![Caterpillar Found In Veg Biryani At Ikea Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2018/09/2/ikea-biryani.jpg.webp?itok=uWUQ9UwT)
హైదరాబాద్: ఐకియా స్టోర్‌లోని బిర్యానీలో గొంగళి పురుగు రావడం కలకలం రేపింది. శుక్రవారం స్టోర్‌కు వెళ్లిన మొహమ్మద్‌కు బిర్యానీ తింటుండగా అందులో గొంగళి పురుగు కనిపించింది. ఈ విషయాన్ని అతడు స్టోర్ మేనేజ్‌మెంట్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాకుండా ట్విటర్ ద్వారా సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని చేరవేశారు. దీనిపై స్పందించిన జీహెచ్‌ఎంసీ ఫుడ్ సెఫ్టీ అధికారులు శనివారం స్టోర్‌లో తనిఖీలు నిర్వహించారు.
స్టోర్‌లోని ఆహార పదార్థాలను పరిశీలించిన అధికారులు.. వాటిని పరీక్షలు నిమిత్తం ల్యాబ్‌కు పంపించారు. అదేవిధంగా ఐకియాకు 11,500 రూపాయల జరిమానా విధించారు. కాగా ఈ ఘటనపై ఐకియా ప్రతినిధులు స్పందిస్తూ.. జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేపడతామని.. మరోసారి ఇలా జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాగా ఆగస్టులో స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నీచర్ దిగ్గజం ఐకియా భారత్‌లో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment