
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మూతపడిన ఐకియా స్టోర్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనుంది. భౌతిక దూరం పాటించడంతో పాటు సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్టోర్ మేనేజర్ అరెలీ రెయిమన్ వెల్లడించారు. తమ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం, ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేయడం, శానిటైజర్ యంత్రాల వంటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment