పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదే! | Did Pooja Hegde Undergo A Surgery? - Sakshi
Sakshi News home page

పూజా హెగ్డేకు సర్జరీ.. అసలు కారణం ఇదేనా?

Published Mon, Aug 28 2023 11:13 AM | Last Updated on Mon, Aug 28 2023 11:24 AM

Did Pooja Hegde Undergo A Surgery - Sakshi

స్టార్ హీరోయిన్ పూజాహెగ్డేకి వరసపెట్టి కష్టాలు ఎదురవుతూనే ఉన్నాయి. మహేశ్ 'గుంటూరు కారం' నుంచి తప్పుకొందో, తప్పించారో తెలియదు గానీ ఆ సినిమా నుంచి బయటకొచ్చేసింది. తెలుగులో అల్లు అర్జున్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు లాంటి స్టార్ హీరోలతో హిట్స్ కొట్టిన పూజాహెగ్డేకు గత కొన్నాళ్ల నుంచి అస్సలు కలిసి రావట్లేదు. ఆమె నటించిన సినిమాలు పెద్దగా హిట్‌ కాకపోవడంతో దర్శకనిర్మాతలు ఆమెవైపు చూడటం మానేశారు. దీంతో ఆమె షాపింగ్‌ మాల్స్ ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటుంది. కానీ గుంటూరు కారం, ఉస్తాద్ భగత్ సింగ్  సినిమాలో వచ్చిన అవకాశాన్ని తనే వద్దనుకుందని ప్రచారం జరుగుతుంది.  దీనికి ప్రధాన కారణం తన ఆరోగ్య విషయమేనని తెలుస్తోంది.

(ఇదీ చదవండి: ఇవి నా సంతోషకరమైన కన్నీళ్లు అంటూ భార్య ఫోటో షేర్‌ చేసిన శివకార్తికేయన్)

పూజా హెగ్డేకు ఈ మధ్యనే తన కాళ్లకు సంబంధించి మేజర్ సర్జరీ జరిగిందని ప్రచారం జరుగుతుంది. కాలినొప్పితో ఆమె చాలారోజుల నుంచి బాధపడుతుందని సమాచారం. ఇదే విషయాన్ని పూజా స్నేహితులే ఇండస్ట్రీతో టచ్‌లో ఉన్నవారికి చేరవేశారట. ఇలాంటి సమయంలో షూటింగ్‌లో పాల్గొంటే ఆమె మరిన్నీ ఇబ్బందులు ఎదురవుతాయనే సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిందట. రాధేశ్యామ్‌, బీస్ట్‌ సినిమాల నుంచే ఆమె కాలినొప్పితో బాధపడుతుండేదట.. ఆ సమస్య ఎక్కువ కావడంతో ఆపరేషన్‌ చేయాల్సి వచ్చిందట. దీంతో తను ఒప్పుకున్న రెండు సినిమాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. కానీ ఈ విషయాన్ని బహిరంగంగా తెలిపేందుకుక పూజా హెగ్డేకు ఇష్టం లేదట.. అందుకే దానిని గోప్యంగా ఉంచారని సమాచారం.

(ఇదీ చదవండి: కేజీఎఫ్‌ హీరో యశ్‌ నాకు బావ అవుతాడు: ‍శ్రీలీల)

ఇప్పుడు ఇదే విషయం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుంది. చాలా రోజుల నుంచే పూజా హెగ్డే కాలినొప్పితో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. అప్పట్లో ఆమె తాత్కాలికంగా ట్రీట్‌మెంట్‌ తీసుకున్నారు. వైద్యులు ఓకే చెప్పడంతో మళ్లీ షూటింగ్స్‌లలో పాల్గొంది. అప్పట్లో ఆపరేషన్‌ చేయుంచుకుందని భారీగా ప్రచారం జరిగింది. అప్పుడు తన టీమ్‌ సభ్యులు అందులో నిజం లేదని తెలపడంతో ఆ ప్రచారానికి ఫుల్‌స్టాఫ్‌ పడింది. తాజాగ ప్రచారం అవుతున్న వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement