బోస్టన్: అనుభవజ్ఞులైన వైద్యులు సైతం చేయలేని కొన్ని శస్త్రచికిత్సలను త్వరలో రోబో స్పైడర్లు చేయనున్నాయి. మృదువుగా, సౌకర్యంగా నాణెం పరిమాణంలో ఉండే ఈ రోబో సాలెపురుగు శరీరంలోని ఏ భాగానికైనా వెళ్లి శస్త్రచికిత్సను నిర్వహించనుంది. వైద్యులకు సహాయకారిగా ఉంటూ.. వారు చెప్పిన పనులను పూర్తి చేయనుంది. దీనిని అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ, బోస్టన్ వర్సిటీకి చెందిన పరిశోధకులు తయారుచేశారు. మిల్లీమీటర్ సైజులో ఉండే ఆస్ట్రేలియాలోని పీకాక్ స్పైడర్‌ను ఆదర్శంగా తీసుకుని దీన్ని అభివృద్ధిచేశారు. 3 రకాల టెక్నాలజీల సాయం తీసుకొని మరో సరికొత్త టెక్నాలజీతో దీన్ని తయారుచేశారు. దీని తయారీలో సిలికాన్ రబ్బర్‌ను మాత్రమే వాడినట్లు పోస్ట్‌డాక్టరోల్ ఫెలో రుస్సో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment