న్యూఢిల్లీ: దేశంలో రీఫర్బిష్డ్ ఫోన్లు (పునరి్వనియోగ), ఎల్రక్టానిక్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. రానున్న పండుగల సీజన్‌లో గతేడాదితో పోలిస్తే ఈ విభాగం నుంచి ఆదాయం 18 శాతం వృద్ధి చెందుతుందని పరిశ్రమ అంచనా వేస్తోంది. దీంతో కొత్త ఫోన్ల విభాగంలో 7 శాతం వృద్ధిని పునరి్వనియోగ ఫోన్ల మార్కెట్ అధిగమించనుంది. క్యాషిఫై, రీఫిట్ గ్లోబల్ ఈ రెండూ రీఫర్బిష్డ్ ఫోన్లు, రీఫర్బిష్డ్ ఎల్రక్టానిక్ ఉత్పత్తులను విక్రయించే ప్రముఖ సంస్థలు కాగా, వచ్చే పండుగల సందర్భంగా అమ్మకాలు గణనీయంగా పెరుగుతాయనే అంచనాలతో ఉన్నాయి. ముఖ్యంగా ఖరీదైన రీఫర్బిష్డ్ ఫోన్లకు ఎక్కువ డిమాండ్ కనిపిస్తోంది. ‘‘మా ఆదాయం మూడు రెట్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నాం.
2021–22 రికార్డు ఆదాయన్ని డిసెంబర్ నాటికే అధిగమించనున్నాం’’అని రీఫిట్ గ్లోబల్ సహ వ్యవస్థాపకుడు సాకేత్ సౌరవ్ తెలిపారు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలతో రిఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు సంబంధించి ఈ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి. యాపిల్, వన్‌ప్లస్ బ్రాండ్ల రీఫర్బిష్డ్ ఫోన్లకు పెద్ద పట్టణాల్లో మంచి ఆదరణ ఉన్నట్టు సౌరవ్ తెలిపారు. గత 8–10 నెలల్లో యాపిల్, వన్‌ప్లస్ నుంచి సరఫరాలు పెరిగినట్టు చెప్పారు. గతంలో ఈ రెండు బ్రాండ్లు మొత్తం అమ్మకాల్లో 3–3.5 శాతం వాటా కలిగి ఉండేవని, ఇప్పుడు 9–10 శాతానికి పెరిగినట్టు పేర్కొన్నారు.
బలమైన అంచనాలు..
దేశంలో రీఫర్బిష్డ్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల విక్రయాల్లో అగ్రగామి కంపెనీ క్యాషిఫై దీపావళి సందర్భంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించనున్నట్టు ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే పండుగల సీజన్‌లో రెండింత విక్రయాలను అంచనా వేస్తున్నట్టు పేర్కొంది. ఓమ్నిచానల్ నమూనాను క్యాషిఫై అనుసరిస్తోంది. 2,000కు పైగా రిటైల్ స్టోర్లలోను ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్టు సంస్థ సహ వ్యవస్థాపకుడు నకుల్ కుమార్ తెలిపారు. రీఫర్బిష్డ్ స్మార్ట్ వాచ్‌లు, ల్యాప్‌టాప్‌ల విభాగాలనూ ప్రవేశపెట్టనున్నట్టు చెప్పారు.
యాపిల్, శామ్‌సంగ్, వన్‌ప్లస్ ఉత్పత్తులను రూ.18,000–22,000 శ్రేణిలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ స్టోర్లలో అందబాటులో ఉంచనున్నట్టు తెలిపారు. రానున్న పండుగల సమయంలో రీఫర్బిష్డ్ విభాగం వార్షికంగా క్రితం ఏడాది ఇదే కాలంలోని గణాంకాలతో పోల్చి చూస్తే 18 శాతం వృద్ధి నమోదు కా>వచ్చని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ డైరెక్టర్ తరుణ్ పాఠక్ తెలిపారు. ఐఫోన్ 12, ఐఫోన్ 11, గెలాక్సీ ఎస్21ఎఫ్‌ఈ, గెలాక్సీ ఎస్21, రెడ్‌మీ నోట్ 10 తదితర ఉత్పత్తులు ఈ వృద్ధిని నడిపిస్తాయన్నారు. దేశీయంగా సరఫరా తక్కువగా ఉండడం రీఫర్బిష్డ్ విభాగంలో ఐఫోన్లకు డిమాండ్‌ను పెంచుతున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment