అల్లు అర్జున్ పుష్ప-2 ది రూల్ బాక్సాఫీస్ షేక్ చేస్తోంది. ఈ నెల 5న థియేటర్లలో విడుదలైన పుష్ప-2 కేవలం ఆరు రోజుల్లోనే రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఇప్పటివరకు ఏ సినిమా సాధించని రికార్డ్‌ను పుష్పరాజ్ క్రియేట్ చేశాడు. తొలిరోజే రూ.294 కోట్ల వసూళ్లతో సరికొత్త రికార్డ్ సృష్టించింది పుష్ప-2. రాబోయే రోజుల్లో మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది.
అయితే తాజాగా బన్నీ ఆడియన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పింది పుష్ప టీమ్. పుష్ప-2 3డీ వర్షన్ అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. అయితే ఈ సదుపాయం కేవలం హైదరాబాద్‌లోని కొన్ని థియేటర్లలో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే దేశవ్యాప్తంగా మరిన్ని థియేటర్లలో 3డీ వర్షన్ తీసుకొస్తామని ప్రకటించింది. ఇంకేందుక ఆలస్యం.. 3డీ వర్షన్‌లో పుష్ప-2 సినిమాను చూసి ఎంజాయ్ చేయండి.
Add another dimension to the WILDFIRE on the big screens 🤩
Watch #Pushpa2TheRule (Telugu) in 3D at select screens in Hyderabad. It is going be an epic experience 😎
Many more 3D shows being added all across the country.
Book your tickets now!
🎟️ https://t.co/eJusnmNS6Y… pic.twitter.com/UHK4TLknCk— Pushpa (@PushpaMovie) December 15, 2024
Comments
Please login to add a commentAdd a comment