కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది? | Coffee, tea ... Which is better | Sakshi
Sakshi News home page

కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది?

Published Wed, Sep 11 2013 11:44 PM | Last Updated on Fri, Sep 1 2017 10:37 PM

కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది?

కాఫీ, టీ... ఈ రెండింటిలో ఏది మంచిది?

కాఫీ ఎక్కువగా తాగడం అన్నది రన్నర్స్‌కు బాగా మేలు చేస్తుందా? కాఫీ వల్ల శరీరంలోని కొవ్వు తగ్గుతుందా? అసలు కాఫీ, టీ లలో ఏది మంచిది?
 - వేణుగోపాల్, గన్నవరం

 
మీరు చెప్పిన సమాచారంలో కొంతవరకే నిజం ఉంది. కాఫీలో ఉండే కెఫిన్ వల్ల కొంత కొవ్వు కరిగే మాట వాస్తవమే. అయితే విషయం పూర్తిగా తెలియని కొంతమంది రన్నర్‌లు పరుగు పందానికి ముందు చాలా ఎక్కువగా కాఫీని తాగేస్తుంటారు. కానీ ఇలా ఎక్కువగా కాఫీ తాగటం వలన గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. దీనివల్ల గుండె స్పందనల్లో, లయలో తేడాలు రావచ్చు. చాలా ఎక్కువ ఉత్తేజం చెందడం వల్ల మెదడు అలసిపోవచ్చు. దీనివల్ల దీర్ఘకాలంలో చాలా ఆరోగ్య సమస్యలు రావచ్చు. అందుకే కొవ్వు తగ్గించుకోవడానికి కాఫీని ఒక ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకోవడం సరికాదు.
 
 కాఫీ, టీ... ఈ రెండు పానీయాల్లో కాఫీ కన్నా టీ తాగడం కొంతవరకు మంచిదని చెప్పాలి. ఎందుకంటే టీలో ఉండే థయనిన్ అనే అమైనోయాసిడ్ (గ్లుటామిక్ యాసిడ్ అనలాగ్)  ఉండటం కారణంగా అది చక్కటి రిలాక్సేషన్ ఇస్తుంది. అయితే చక్కెర, పాల శాతాన్ని తగ్గిస్తేనే మంచిదని గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరికీ ఉండే వ్యక్తిగతమైన ఇష్టాల కారణంగా మీరు తప్పనిసరిగా కాఫీనే తాగాలనుకుంటే దానిని రోజుకు 2-3 చిన్న కప్పులకు మాత్రమే పరిమితం చేయండి.
 
 డాక్టర్ భక్తియార్ చౌదరి
 స్పోర్ట్స్ మెడిసిన్ & ఫిట్‌నెస్ నిపుణుడు,
 హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement