సాక్షి, హైదరాబాద్ : స్వీడన్‌కు చెందిన అంతర్జాతీయ ఫర్నిచర్ దిగ్గజం ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా వన్ ప్లస్ వన్ ఆఫర్‌తో పాటు దాదాపు 1000 రకాల ఉత్పత్తుల ధర రూ. 200లోపు విక్రయించడంతో జనాలు విపరీతంగా తరలి వచ్చారు. ఓకే సారి భారీ జనం తరలిరావడంతో వారిని సెక్యూరిటీ సిబ్బంది అదుపుచేయలేక పోయారు. బారికేట్లను తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో స్టోర్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. లోపులాటలో పలువురికి గాయాలయ్యాయి.
హైటెక్ సిటీకి చేరువలో మైండ్‌స్పేస్‌కు ఎదురుగా రూ.1,000 కోట్ల వ్యయంతో 4,00,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐకియా ఇండియాలో తన తొలి స్టోర్ ఏర్పాటు చేసింది. ఒకేసారి వెయ్యి మంది కూర్చునే సామర్థ్యం ఉన్న రెస్టారెంట్‌ను కూడా ఐకియా ఈ స్టోర్‌లో ఏర్పాటు చేసింది. 7,500 రకాల ఫర్నిచర్, ఫర్నిషింగ్, వంటింటి సామగ్రిని ఇక్కడ విక్రయిస్తారు. దాదాపు 1,000 రకాల ఉత్పత్తుల ధర రూ.200 లోపే ఉండటం గమనార్హం.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment