హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసిన ఐకియా | Ikea purchase of land in Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసిన ఐకియా

Published Thu, Apr 30 2015 6:50 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసిన ఐకియా - Sakshi

హైదరాబాద్లో భూమి కొనుగోలు చేసిన ఐకియా

అంతర్జాతీయ ఫర్నీచర్ వ్యాపార దిగ్గజం స్వీడన్కు చెందిన ఐకియా కంపెనీ హైదరాబాద్లో వ్యాపార సముదాయాన్ని నెలకొల్పనుంది.

హైదరాబాద్: అంతర్జాతీయ ఫర్నీచర్ వ్యాపార దిగ్గజం స్వీడన్కు చెందిన  ఐకియా కంపెనీ హైదరాబాద్లో వ్యాపార సముదాయాన్ని నెలకొల్పనుంది. టీఎస్ఐఐసీ నుంచి ఎకరం భూమి 19కోట్ల 21 లక్షల రూపాయలకు ఐకియా కంపెనీ కొనుగోలు చేసింది. రాయదుర్గం పరిధిలో నాలెడ్జి సిటీలో స్థలం కొనుగోలు కూడా ఈ కంపెనీ అంగీకరించింది.

 భారతదేశంలోనే తమ మొదటి ఫర్నిచర్ సెంటర్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలన్న సంకల్పంతో ఈ కంపెనీ ఉంది. ఈ విషయమై కంపెనీ సీఈఓ జువెనికో మెజ్టు, సీఎఫ్‌ఓ ప్రీత్‌దాపర్‌లు  గత ఏడాది ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావుని కలిశారు.  ప్రస్తుతం ఐకియా కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 40 దేశాల్లో 338 స్టోర్లు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement