చలికాలంలో పాదాల జాగ్రత్తలు... | Foot care in winter ... | Sakshi
Sakshi News home page

చలికాలంలో పాదాల జాగ్రత్తలు...

Jan 1 2014 11:39 PM | Updated on Sep 2 2017 2:11 AM

చలికాలంలో పాదాల జాగ్రత్తలు...

చలికాలంలో పాదాల జాగ్రత్తలు...

చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది.

చలికాలం వచ్చిందంటే మా పాదాలు పగులుతున్నాయి. ఈ సీజన్‌లో పాదాల ఆరోగ్యం గురించి మాకు తగిన సలహా ఇవ్వండి.
 - సుమతి, పలాస


చలికాలంలో పాదాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే... ఈ కాలంలో కాలి మడమలపై పగుళ్లు వచ్చి సమస్య మరింత పెరుగుతుంది. అదే డయాబెటిస్ ఉన్నవారికైతే ఈ సమస్య వచ్చినప్పుడు అదే తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి... ఈ కాలంలో పాదాలను జాగ్రత్తగా ఉంచుకోడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
 
 పాదాల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు :  
 ప్రతిరోజూ పాదాలను చల్లటి నీళ్లతో కాకుండా గోరువెచ్చటి నీటితో కడుక్కోవాలి.
 
  పాదాలను, వేళ్ల మధ్య ఎప్పుడూ పొడిగా ఉంచుకోవాలి.
 
 రోజూ పాదాలను జాగ్రత్తగా పరిశీలించుకోవాలి.
 
 కాలి బొటనవేలి గోరును జాగ్రత్తగా కట్ చేసుకోవాలి.
 
 పాదరక్షలు సరిగ్గా సరిపోయేలా ఉండేలా చూసుకోవాలి.
 
 షూస్ ధరించేవారు బూట్లలో ఏదైనా ఉన్నట్లు స్పర్శకు తెలిస్తే వెంటనే బూట్లు తొలగించి ఆ వస్తువును తొలగించాకే మళ్లీ వేసుకోవాలి.
 
 ఇవి చేయకూడదు :
 చెప్పులు లేకుండా నడవకూడదు. ముఖ్యంగా గులకరాళ్లు ఉన్న చోట నగ్న పాదాలతో అస్సలు నడవకూడదు.
 
 పాదాలపై వేడినీళ్లు గుమ్మరించుకోకూడదు.
 
 ఉతకని సాక్స్ ఎక్కువరోజుల పాటు వేసుకోకూడదు.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్, ఫిట్‌నెస్ నిపుణుడు, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement