈ ఫోన్ లాంచ్ అయింది.
    ఈ ఫోన్ ఫీచర్లు...5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే
                        క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 801 ప్రాసెసర్
                         2 జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్ బిల్ట్ స్టోరేజ్
                        ఆల్ట్రాపిక్సెల్ రేర్ కెమెరా, 5 ఎంపీ ముందు కెమెరా
                            2600 ఎంఏహెచ్ బ్యాటరీ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement