Flipkart Brings Refurbished Smartphones: All Apple Iphones and Android Phones On Sale - Sakshi
Sakshi News home page

ఫ్లిప్‌కార్ట్‌ బంపరాఫర్‌..! రూ. 60 వేల విలువైన ఐఫోన్‌ రూ.15 వేలకే..ఇంకా మరెన్నో ఆఫర్స్‌

Published Sun, Apr 10 2022 8:52 PM | Last Updated on Mon, Apr 11 2022 11:43 AM

Flipkart Brings Refurbished Iphones and Android Phones Sale - Sakshi

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ యాపిల్, శాంసంగ్, గూగుల్, రెడ్‌మీ వంటి సెకండ్ హ్యాండ్ లేదా రిఫర్బిష్డ్ (Refurbished) స్మార్ట్‌ఫోన్‌లపై ప్రత్యేక సేల్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో భాగంగా యాపిల్, శామ్ సంగ్, గూగుల్, రెడ్‌మీ రిఫర్బిష్డ్  స్మార్ట్‌ఫోన్స్‌ అతి తక్కువ ధరలకే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ఈ రిఫర్బిష్డ్ స్మార్ట్‌ఫోన్‌లను అమ్మకానికి తీసుకొని వచ్చే ముందు 47 రకాల తనిఖీల చేసినట్లు ఫ్లిప్‌కార్ట్ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లు కొత్త మొబైల్స్ ధీటుగా పనిచేయనున్నట్లు సంస్థ పేర్కొంది. 



 

తక్కువ ధరలో ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోన్న పలు రిఫర్బిష్డ్‌ స్మార్ట్‌ఫోన్స్‌ ఇవే..

యాపిల్ ఐఫోన్ 6ఎస్
రిఫర్బిష్డ్ గోల్డ్ కలర్ ఐఫోన్ 6ఎఎస్ 64జీబీ  వేరియెంట్ కేవలం రూ. 10,899కు మాత్రమే అందుబాటులో ఉంది. దీనిలో టచ్ ఐడీ సపోర్ట్ గల 4.7 అంగుళాల రెటీనా డిస్ ప్లే ఉంది. యాపిల్ ఐఫోన్ 6ఎస్ 5 ఎంపీ సెల్ఫీ కెమెరాతో పాటు 12 ఎంపీ రియర్ కెమెరాతో వస్తుంది. ఐఫోన్ 6ఎస్‌లో  ఏ9 ప్రాసెసర్ ఉంది. ఐఫోన్ 6ఎస్ 16జీబీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.49,999 అయితే, ఈ సేల్‌లో మీకు రూ.9,999లకు లభిస్తుంది. ఇది సిల్వర్, స్పేస్ గ్రే రంగులలో లభిస్తుంది.

యాపిల్‌ ఐఫోన్‌ 7
రిఫర్బిష్డ్ యాపిల్‌ ఐఫోన్‌ 7 రూ. 14,529 ధరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. దీని అసలు ధర రూ. 59, 999గా ఉంది.

గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్
64జిబి ర్యామ్ గల రిఫర్‌బ్రిష్డ్‌ గూగుల్ పిక్సెల్ 3 ఎక్స్ఎల్ మొబైల్ రూ. 13,999కు అందుబాటులో ఉంది. పిక్సెల్ 3 ఎక్స్ఎల్'లో 6.3 అంగుళాల క్యూహెచ్ డి+ డిస్ ప్లే, 12.2 మెగా పిక్సల్ రియర్ కెమెరా ఉన్నాయి. ఇది డ్యూయల్ 8మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్, 3,430 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.

పిక్సెల్ 3ఏ
కాంపాక్ట్ ఫామ్ ఫ్యాక్టర్ 64జీబీ ఫోన్ రూ. 10,789కు లభిస్తుంది. దీనిలో 5.6 అంగుళాల FHD+ డిస్ ప్లే, 3 ఎక్స్ఎల్ స్మార్ట్‌ఫోన్‌లో అదే రియర్ లెన్స్ ఉంది. అయితే సెల్ఫీల కోసం కేవలం 8 మెగా పిక్సల్ కెమెరా మాత్రమే ఉంటుంది. పీక్సెల్ 3ఏలో 3,000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 670 ప్రాసెసర్ ఉంది.

చదవండి: హెచ్చరిక..! మీ స్మార్ట్‌ఫోన్‌ నుంచి ఈ యాప్స్‌ను వెంటనే డిలీట్‌ చేయండి..లేకపోతే..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement