శుక్లాలకు చుక్కల మందు!
వయసు మీదపడుతున్న కొద్దీ చూపు మందగించడం, కొంతమందిలో కంటి శుక్లాలు ఏర్పడటం మనం చూస్తూనే ఉంటాం. చత్వారాన్ని కళ్లజోడుతో సరిచేసుకోవచ్చునేమోగానీ... శుక్లాలకు మాత్రం శస్త్రచికిత్సకు మించిన ప్రత్యామ్నాయం లేదు. ఈ పరిస్థితి త్వరలోనే మారిపోతుందని అంటున్నారు చైనాలోని సన్ యాట్ సేన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ప్రకృతిలో లభించే ఓ రసాయనాన్ని చుక్కల మందుగా వాడటం ద్వారా శుక్లాలను కరిగించే రోజు ఎంతో దూరంలో లేదని వీరు చెబుతున్నారు.
లానో స్టెరాల్‌పై జరిపిన పరిశోధనల ద్వారా ఈ విషయం స్పష్టమైంది. ఈ రసాయనం శుక్లాల ప్రొటీన్లు ఒకదగ్గర గుమికూడకుండా అడ్డుకుంటుందనీ, కుక్కలపై దీన్ని ఉపయోగించినప్పుడు ఆరువారాల్లోనే వాటి కంటి శుక్లాలు గణనీయంగా తగ్గాయనీ శాస్త్రవేత్తలు గుర్తించారు.