Biometrics
-
అటెండెన్స్ ఇక ఆధునికంగా..
సాక్షి, హైదరాబాద్: అక్రమాల కట్టడి కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించుకోవాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రస్తుతం పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఇతరుల హాజరుకు వినియోగిస్తున్న ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ స్థానే ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్(ఏఐ) ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ బయోమెట్రిక్‌ను ఉపయోగించేందుకు సిద్ధమైంది. తద్వారా బోగస్ కార్మికులకు అడ్డుకట్ట వేయవచ్చని, ఫలితంగా ఏటా కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం కాకుండా నివారించవచ్చునని భావిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో స్కూల్ ఎడ్యుకేషన్ విభాగం ఈ విధానాన్ని అమలు చేస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా రెడీ అయ్యింది. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికుల పేరిట ఏటా కోట్ల రూపాయలు దారి మళ్లుతున్నాయి. గతంలో సాధారణ హాజరు అమల్లో ఉండటంతో అక్రమాలు జరుగుతున్నాయని భావించి దాదాపు ఆరేళ్ల క్రితం వేలిముద్రల బయోమెట్రిక్ విధానాన్ని అందుబాటులోకి తెచ్చారు. అయినా, అక్రమాలు జరుగుతుండటంతో ఆధార్‌తో అనుసంధానం చేశారు. అయినప్పటికీ ఫలితం లేదు. ఒక ఎస్ఎఫ్ఏ పరిధిలో ఉండే 21 మంది కార్మికులకు గానూ సగటున 15 మందికి మించి ఉండరు. అయితే, వారి పేరిట ప్రతినెలా వేతనాల చెల్లింపులు మాత్రం జరుగుతున్నాయి. ఎస్ఎఫ్ఏల నుంచి సంబంధిత విభాగం ఏఎంఓహెచ్‌లు, సీఎంఓహెచ్‌కు సైతం వాటాలున్నాయని కార్మికులు బహిరంగంగానే చెబుతారు. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్ అమల్లోకి వచ్చాక నకిలీ సింథటిక్ ఫింగర్ ప్రింట్లను తయారు చేయడం నేర్చుకున్నారు. కొందరు ఎస్ఎఫ్ఏల వద్ద అలాంటి నకిలీ ఫింగర్ ప్రింట్లను గుర్తించి పోలీసులు పట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ, అక్రమాలు మాత్రం ఆగలేదు. హాజరు తీసుకునే హ్యాండ్‌సెట్‌లో తమ ఫింగర్ ప్రింట్స్ నమోదు కావట్లేదంటూ సాధారణ హాజరునే నమోదు చేసుకుంటున్న వారు భారీసంఖ్యలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏఐ ఆధారిత ఫేషియల్ రికగ్నిషన్ జరిగితే అక్రమాలకు ఆస్కారం ఉండదని భావించిన కమిషనర్ రోనాల్డ్‌రాస్ అందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ప్రత్యేక యాప్‌తో.. ఫేషియల్ రికగ్నిషన్‌ను మొబైల్ ఫోన్‌తో వినియోగించగలిగే ప్రత్యేక యాప్ తయారు చేస్తారు. యాప్ రూపకల్పన, నిర్వహణ సైతం సదరు సంస్థే చేయాల్సి ఉంటుంది. ఈ యాప్‌లో ఫేషియల్ రికగ్నిషన్‌తోనే హాజరు నమోదవుతుంది. హాజరు తీసుకునే సమయంలో కార్మికులున్న ప్రదేశాన్ని తెలిపేలా జియో ఫెన్సింగ్ సదుపాయం ఉంటుంది. సంబంధిత విభాగాల ఉన్నతాధికారులు తమ పరిధిలోని సిబ్బంది వివరాలను ఫొటో, ఐడీలతో సహా యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. 25 వేల మందికి వర్తింపు.. జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఎంటమాలజీ, వెటర్నరీ విభాగాల్లోని కార్మికులు, అధికారులు వెరసి దాదాపు 25 వేల మంది ఉన్నారు. ఈ ప్రాజెక్టును ఆర్ఎఫ్పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) ద్వారా దక్కించుకునే సంస్థకు యాప్ రూపకల్పనకు ఖరారయ్యే ధర చెల్లిస్తారు. అనంతరం నిర్వహణకు రోజువారీ హాజరును బట్టి చెల్లిస్తారు. యాప్‌తో పాటు వెబ్‌పోర్టల్ కూడా ఉంటుంది. పారిశుద్ధ్య కార్మికులు గ్రూపులుగా పనులు చేస్తారు. కాబట్టి క్షేత్రస్థాయిలో సైతం గ్రూపులుగానూ.. విడివిడిగానూ హాజరు నమోదయ్యే సదుపాయం కూడా ఉంటుంది. కార్మికుల హాజరును బట్టి వారి వేతనాలను అనుగుణంగా వేతనం తదితర వివరాలు కూడా ఆటోమేటిక్‌గా జనరేట్ అయ్యేలా ఈ ప్రాజెక్ట్ ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. ఆర్ఎఫ్పీలను ఆహ్వానించిన జీహెచ్ఎంసీ ముందుకొచ్చే సంస్థల అర్హతలు, తదితరమైనవి పరిగణలోకి తీసుకొని ప్రాజెక్టు అప్పగించనుంది. రూ.కోట్ల నిధులు దారి మళ్లింపు.. 2017లో మే 21 తేదీ నుంచి జూన్ 20 వరకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు చెల్లించగా ఒక్క నెలలోనే రూ. 2,86,34,946 వ్యత్యాసం కనిపించింది. దీనిబట్టి పనిచేయకుండానే ఎంతమంది పేరిట నిధుల దుబారా జరిగిందో అంచనా వేయవచ్చు. ఫింగర్‌ప్రింట్స్ బయో మెట్రిక్ అమల్లోకి వచ్చాక కొంతకాలం వరకు అక్రమాలు జరగనప్పటికీ..అనంతరం నకిలీ ఫింగర్‌ప్రింట్స్ సైతం పుట్టుకొచ్చాయి. ఈ పరిణామాలతో జీహెచ్ఎంసీ తాజాగా ఫేషియల్ బయోమెట్రిక్‌కు సిద్ధమవుతోంది. -
ఈ స్మార్ట్ రింగ్ ఫింగర్లో ఉంటే ఫికర్ లేదు!
ఫిట్నెస్ ట్రాకర్‌గా పనిచేసే స్మార్ట్ రింగ్‌ను ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తయారీ సంస్థ బోట్ భారతదేశంలో విడుదల చేసింది. చేతి వేళ్లకు ధరించగలిగేలా తయారు చేసిన రింగ్ యూజర్ల బయోమెట్రిక్స్, రోజువారీ ఫిజికల్ యాక్టివిటీస్‌ను పర్యవేక్షిస్తుంది. ఈ స్మార్ట్ రింగ్ నీరు, చెమట నిరోధకతను కలిగి ఉంటుంది. కాబట్టి దీనిని వ్యాయామ సెషన్లు లేదా నీళ్లలో యాక్టివిటీస్ చేసేటప్పుడు కూడా ధరించవచ్చు. స్టెప్ కౌంట్, నడిచిన దూరం, కేలరీలు ఎంత మేర కరిగాయి, హృదయ స్పందన రేటు, శరీర ఉష్ణోగ్రత, రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలతో సహా అనేక రకాల ఆరోగ్య కొలమానాలను ఈ స్మార్ట్ రింగ్ ట్రాక్ చేస్తుంది. ఇందులో బాడీ రికవరీ ట్రాకింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. ఇది హార్ట్ బీట్ వేరియబిలిటీ అనాలిసిస్‌తో పాటు ఓవరాల్ యాక్టివిటీ రికార్డులను ఉపయోగించి యూజర్ల మొత్తం ఆరోగ్య స్థితి గురించి తెలియజేస్తుంది. శారీరక శ్రమను ట్రాక్ చేయడంతో పాటు నిద్రను కూడా ఈ స్మార్ట్ రింగ్ పర్యవేక్షిస్తుంది. మొత్తం నిద్ర వ్యవధి, వివిధ నిద్ర దశలలో గడిపిన సమయం సంభావ్య నిద్ర భంగం వంటి అంశాలను కవర్ చేస్తూ సమగ్ర స్లీప్ డేటాను అందిస్తుంది. ఇక రుతుక్రమం ఉన్న మహిళల కోసం రుతు చక్రాలను ట్రాక్ చేసే, అంచనా వేసే ఫీచర్ కూడా ఇందులో ఉంది. ఈ సమాచారాన్ని నేరుగా యూజర్ల ఫోన్‌కు నోటిఫికేషన్లు, రిమైండర్ రూపంలో అందిస్తుంది. ఈ మొత్తం డేటా బోట్ రింగ్ యాప్‌లో స్టోర్ అవుతుంది. దీంతో యూజర్లు తమ ఆరోగ్య ప్రమాణాలను, పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలవుతుంది. అయితే ఈ స్మార్ట్ ధరను మాత్రం కంపెనీ వెల్లడించలేదు. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ద్వారా కొనుగోలుకు అందుబాటులో ఉంటుందని బోట్ సంస్థ పేర్కొంది. -
తాలిబన్ల నుంచి పొంచి ఉన్న మరో పెనుముప్పు..! అదే జరిగితే..అంతే సంగతులు..!
కాబూల్: అఫ్ఘనిస్తాన్ పూర్తిగా తాలిబన్ల వశమైన విషయం తెలిసిందే. తాలిబన్ల ఆక్రమణ తర్వాత ఆ దేశంలో కల్లోల పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడి జనాభాలో భయాందోళనలు నెలకొన్నాయి. ప్రజలు ప్రాణభయంతో అఫ్ఘన్ విడిచివెళ్లేందుకు అనేక ప్రయత్నాలను చేస్తున్నారు. తాలిబన్ల రాకతో అఫ్ఘన్ పౌరుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయి. తాలిబన్ల నుంచి తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో మరో పెనుముప్పు అఫ్ఘన్ పౌరులను వెంటాడనుంది. (చదవండి: తాలిబన్లపై కీలక నిర్ణయం తీసుకున్న యూట్యూబ్...!) అఫ్ఘన్ పౌరుల డేటా ప్రమాదంలో.. అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటా భారీ ప్రమాదంలో ఉన్నట్లు తెలుస్తోంది. అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాను తాలిబన్లు యాక్సెస్ చేసే అవకాశం ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ ట్విటర్లో వెల్టడించింది. అంతేకాకుండా బయోమెట్రిక్ డేటా పరికరాలను కూడా తాలిబన్లు వశపరుచుకునే ప్రమాదం ఉన్నట్లు పేర్కొంది. గతంలో అఫ్ఘన్ ప్రభుత్వం తమ దేశ పౌరుల డేటాను డిజిటలైజ్ చేసింది. అంతేకాకుండా అఫ్ఘన్ పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడం అప్పటి ప్రభుత్వం డిజిటల్ గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టింది. దీంతో అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాలను తాలిబన్లు సేకరించే అవకాశం ఉంది. పలు అఫ్ఘన్ వ్యక్తులను టార్గెట్ చేయడానికి బయోమెట్రిక్ డేటా తాలిబన్లు వాడే అవకాశం ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. హ్యూమన్ రైట్స్ ఫస్ట్ గ్రూప్ ట్విటర్లో.. అఫ్ఘన్ పౌరుల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్లతో డేటాబేస్ యాక్సెస్‌ను తాలిబన్లు కలిగి ఉండే అవకాశం ఉందని పేర్కొంది. గతంలో ఒక సంస్థను ఉపయోగించి అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటాతో వారి ఇంటర్నెట్ హిస్టరీలను చూసేందుకు అనేక ప్రయత్నాలను జరిపింది. తాలిబన్లకు విరుద్ధంగా చేసిన చర్యలను గుర్తించడానికి ఇది ఎంతగానో ఉపయోగపడింది. వారిని లక్ష్యంగా చేసుకుని తాలిబన్లు దాడులు కూడా జరిపారు. దేశం వీడినా వేటాడుతారు...! ప్రస్తుతం అఫ్ఘన్ పౌరులు దేశాన్ని విడిచిపెట్టివెళ్లిన వారు ఇతర దేశాల్లో శరణార్థులుగా వారి ఊరు, పేర్లను మార్చుకొని తిరిగినా వారిని తాలిబన్లు వెంటాడే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే అఫ్ఘన్ పౌరుల బయోమెట్రిక్ డేటా తాలిబన్ల చేతికి వస్తే ఇది సాధ్యంకానుంది. బయోమెట్రిక్ డేటా అనేది మారడం అసలు జరగదు. తాలిబన్లకు వ్యతిరేకంగా మాట్లాడిన వారి బయోమెట్రిక్ డేటాలు అత్యంత ప్రమాదంలో ఉన్నట్లు హ్యూమన్ రైట్స్ ఫస్ట్ చీఫ్ టెక్నాలజీ వెల్టన్ చాంగ్ వెల్లడించారు. (చదవండి: తాలిబన్లు తెచ్చిన తంటాలు..భారత్‌లో వీటి ధరలు భారీగా పెరుగుతాయా...!) “The Taliban is now likely to have access to various biometric databases and equipment in Afghanistan,” Human Rights First group wrote on Twitter Monday. That's why we've put out a guide to evading the misuse of biometric data: https://t.co/CO9vsPPtC4 https://t.co/7COzBzzA6s — Human Rights First (@humanrights1st) August 17, 2021 -
మీ ఆధార్ బయోమెట్రిక్ సేఫ్‌గా ఉండాలంటే ఇలా చేయండి
బ్యాంక్ అకౌంట్లలో ఉన్న డబ్బుల్ని కాజేసేందుకు కేటుగాళ్లు ఆధార్ కార్డ్‌ను అస్త్రంగా ఉపయోగించుకుంటుంటారు. అయితే అలాంటి వారి నుంచి సురక్షితంగా ఉండేలా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఎప్పటికప్పుడు సెక్యూరిటీ అప్డేట్లను అందుబాటులోకి తెస్తోంది. ఈనేపథ్యంలో 12 అంకెల ఆధార్ కార్డ్ దుర్వినియోగం కాకుండా, సురక్షితంగా ఉండేలా మరో ఫీచర్‌ను వినియోగదారులకు పరిచయం చేసింది ఈ ఫీచర్ ద్వారా ఆధార్ కార్డు బయోమెట్రిక్ లాక్/ అన్ లాక్ చేసేలా డిజైన్ చేసింది. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలా చేయాలో తెలుసుకుందాం.ఆధార్ కార్డ్ సురక్షితంగా ఉండేలా బయో మెట్రిక్ ఆప్షన్‌ను వినియోగించుకోవాలి. మీ ఆధార్‌ను లాక్/అన్‌లాక్ చేయడానికి mAadhaar యాప్ లేదా https://resident.uidai.gov.in/aadhaar-lockunlock పైన క్లిక్ చేయాలి. ఇందుకోసం మీ ఐడీ కార్డ్ తప్పనిసరిగా ఉండాలి. ప్రాసెస్ ఎలా చేయాలి? ► https://resident.uidai.gov.in/aadhaar-lockunlock వెబ్ సైట్ లోకి వెళ్లాలి ► అనంతరం Secure UID Authentication Channel సెక్షన్లోకి వెళ్లి Lock UID లేదా Unlock UID ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ► అలా చేసిన తరువాత మీరు మీ 12అంకెల ఆధార్‌తో పాటు సంబంధిత వివరాల్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. ► ఫైనల్ గా మీఫోన్ నెంబర్ కు వన్ టైమ్ పాస్వర్డ్ వస్తుంది. ► ఆ ఓటీపీని యాడ్ చేస్తే మీ ఆధార్ బయోమెట్రిక్ లాక్ అవుతుంది. చదవండి: రూ.93,520 కోట్ల బకాయిలు, సుప్రీంకోర్ట్‌కు ఎయిర్టెల్-వొడాఫోన్ -
బయోమెట్రిక్ లేకుండానే ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ
కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సాక్షి, అమరావతి: కోవిడ్ వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా ఏప్రిల్ నెలలో జరగాల్సిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో బయోమెట్రిక్ విధానానికి తాత్కాలికంగా స్వస్తి పలకాలని ప్రభుత్వం నిర్ణయించింది. పారదర్శకత కోసం పంపిణీ చేసే సమయంలో లబ్ధిదారుల నుంచి తమ పింఛను డబ్బులు ముట్టినట్టు సంతకాలు తీసుకుంటారు. నిరక్షరాస్యులైతే, వారికి పింఛను డబ్బులు పంపిణీ చేసినట్టు ఒక ఫొటో తీసి, వలంటీరు వద్ద మొబైల్ యాప్‌లో అప్లోడ్ చేస్తారు. ఈ మేరకు తగిన చర్యలు చేపట్టాలంటూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. సాధారణ పరిస్థితుల్లో పింఛన్ల పంపిణీలో ఎలాంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా బయోమెట్రిక్ విధానంతో వేలి ముద్రలను సరిపోల్చుకొని డబ్బులు చెల్లించడం గత కొంత కాలంగా కొనసాగుతోంది. అయితే ఒకే బయోమెట్రిక్ మెషీన్ ద్వారా వరుసగా పలువురు లబ్ధిదారుల నుంచి వేలి ముద్రలను సేకరించడం వల్ల కోవిడ్ వైరస్ వ్యాపించే అవకాశం ఉంటుందనే అనుమానంతో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగా నేరుగా పింఛను డబ్బుల పంపిణీకి ఆమోదం తెలిపింది. రేషన్ సరుకులకు ఈ–పాస్ నుంచి మినహాయింపు ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ కార్డులపై ఇచ్చే సబ్సిడీ సరుకుల పంపిణీలో ఈ–పాస్ యంత్రాలను వినియోగించకూడదని అధికారులు ప్రాథమికంగా నిర్ణయించారు. రేషన్ డీలర్లు లబ్ధిదారుల వివరాలను పాత విధానం ప్రకారం రికార్డు పుస్తకంలో నమోదు చేసి సరుకులు ఇవ్వనున్నారు. కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ఈ–పాస్ యంత్రాల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి పౌర సరఫరాల శాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి కోన శశిధర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. రేషన్ సరుకుల కోసం వచ్చే లబ్ధిదారులు ఈ–పాస్ మెషిన్లో ఒకరి తర్వాత మరొకరు వేలిముద్రలు వేయడం వల్ల కరోనా వైరస్ విస్తరించే అవకాశం ఉందని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అధికారులు కేంద్ర ఆహార శాఖ దృష్టికి తీసుకెళ్లగా.. ఏప్రిల్ నెల సరుకులను దేశమంతటా మాన్యువల్ పద్ధతిలోనే పంపిణీ చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలకు సంబంధించి పూర్వ పద్ధతిలోనే సరుకులు పంపిణీ చేయాలని ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నట్లు కోన శశిధర్ చెప్పారు. -
ఆన్లైన్ పరీక్ష: చెలరేగిన క్లోనింగ్ ముఠా
సాక్షి, జైపూర్: ఆధార్ గోప్యత, హ్యాకింగ్‌కు సంబంధించి మరోషాకింగ్ న్యూస్..నకిలీ ఫింగర్ ప్రింట్ రాకెట్ తాజాగా వెలుగు చూసింది. రాజస్థాన్‌లో కానిస్టేబుల్ ఎంపిక సందర్భంగా నకిలీ ఆధార్ కార్డులతో పరీక్షకు హాజరువుతున్న గ్యాంగ్‌ను అధికారులు ఛేదించారు. కానిస్టేబుల్ అడ్మిషన్ కోసం ఆన్‌లైన పరీక్ష సందర్భంగా వీరు అక్రమాలకు పాల్పడ్డారు. అభ్యర్థుల బొటన వేలి ముద్రలకు నకిలీవి రూపొందించి అసలు అభ్యర్థుల స్థానంలో పరీక్షలకు హాజరయ్యారు. 5390 పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను పూరించడానికి మొదటిసారి ఆన్లైన్ పరీక్షలు ప్రవేశపెట్టగా, మార్చి 7నుంచి 45 రోజులు నిర్వహించన్నారు. మార్చి 12, 14 తేదీలలో, జైపూర్‌లో కంప్యూటర్ను హ్యాక్ చేసి ఘటన నమోదు కావడంతో 12 మందిని అధికారులు అరెస్టు చేశారు. గత మూడు రోజుల్లో పంకజ్ జాట్, ముక్తర్ సహా మొత్తం 17 మందిని అరెస్టు చేశామని రాజస్థాన స్పెషల్ ఆపరేషన్ గ్రూప్అధికారి ఉమేష్ మిశ్రా చెప్పారు. ఇలా 77కేంద్రాల్లో 25మంది నకిలీ అభ్యర్థులను గుర్తించామన్నారు. సినీ ఫక్కీలో నకిలీ ఫింగర్ ప్రింట్స్ యూట్యూబ్‌లో వేలిముద్రల క్లోనింగ్ నేర్చుకున్నారు. మొదట, వారు దరఖాస్తుదారు వేలు మీద చేప నూనెను పూసి,దాన్ని వేడిగా ఉన్న మైనం మీద ఉంచుతారు. దానికి ఫెవికాల్ పూసి అది ఆరిన తరువాత నకిలీ ఫింగర్ ప్రింట్ రడీ. దీని ద్వారా పరీక్షా కేంద్రానికి వెళ్లి దరఖాస్తుదారుడి తరఫున పరీక్షకు హాజరు కావడం, బయోమెట్రిక్ టెస్ట్ పాస్ కావడం, పరీక్షరాసి బయటపడడం అన్నీ జరిగిపోయాయి. అయితే వరుస ఘటనలతో అప్రమత్తమైన అధికారులు నకిలీ ఫింగర్ ప్రింట్‌తో పరీక్ష హాల్లోకి హాజరైన వ్యక్తిని అధికారులు అరెస్ట్ చేశారు. దీంతో ముఠా గుట్టురట్టయింది. విలేజ్ సర్వీస్ వర్కర్‌తో సహా ముగ్గురు నిందితులను గురువారం అరెస్ట్ చేశారు. ముఖ్యంగా హర్యానాకు చెందిన దేవేంద్ర (20) ను కీలక సూత్రధారిగా గుర్తించారు. కాగా దీంతో ఈముఠా భారీ ఎత్తున విస్తరించి ఉండవచ్చనే సందేహాలు నెలకొన్నాయి. -
వేలిముద్ర శాసనంతో వెతలు
ఏడాది క్రితం వరకు సంతకం రానివారిని చూసి గేలిగా నవ్వేవాళ్లు. కానీ నేడు ఆ వేలిముద్రే శాసనంగా మారింది. అదే చివరకు మధ్యాహ్న భోజన బియ్యానికి సైతం తిప్పలు తెచ్చిపెట్టింది. ఉన్న వాటితో పండుగ వరకు సర్దుబాటు చేసుకోవచ్చు... కానీ ఆ తరువాత మాత్రం పరేషాన్ తప్పదనే సంకేతాలు అందుతున్నాయి. ► మధ్యాహ్న భోజన బియ్యం సరఫరాకు ఆటంకం ► పండుగ దాటితే పరేషానే! ఒంగోలు: జిల్లాలో మొత్తం 3374 పాఠశాలల్లో మధ్యాహ్న బోజన పథకం అమలవుతోంది. గత ఆగస్టు నెలవరకు పాఠశాలలు తమ ఇండెంట్‌ను ఎంఈవోకు అందజేసేవాళ్లు. ఎంఈవో ఇండెంట్‌ను తహసీల్దారు కార్యాలయానికి పంపడం, అక్కడ నుంచి జిల్లా పౌరసరఫరాలశాఖ కార్యాలయానికి చేరేవి. తద్వారా పౌరసరపరాలశాఖ నుంచి విడుదలయ్యే అలాట్మెంట్ వివరాలు కూడా పౌరసరఫరాలశాఖ జిల్లా కార్యాలయానికి, అక్కడ నుంచి ఎంఆర్వో కార్యాలయాలకు, పాఠశాలలకు అందేవి. దాని ప్రకారం రేషన్డీలర్కు సరుకు రిలీజ్ కావడం, ప్రధానోపాధ్యాయుని సంతకంతో బియ్యం విడుదల చేసేవారు. ప్రస్తుత పరిస్థితి ఇదీ.. ఈనెల మొత్తం 820 టన్నులు అవసరం అని పాఠశాలల నుంచి సమాచారం అందింది. ప్రభుత్వం మాత్రం రేషన్ డీలర్ల వద్ద మిగిలి ఉన్న నిల్వలను దృష్టిలో ఉంచుకొని 705 టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. రేషన్ డీలర్లు ఆ బియ్యాన్ని బయోమెట్రిక్ ద్వారా పాఠశాలలకు సరఫరా చేయాలి. ఇందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు లేదా పాఠశాల ఇన్‌ఛార్జి ప్రధానోపాద్యాయులు లేదా కుకింగ్ ఏజెన్సీలు వేలిముద్ర ద్వారా సరుకు డెలివరీ చేస్తారు. చాలాచోట్ల బయోమెట్రిక్ యంత్రాలతో సమస్య మొదలైంది. వారి వేలిముద్రలను అవి అగీకరించడంలేదు. దీంతో సమస్య నెలకొంది. రేషన్ డీలర్లు సరుకును అందజేసేందుకు సిద్ధంగా ఉన్నా సర్వర్ సమస్యతో పంపిణీకి ఆటంకంగా మారింది. ఈ కారణంగానే మొత్తం 3374 పాఠశాలలకు గాను ఈనెల 26వ తేదీ వరకు 2023 పాఠశాలలకు మధ్యాహ్న భోజనం బియ్యం పంపిణీ చేశారు. పంపిణీ అయిన మొత్తం బియ్యం 536 టన్నులు. దీని ప్రకారం 1351 పాఠశాలలకు ఇంకా 236 టన్నుల బియ్యం సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం సాంకేతిక సమస్యలు వచ్చిన మాట నిజమే అని, గతంలో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ప్రకారం పంపిణీ అయిన బియ్యం ఎక్కువుగా ఉండడం, భోజనం చేసిన విద్యార్థుల శాతం తక్కువుగా ఉండడంతో ప్రస్తుతానికి ఇబ్బందులు లేవని అధికారులు పేర్కొంటున్నారు. దసరా శెలవుల అనంతరం మాత్రం ఇబ్బందులు ప్రారంభం అవుతాయని కనుక ఈ నేపథ్యంలోనే బయోమెట్రిక్ సమస్యలు పూర్తవుతాయని ఆశిస్తున్నట్లు పేర్కొంటున్నారు. -
బ్యాంకింగ్‌లో బయోమెట్రిక్స్!
బయోమెట్రిక్స్ టెక్నాలజీపై బ్యాంకుల దృష్టి కంఠస్వరం గుర్తింపును అందుబాటులోకి తెచ్చిన ఐసీఐసీఐ రుణాల్లో వేలిముద్రల్ని వినియోగిస్తున్న హెచ్డీఎఫ్సీ బయో గుర్తింపుతో మోసాలకు ముకుతాడు పాస్వర్డ్లు, పిన్ నంబర్ల అవసరం ఉండదు బయో ఏటీఎంల వినియోగానికి ప్రభుత్వం కూడా ఓకే ఆర్థిక మోసాలు జరగని రోజు ఒక్కటైనా ఉందా? క్రెడిట్ కార్డు, ఏటీఎం కార్డు, పిన్ నంబర్ల చౌర్యంతో కుర్రాళ్ల నుంచి వృద్ధుల దాకా అందరినీ బురిడీ కొట్టిస్తున్నారు నయా వంచకులు. మరి వీటన్నిటి నుంచీ బయటపడాలంటే..? మన కార్డును వేరొకరు ఉపయోగించి మనని లూటీ చేయకూడదంటే..? ఇదిగో... ఇలాంటి టెక్నాలజీపైనే కసరత్తు చేస్తున్నాయి బ్యాంకులు. కస్టమర్ల వేలి ముద్రలు, కంఠస్వరం లేదా రెటీనా స్కాన్లను ఉపయోగించి బ్యాంకింగ్ లావాదేవీలను మరింత సురక్షితంగా, సులభంగా, మోసాలకు తావులేకుండా నిర్వహించటానికి ప్రయత్నిస్తున్నాయి. బయోమెట్రిక్స్గా పిలిచే ఈ టెక్నాలజీని విదేశాల్లో ఇప్పటికే సమర్థంగా వాడుతున్నారు. మన దేశంలోనూ వేగంగా రాబోతున్న ఈ టెక్నాలజీ వివరాలివీ... టెక్నాలజీ వేగంగా మారిపోతోంది. మన బ్యాంక్ ఖాతా నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, ఎవరి ఖాతాకైనా డబ్బులు పంపించాలన్నా బ్యాంక్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఏటీఎంల ద్వారానో లేదా ఆన్లైన్లోనో లేకుంటే మొబైల్ ఫోన్ల ద్వారానో బ్యాంకింగ్ లావాదేవీలు కానిచ్చేయొచ్చు. కొన్ని ప్రైవేట్ బ్యాంక్‌లు రుణాలు సైతం ఆన్లైన్లోనే ఇచ్చేస్తున్నాయి. ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ద్వారా వివిధ బ్యాంకింగ్ లావాదేవీల నిర్వహణ ఇప్పుడు ఈజీ అయిపోయింది. అయితే వీటిలో ఎంత సౌకర్యం ఉందో... అంతకన్నా ఎక్కువ రిస్కూ ఉంది. అంతేకాక ఇంటర్నెట్, మొబైల్ ఫోన్ల ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించాలంటే మనం అనేకమైన పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలి. వీటన్నిటికీ తోడు టెక్నాలజీ కన్నా వేగంగా పరిగెడుతున్నారు నేరగాళ్లు. రకరకాల మార్గాల్లో సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. వీటిని అడ్డుకునే మార్గాల్లో భాగంగానే బయోమెట్రిక్ పరికరాలను తెస్తున్నాయి. బయొలాజికల్ ఐడెంటిఫికేషన్స్ ద్వారా ఖాతాకు లాగిన్ అవటంతో పాటు, వాటి సాయంతోనే ఏటీఎం, ఫోన్ లావాదేవీలు కూడా నిర్వహించుకోవచ్చు. ఇది సురక్షితమైన విధానం. లోపాలు లేనిది కూడా. దీంతో ఇక పిన్ నంబర్లు, పాస్‌వర్డ్‌ల అవసరం ఉండదు. ఏమిటీ బయోమెట్రిక్స్... బయోమెట్రిక్స్ అంటే బయోలాజికల్ డేటాను విశ్లేషించే శాస్త్రం. ప్రస్తుతం ఇది వ్యక్తుల గుర్తింపు(ఐడెంటిటీ)లో బాగా ఉపయోగపడుతోంది. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ఇమిగ్రేషన్ కౌంటర్లు బయోమెట్రిక్స్‌ను బాగా ఉపయోగించుకుంటున్నాయి. ప్రయాణికుల వేలిముద్రలను, ఐరిస్ స్కాన్ల ద్వారా వారిని కచ్చితంగా, సరిగ్గా గుర్తించగలుగుతున్నాయి. ఇప్పుడు బ్యాంకింగ్ రంగంలోనూ బయోమెట్రిక్స్‌ను ఉపయోగిస్తున్నారు. అరచేతిని స్కాన్ చేయడం, వేలిముద్రల స్కానింగ్, రెటినా స్కాన్, కంఠస్వరం గుర్తింపు, ముఖాన్ని గుర్తించటం వంటి పలు టెక్నిక్లను బ్యాంక్‌లు వినియోగిస్తున్నాయి. భవిష్యత్తులో ఫింగర్‌ప్రింట్ సెన్సింగ్ అనేది సాధారణ బయోమెట్రిక్ గుర్తింపు విధానం కానుంది. ఖాతాదారులు ఏటీఎంకు వెళ్లి స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు. అకౌంట్‌కు లాగిన్ అయి లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఇప్పటికే జపాన్,అమెరికాల్లోని ఏటీఎంల్లో బయోమెట్రిక్ అథంటికేషన్ డివైస్‌లు విజయవంతంగా పనిచేస్తున్నాయి. మొబైల్ బ్యాంకింగ్ లావాదేవీలకైతే ఖాతాదారుడు తన వేలి ముద్రను స్మార్ట్‌ఫోన్ లెన్స్‌కు టచ్ చేస్తే చాలు, అది స్కానై బ్యాంక్ ఖాతాను యాక్సెస్ చేసుకోవచ్చు. తొలి బ్యాంకు.. ఐసీఐసీఐ దేశంలో బయోమెట్రిక్స్‌ను ఉపయోగించిన తొలి బ్యాంక్ ఐసీఐసీఐ అని చెప్పొచ్చు. కంఠస్వరం గుర్తింపు విధానాన్ని ఈ బ్యాంక్ వినియోగంలోకి తెచ్చింది. దీనికోసం ఖాతాదారుల వాయిస్ శాంపిల్స్‌తో కూడిన డేటాబేస్‌ను ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆరంభించింది. బ్యాంక్ రికార్డుల్లో ఉన్న ఖాతాదారుల నమోదిత ఫోన్ నంబర్ల నుంచి ఖాతాదారులు ఫోన్ చేస్తేనే ప్రస్తుతం వాయిస్ రికగ్నిషన్ సిస్టమ్ పనిచేస్తుంది. ఇక హెచ్డీఎఫ్సీ బ్యాంక్ తమ ఖాతాదారులకు ఇన్స్టంట్ రుణాలందజేయడానికి ఈ బయోమెట్రిక్స్ టెక్నాలజీని వాడుతోంది. రుణం కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తి వేలిముద్రను బ్యాంక్ బ్రాంచీలో ఉన్న డివైస్ ద్వారా సేకరిస్తారు. దీనికి ఆధార్ నంబర్‌ను జతచేసి ఆ వ్యక్తి వివరాలను తెలుసుకుంటారు. కొంత అదనపు సమాచారం సేకరించి కేవలం అరగంటలో కారు/ లేదా వ్యక్తిగత రుణాన్ని అందిస్తారు. ఇతర బ్యాంక్‌లు కూడా మున్ముందు ఈ దార్లో నడవక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఐరిస్, కంఠస్వరం కూడా కంఠ స్వరం గుర్తింపు విధానాన్ని ఇప్పుడిప్పుడే భారత్‌లో ఉపయోగిస్తున్నారు. ఈ విధానంలో ఫోన్ బ్యాంకింగ్ లావాదేవీల్ని సురక్షితంగా నిర్వహించుకోవచ్చు. కంటి రెటినా(ఐరిస్)ను స్కాన్ చేసి, మొబైల్ ఫోన్ల ద్వారా, లేదా డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌ల నుంచి ఇంటర్నెట్ ద్వారా బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. భవిష్యత్తులో మరింత విస్త ృతంగా.. బ్యాంకింగ్ రంగంలో బయోమెట్రిక్స్ విని యోగం ప్రస్తుతం తక్కువే అయినా... మున్ముందు విస్తృతమవుతుందన్నది సాంకేతిక నిపుణుల అంచనా. ఫింగర్‌ప్రింట్ బయోమెట్రిక్స్‌ను ప్రస్తుతం 35కు పైగా దేశాలు వాడుతున్నాయి. భారత ప్రభుత్వం కూడా బయోమెట్రిక్ ఏటీఎంల వినియోగానికి పచ్చజెండా ఊపింది. మోసాలు జరిగే అవకాశాలు లేకపోవడం, భద్రత అధికంగా ఉండడం వల్ల పలు బ్యాంకులు దీనికి సై అంటున్నాయి. ప్రతికూలతలూ ఉన్నాయ్... బయోమెట్రిక్స్ ఉపయోగించేందుకు వివిధ ప్రమాణాలకు సంబంధించి అస్పష్ట అంశాలు చాలానే ఉన్నాయి. బయోటెక్నాలజీ కూడా పూర్తిగా లోపాల్లేని వ్యవస్థ అని చెప్పలేమని నిపుణులంటున్నారు. పూర్తి స్థాయి సురక్షిత వ్యవస్థగా బయోమెట్రిక్స్ రూపొందేవరకూ ఇతర అథంటికేషన్ మార్గాలను కూడా అనుసరించాలని వారు సూచిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఏటీఎం వద్దకు ఖాతాదారుడు వెళ్లలేకపోవచ్చని, తన బదులు వేరొకరు లావాదేవీలు జరిపే అవకాశాలు లేకపోవటమన్నది దీన్లో ఉన్న లోపమని వారు చెబుతున్నారు. ఇలాంటి పలు సమస్యలను ఈ విధానం ఇంకా అధిగమించాల్సి ఉంది. -
స్కూళ్లలో బయోమెట్రిక్ విధానం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు నమోదుకు బయోమెట్రిక్ విధానం అమలుపై విద్యా శాఖ ఆలోచనలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే రాష్ట్రంలోని 25 వేల స్కూళ్లలో వీటిని ఏర్పాటు చేయడం ఖర్చుతో కూడుకున్నదని అధికార వర్గాలు భావన. సాధ్యాసాధ్యాలపై చర్చించి నిర్ణయం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.