reopening
-
పాఠశాలల పునఃప్రారంభం ఒకరోజు వాయిదా
సాక్షి, అమరావతి: ఈ ఏడాది పాఠశాలలు ఒకరోజు ఆలస్యంగా తెరుచుకోనున్నాయి. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉండగా వాయిదా పడ్డాయి. అదే తేదీన నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు తెలిసింది. దీంతో గురువారం పాఠశాలలు తెరుచుకోనున్నాయి.కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1 నుంచి 10 తరగతుల విద్యార్థులకు గత ప్రభుత్వం పాఠశాలలు తెరిచిన మొదటిరోజే పాఠ్య పుస్తకాలతో పాటు యూనిఫామ్‌తో కూడిన విద్యా కానుక కిట్లు అందజేసింది. ఇలా వరుసగా నాలుగేళ్లు విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లను అందించింది. అయితే, ఈ విద్యా సంవత్సరం పాఠ్య పుస్తకాలతో పాటు విద్యా కానుక కిట్ల పంపిణీ కూడా ఆలస్యం కానుంది. పుస్తకాలు మండల కేంద్రాలకు చేరినా నూతన విద్యాశాఖ మంత్రి వచ్చాకే వీటి పంపిణీపై నిర్ణయం తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. పాఠశాల విద్యాశాఖ 36 లక్షల విద్యా కానుక కిట్లను సిద్ధం చేయగా, ఇప్పటి వరకు సగం మాత్రమే సరఫరా చేసినట్టు తెలుస్తోంది. ఈ కిట్‌లో అన్ని సబ్జెక్టుల పాఠ్యపుస్తకాలు, టోఫెల్ వర్క్‌బుక్, ఫ్యూచర్ స్కిల్స్ సబ్జెక్ట్ పుస్తకంతో పాటు 3 జతల యూనిఫాం క్లాత్, స్కూల్ బ్యాగ్, బెల్ట్, ఆక్స్ఫర్డ్ నిఘంటువు.. 1–5 తరగతుల విద్యార్థులకు వర్క్‌బుక్స్, పిక్టోరియల్ డిక్షనరీ, 6–10 తరగతులకు నోట్‌బుక్స్ ఉన్నాయి. మొదటి సెమిస్టర్‌కు 3.12 కోట్ల పుస్తకాలు ఈ విద్యా సంవత్సరంలో 1–10 తరగతుల విద్యార్థులకు మొత్తం 4.20 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం. కాగా, మొదటి సెమిస్టర్‌కు అవసరమైన 3.12 కోట్ల పుస్తకాలు దాదాపు మండల స్టాక్ పాయింట్లకు చేరాయి. గతంలో ఇచ్చినట్టుగానే ఇప్పుడూ ద్విభాషా పుస్తకాలనే ముద్రించారు. ఈ విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతి కూడా ఇంగ్లిష్ మీడియంలోకి మారడంతో అందుకు తగ్గట్టుగా పుస్తకాల ముద్రణ చేపట్టింది. అలాగే, 3–10 తరగతులకు వరకు పాఠ్యపుస్తక ముఖచిత్రాలు మార్చారు. రాష్ట్రంలో 1,000 ప్రభుత్వ పాఠశాలలు సీబీఎస్ఈలోకి మారిన సంగతి తెలిసిందే. ఈ విధానంలోనే స్టేట్ సిలబస్ పుస్తకాలను అందించనున్నారు.పదో తరగతి సాంఘికశా్రస్తాన్ని సీబీఎస్ఈ బోధనా విధానంలో.. జాగ్రఫీ, ఎకనామిక్స్, చరిత్ర, డెమోక్రటిక్ పాలిటిక్స్ సబ్జెక్టులుగా ఎన్సీఈఆర్టీ సిలబస్‌ను ముద్రించింది. ఫిజికల్ సైన్స్ పుస్తకాలను ఆర్ట్ పేపర్‌పై ముద్రించారు. ఈ తరహా ముద్రణ చేపట్టడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ప్రభుత్వం ఫ్యూచర్ స్కిల్స్ కోర్సును అందుబాటులోకి తెచి్చంది. ఈ బోధనకు అనుగుణంగా మొత్తం 4.30 లక్షల పుస్తకాలు సైతం ముద్రించి పంపిణీకి సిద్ధం చేశారు. అయితే, కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల మేరకు ఈ ఏడాది విద్యావిధానంలో కొన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని విద్యా రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. -
ఇక చదువుల సీజన్
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల హడావుడి ముగియ డంపై విద్యా రంగంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీ ఓపెనింగ్ అవుతున్నాయి. స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. ఇక ఇంట ర్ బోర్డ్ ప్రవేశాల మొదలు, ఉన్నత విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. 7 నుంచి బదిలీలు, పదోన్నతులు ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు. కానీ ఇప్పటి వరకూ రిలీవ్ చేయలేదు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్, ఎస్ఏ నుంచి హెచ్ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూపొందించారు. ఎన్నికల కోడ్ ముగియడంతో ఈ నెల 7వ తేదీ నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. ఊపందుకుంటున్న అడ్మిషన్లు ఇంటర్ అడ్మిషన్లకు అనుగుణంగా ఇంటర్ కాలేజీలకు బోర్డ్ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి. గత ఏడాది 80 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్ ఉత్తీర్ణులకు అవసరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్ ప్రక్రియను జూన్ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరుగుతుంది. డిగ్రీలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు. ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌కూ చురుకుగా ఏర్పాట్లు ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఆన్లైన్ దర ఖాస్తు లు ప్రక్రియ మొదలుపెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కనీ్వనర్ కోటాలో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ జూ లై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.వీసీల నియామకాలపై దృష్టిరాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచి్చన దరఖాస్తుల పరిశీలనకు ప్రభు త్వం సెర్చ్ కమిటీలను కూడా నియమించింది. మే నెలాఖరుతో వీసీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్‌లను ఇన్ఛార్జిలుగా నియమించారు. ఎన్నికల కోడ్ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇంత కాలం చేపట్టలేదు. సెర్చ్ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీ కి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు చెబుతున్నారు. -
ఏయూలో చారిత్రక కళావేదిక పునఃప్రారంభం
ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్ర యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన చారిత్రక ఆరుబయలు రంగస్థల వేదిక–ఎస్కిన్ స్క్వేర్ను ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జున చేతుల మీదుగా శుక్రవారం పునఃప్రారంభించారు. దాదాపు రూ.కోటి వ్యయంతో నాడు–నేడు పథకం స్ఫూర్తితో ఆధునీకరించిన యాంఫీ థియేటర్‌ను నాగార్జున ప్రారంభించారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. ఏయూ ప్రాంగణంలో తన తండ్రి అక్కినేని నాగేశ్వరరావు నటించిన కులగోత్రాలు చిత్రం షూటింగ్ జరిగిందన్నారు. త్వరలో తన సినిమా షూటింగ్‌ను కూడా ఇదే ప్రాంగణంలో చేస్తానని చెప్పారు. ఎందరో కళాకారులకు ప్రాణం పోసిన ఏయూ రంగస్థల వేదికను మళ్లీ తన చేతుల మీదుగా పునఃప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ కళావేదిక చరిత్ర వింటుంటే అల్లూరి సీతారామరాజు గుర్తుకు వచ్చారన్నారు. తనపై ఎనలేని ప్రేమాభిమానాలు చూపించిన ఏయూ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. ఏయూ హిందీ విభాగం గౌరవ ఆచార్యులు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ.. అక్కినేని నాగేశ్వరరావు సంస్కారం కలిగిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆ రోజుల్లో సొంత ఇంటిని కొనుక్కోకుండా తన సంపాదనలో లక్ష రూపాయలు గుడివాడ కాలేజీకి, రూ.25 వేలు ఏయూకు విరాళంగా అందించారని గుర్తు చేశారు. ఈరోజు ఆయన వారసులు ఏయూ రంగస్థల వేదికను పునఃప్రారంభించడం సంతోషించదగ్గ విషయమన్నారు. ఏయూ వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డి మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ సూచించిన విధంగా ఆర్ట్స్ కోర్సులకు పూర్వవైభవం తీసుకువస్తున్నామన్నారు. సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, నటన తదితరాలను విద్యార్థులకు అందుబాటులోకి తెస్తున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందించిన నాడు–నేడు పథకం నిధులతో విశ్వవిద్యాలయంలో చేసిన అభివృద్ధిని వివరించారు. రెండున్నర దశాబ్దాలుగా నిరుపయోగంగా మారిన ఈ ప్రాంగణాన్ని సీఎం జగన్ సహకారంతో సుందరంగా తీర్చిదిద్దామన్నారు. దీనిని నామమాత్రపు అద్దెతో కళాకారులకు అందిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నటుడు అక్కినేని అఖిల్, నాగార్జున సోదరి సుశీల, ఏయూ రెక్టార్ ఆచార్య కె.సమత, రిజి్రస్టార్ ఆచార్య ఎం.జేమ్స్ స్టీఫెన్, ప్రిన్సిపాల్స్, డీన్లు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సినీ నేపథ్య గాయకుడు ధనుంజయ్ ఆలపించిన గీతాలు ఆకట్టుకున్నాయి. -
ఏపీలో రేపటి నుంచి స్కూళ్లు.. జూన్ 17 వరకు ఒంటి పూటే..
సాక్షి, విజయవాడ: ఏపీలో రేపటి నుంచి పాఠశాలలు పున: ప్రారంభం కానున్నాయి. ఎండల తీవ్రత దృష్ట్యా జూన్ 17 వరకు ఒంటి పూట బడులు నిర్వహించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉదయం 7.30 గంటల నుంచి 11.30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటల నుంచి 9 గంటల మధ్యలో రాగి జావ, 11.30 నుంచి 12 గంటల వరకు జగనన్న గోరుముద్ద అందించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కమిషనర్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. చదవండి: విద్యాశాఖలో ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం -
సరికొత్త హంగులతో ఏషియన్ తారకరామ థియేటర్, త్వరలో పున:ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ తారకరామ థియేటర్ పున:ప్రారంభానికి సిద్ధమైంది. కొంతకాలంగా మరమ్మతులు జరుపుకొంటున్న ఈ థియేటర్ కొత్త హంగులతో ముస్తాబైంది. ఏషియన్ తారకరామ పేరుతో డిసెంబర్ 14న ఈ థియేటర్ గ్రాండ్‌గా రీఓపెన్ కానుంది. ఈ కార్యక్రమానికి నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరై థియేటర్ పున:ప్రారంభించనున్నారు. కాగా దివంగత మాజీ ముఖ్యమంత్రి, నటులు నందమూరి తారక రామారావుపై ఉన్న అభిమానంతో ప్రముఖ సినీ నిర్మాత నారాయణ్ కె దాస్ నారంగ్ ఈ థియేటర్‌కు మరమ్మతులు చేపట్టారు. తాజాగా అవి పూర్తయ్యాయి. నారంగ్ దాస్ తనయుడు సునీల్ నారంగ్ కొత్త టెక్నాలజీతో థియేటర్‌ను రెనొవేట్ చేయించారు. 4కే ప్రొజెక్షన్, సుపీరియర్ సౌండ్ సిస్టమ్‌తో పాటు, సీటింగ్‌లోనూ మార్పులు చేశారు. 975 సీటింగ్ కెపాసిటీ ఉన్న ఈ థియేటర్‌ను ప్రేక్షకుడికి సరికొత్త అనుభూతి పంచేలా ఉండేందుకు 590కి తగ్గించారు. రెక్లైనర్, సోఫాలను అందుబాటులోకి తెచ్చారు. పునః ప్రారంభం తర్వాత డిసెంబరు 16 నుంచి హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’ను ప్రదర్శించనున్నారు. ఇక ఈ థియేటర్ పున:ప్రారంభానికి ఎంతో మద్దతునిచ్చిన నందమూరి మోహనకృష్ణకు సునీల్ నారంగ. భరత్ నారంగ్, సురేశ్ బాబు సదానంద గౌడ్లు ధన్యవాదాలు తెలిపారు. చదవండి: అషు కాలును ముద్దాడటంపై ఆర్జీవీ క్లారిటీ, ట్రోలర్స్‌కు వర్మ గట్టి కౌంటర్ పెళ్లి తర్వాత హీరోయిన్స్ కెరీర్ ముగిసినట్టేనా? యామీ గౌతమ్ ఏమన్నదంటే.. -
నీలాచల్‌కు విస్తరణ స్పీడ్
న్యూఢిల్లీ: ఇటీవల సొంతం చేసుకున్న నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్)ను పునఃప్రారంభించనున్నట్లు మెటల్ రంగ దిగ్గజం టాటా స్టీల్ తాజాగా వెల్లడించింది. అంతేకాకుండా సామర్థ్య విస్తరణను సైతం చేపట్టనున్నట్లు తెలియజేసింది. రానున్న కొన్నేళ్లలో వార్షికంగా 4.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) లాంగ్ ప్రొడక్టుల తయారీకి కంపెనీని సిద్ధం చేయనున్నట్లు పేర్కొంది. 2030 కల్లా 10 మిలియన్ టన్నులకు స్టీల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని చేర్చనున్నట్లు తెలియజేసింది. ఇందుకు వేగంగా, సమర్థంగా ప్రణాళికలు అమలు చేయనున్నట్లు వివరించింది. అనుబంధ సంస్థ టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) ద్వారా ఎన్ఐఎన్ఎల్ను కొనుగోలు చేయడం తెలిసిందే. ప్రైవేటైజేషన్ పూర్తి: ఆర్థిక శాఖ నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్(ఎన్ఐఎన్ఎల్) ప్రైవేటైజేషన్ పూర్తయినట్లు ఆర్థిక శాఖ తాజాగా వెల్లడించింది. కంపెనీ యాజమాన్య నిర్వహణను టాటా గ్రూప్‌నకు సంపూర్ణంగా బదలాయించినట్లు పేర్కొంది. వెరసి ప్రస్తుత ప్రభుత్వం రెండో కంపెనీని విజయవంతంగా ప్రైవేటైజ్ చేసినట్లు తెలియజేసింది. ప్రైవేటైజేషన్ జాబితాలోని తొలి సంస్థ విమానయాన రంగ దిగ్గజం ఎయిరిండియాను సైతం టాటా గ్రూప్ చేజిక్కించుకున్న విషయం విదితమే. ఎన్ఐఎన్ఎల్ కొనుగోలుకి ఈ ఏడాది జనవరిలో టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్(టీఎస్ఎల్పీ) వేసిన రూ. 12,100 కోట్ల విలువైన బిడ్ గెలుపొందింది. కాగా.. కంపెనీలో ప్రమోటర్లు, భాగస్వామ్య సంస్థలకుగల మొత్తం 93.71 శాతం వాటాను టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్‌కు పూర్తిగా బదిలీ చేసినట్లు ఆర్థిక శాఖ తెలియజేసింది. నిరవధిక నష్టాల నేపథ్యంలో ఒడిశాలోని కళింగనగర్లోగల 1.1 మిలియన్ టన్నుల స్టీల్ ప్లాంటును ఎన్ఐఎన్ఎల్ 2020 మార్చిలో మూసివేసింది. -
AP: స్కూళ్ల ప్రారంభానికి ముందే ‘పుస్తకం’ సిద్ధం
సాక్షి, అమరావతి: గణగణ గంటలు మోగడమే ఆలస్యం.. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను ఉచితంగా అందచేసేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. పాఠశాలల పునఃప్రారంభానికి నెల రోజుల ముందే విద్యార్ధులకు అందించాల్సిన పాఠ్యపుస్తకాలను సిద్ధంగా ఉంచడం గమనార్హం. స్కూళ్లు తెరిచిన వెంటనే ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 2022–23 విద్యాసంవత్సరానికి సంబంధించి 3.38 కోట్ల పుస్తకాలను జగనన్న విద్యాకానుకతో సహా అందించనున్నారు. గత సర్కారు హయాంలో నవంబర్ – డిసెంబర్ వరకు కూడా విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు పూర్తిస్థాయిలో అందించలేని దుస్థితి నెలకొనగా ఇప్పుడు స్కూళ్లు ప్రారంభం కావడమే ఆలస్యం అనే రీతిలో చర్యలు చేపట్టడం విద్యారంగంపై వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకుంటున్న శ్రద్ధకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ నెలలోనే అమ్మ ఒడి పథకం కింద లబ్ధి చేకూర్చనుంది. ప్రభుత్వ పాఠశాలలకు పెరిగిన ఆదరణ అధికారంలోకి రాగానే విద్యారంగ సంస్కరణలు చేపట్టిన సీఎం వైఎస్ జగన్ నాడు–నేడు ద్వారా స్కూళ్లలో పెద్ద ఎత్తున మౌలిక సదుపాయాలను సమకూర్చడంతో లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల బాట పట్టారు. స్కూళ్లు తెరిచిన వెంటనే జగనన్న విద్యాకానుక ద్వారా విద్యార్ధులకు 3 జతల యూనిఫారం, బెల్టు, బూట్లు, సాక్సులు, బ్యాగుతో పాటు ఇంగ్లీషు డిక్షనరీ, పాఠ్య పుస్తకాలు, వర్కుబుక్స్ అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భారం లేకుండా సెమిస్టర్లవారీగా 1 నుంచి 10వ తరగతి వరకు 330 రకాల టైటిళ్ల పుస్తకాలను ప్రభుత్వం సిద్ధం చేసింది. తెలుగు, ఇంగ్లీషు, ఉర్దూ, కన్నడ, తమిళం, ఒరియా మాధ్యమాలతో కూడిన ఈ పుస్తకాలను ప్రభుత్వ స్కూళ్ల విద్యార్ధులకు అందచేస్తారు. గతంలో ఏడాది మొత్తానికి ఒకే ఒక పాఠ్య పుస్తకాన్ని ఇవ్వడం వల్ల పరిమాణం పెరిగి విద్యార్ధులు అధిక బరువులు మోయలేక అల్లాడేవారు. పైగా కొద్ది రోజులకే చిరిగిపోయేవి. ఈ పరిస్థితిని గమనించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 6వ తరగతినుంచి సెమిస్టర్ విధానానికి శ్రీకారం చుట్టింది. సెమిస్టర్ల వారీగా పుస్తకాలను అందించడం వల్ల మోత బరువు నుంచి విముక్తి లభించింది. ఈసారి మొదటి సెమిస్టర్ కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్ధులకు 3,38,70,052 పాఠ్య పుస్తకాలను అందించనున్నారు. గుత్తాధిపత్యానికి తెర జూలై 4వతేదీ నుంచి పాఠశాలలు పునఃప్రారంభం కానుండడంతో విద్యాశాఖ ఇప్పటికే ముద్రణ ప్రక్రియ పూర్తి చేసి మండల కేంద్రాలకు సరఫరా చేపట్టింది. నెల రోజుల ముందే మండల కేంద్రాలకు 60 శాతానికి పైగా పుస్తకాలు చేరుకున్నాయి. మరో రెండు మూడు రోజుల్లో మిగతావి కూడా చేరనున్నాయి. గతంలో నేతలు, ప్రింటర్ల ఇష్టారాజ్యంగా ముద్రణ వ్యవహారాలు నడిచేవి. మే ఆఖరు వరకు కూడా పుస్తకాల ముద్రణ టెండర్లే ఖరారయ్యేవి కావు. ఇప్పుడు వాయువేగంతో అన్నీ పూర్తి చేసి స్కూళ్లు తెరవటానికి ముందే పుస్తకాలను ప్రభుత్వం సిద్ధంగా ఉంచింది. గతంలో నలుగురైదుగురి గుత్తాధిపత్యంతో ముద్రణ జరగడం వల్ల చాలా జాప్యం జరిగేది. ఈసారి టెండర్లకు ముందుకు వచ్చిన 20 మంది ప్రింటర్లకు కూడా ముద్రణకు అవకాశమిచ్చారు. ప్రైవేట్ స్కూళ్లకూ ప్రభుత్వం నుంచే... ఈ విద్యాసంవత్సరం ప్రైవేట్ స్కూళ్లకు కూడా ప్రభుత్వమే పాఠ్యపుస్తకాల ముద్రణ చేపట్టి పంపిణీ చేస్తోంది. గతంలో ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ ప్రింటర్లు సరఫరా చేయడం వల్ల తల్లిదండ్రులపై మోయలేని భారం పడేది. ప్రభుత్వ ధర కన్నా నాలుగైదు రెట్లు అధిక ధరలకు పుస్తకాలను విక్రయించి సొమ్ము చేసుకునేవారు. ఈ అక్రమాలను గుర్తించిన ప్రభుత్వం ఈదఫా ఆ పాఠ్యపుస్తకాల ముద్రణ కూడా తానే ప్రైవేట్‌కు అప్పగించి స్కూళ్లకు నేరుగా పంపిణీ చేస్తోంది. మారుపేర్లతో మాయచేస్తూ.. 2007 వరకు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకు అందించే విధానం ఉండగా ఆ తరువాత ప్రైవేట్‌కే విడిచిపెట్టారు. ఫలితంగా ప్రింటర్లు తక్కువ ముద్రణ చూపిస్తూ ప్రభుత్వానికి రాయల్టీ ఎగ్గొడుతూ వస్తున్నారు. ప్రభుత్వం రూపొందించిన కంటెంట్‌ను వేరే పబ్లిషర్లకు అందించి మారుపేర్లతో ముద్రణ చేపడుతూ అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఉదాహరణకు ఫస్ట్ క్లాస్ పాఠ్యపుస్తకాల సెట్ ప్రభుత్వ ధర రూ.280గా మాత్రమే ఉండగా స్కూళ్లలో ప్రైవేట్ ముద్రణ పేరుతో రూ.2 వేల వరకు గుంజేవారు. ఇప్పుడు ప్రభుత్వమే ప్రైవేట్ స్కూళ్లకూ పాఠ్యపుస్తకాలు అందించనున్నందున తల్లిదండ్రులపై అధిక భారం తప్పనుంది. ప్రైవేట్ స్కూళ్లకు అవసరమైన పుస్తకాలకు సంబంధించి విద్యాశాఖ ముందుగానే ఇండెంట్లు తీసుకుంది. మొత్తం 13,635 ప్రైవేట్ స్కూళ్లలో 24 లక్షల మంది విద్యార్ధులుండగా 12,721 స్కూళ్లు 18.02 లక్షల మందికి పుస్తకాల కోసం ఇండెంట్లు ఇచ్చాయి. వీరికి కావాల్సిన 1.36 కోట్ల పాఠ్యపుస్తకాలను కూడా ప్రభుత్వమే ముద్రణ చేపట్టి ఆయా స్కూళ్లకు అందించేలా ఏర్పాట్లు చేసింది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్ధులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లీషులో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్ధులకు ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. మరోవైపు ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్ధులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతి విద్యార్ధులకు కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. ప్రభుత్వ స్కూళ్లకు పాఠ్యపుస్తకాల పంపిణీ ఇలా.. జిల్లా ఇండెంట్ ఇప్పటివరకు ఇచ్చినవి శ్రీకాకుళం 2039753 748657 విజయనగరం 1691284 681190 విశాఖపట్నం 2745643 1267638 ప.గోదావరి 3670404 1626840 తూ.గోదావరి 2563960 1159599 కృష్ణా 2495376 1123140 గుంటూరు 3057027 1500467 ప్రకాశం 2471675 1269181 నెల్లూరు 2065629 821382 కడప 2001972 931523 కర్నూలు 3415546 1612591 అనంతపురం 2946820 1391097 చిత్తూరు 2704963 1266852 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– మొత్తం 33870052 15400157 –––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––– నోట్: ఇవి కాకుండా ప్రస్తుతం 70 లక్షల పుస్తకాలను ప్రింటింగ్ ప్రెస్‌ల నుంచి గోడౌన్లకు తరలిస్తున్నారు. మొత్తం పుస్తకాల తరలింపు రెండు మూడు రోజుల్లో పూర్తి కానుంది. ద్విభాషా పాఠ్యపుస్తకాలు ప్రభుత్వ స్కూళ్లలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశ పెట్టడంతో విద్యార్థులకు సౌకర్యంగా ఉండేందుకు పాఠ్యపుస్తకాలను బైలింగ్యువల్ (ద్విభాషా) విధానంలో మిర్రర్ ఇమేజ్‌తో ముద్రించి పంపిణీ చేయనున్నారు. ఒకపక్క తెలుగు, దానికి ఎదురు పేజీలో ఇంగ్లిష్‌లో పాఠ్యాంశాలు ఉండటంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతోంది. ప్రభుత్వ స్కూళ్లలో సీబీఎస్ఈ సిలబస్‌ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. ఇప్పటికే 6, 7 తరగతుల విద్యార్థులకు ఈ సిలబస్‌తో పాఠ్యపుస్తకాలు అందించారు. ఈ విద్యాసంవత్సరంలో 8వ తరగతికి కూడా సీబీఎస్ఈ సిలబస్ పుస్తకాలు అందిస్తారు. రానున్న రెండేళ్లలో 10వ తరగతి వరకు అన్ని తరగతుల్లోనూ సీబీఎస్సీ సిలబస్ అమల్లోకి రానుంది. -
Omicron Outbreak: ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లేదు!
భువనేశ్వర్: ఓ వైపు కరోనా భీభత్సం, మరోవైపు ఒమిక్రాన్ ఉధృతి వెరసి విద్యాసంస్థలు తెరవాలనే నిర్ణయానికి గండి పండింది. ఒడిశా రాష్ట్రంలో ప్రాధమిక పాఠశాలలను తెరవాలనే నిర్ణయం మరోమారు వాయిదా పడింది. ఈ ఏడాది జనవరి 3 నుంచి 1 నుంచి 5 తరగతులకు చెందిన పాఠశాలలను పునఃప్రారంభిస్తున్నట్లు ఒడిసా ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కోవిడ్ వ్యాప్తి దృష్ట్యా అధికారులు వివిధ పాఠశాలలను సందర్శించిన అనంతరం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి ఎస్ఆర్ దాష్ తెలిపారు. ఐతే 6 నుంచి 10 తరగతుల పిల్లలు మాత్రం యథాతథంగా ఫిజికల్ క్లాసులకు హాజరుకావాలని చెప్పారు. కోవిడ్ ప్రొటోకాల్‌కు కట్టుబడి షెడ్యూల్ ప్రకారం ఆఫ్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహిస్తామని మంత్రి పేర్కొన్నారు. ఆరోగ్య శాఖ బులెటన్ ప్రకారం గడచిన రెండు నెలల్లో కన్నా నిన్న ఒక్క రోజే 424 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యినట్లు ఆదివారం తెల్పింది. కొత్తగా కరోనా సోకిన పేషంట్లలో 18 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారు దాదాపు 67 మంది ఉన్నట్లు బులెటన్ తెల్పుతోంది. చదవండి: Covid Live Updates: కోటికి పైగా కోవిడ్ కేసులు నమోదైన ఆరో దేశంగా రికార్డు..! -
Telangana: తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రమే..!
సాక్షి, హైదరాబాద్/ నెట్వర్క్: రాష్ట్రవ్యాప్తంగా విద్యాసంస్థలు తిరిగి ప్రారంభమైనా.. తొలిరోజున విద్యార్థుల హాజరు నామమాత్రంగా నమోదైంది. బుధవారం చాలావరకు ప్రభుత్వ, ప్రైవేటు బడులన్నీ బోసిపోయి కనిపించాయి. విద్యార్థులను బడులకు రప్పించేందుకు విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు ప్రయత్నించారు. జిల్లా, రాష్ట్రస్థాయిలో అధికారులు కూడా రంగంలోకి దిగారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. కానీ విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి కనిపించింది. ఇంకొన్ని రోజులు వేచిచూద్దామని తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. ప్రైవేటు విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధనకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ప్రభుత్వం ఆన్లైన్ బోధనకు వెసులుబాటు ఇవ్వడంతో.. పాఠశాలలతో పాటు విద్యార్థులు కూడా ఆన్లైన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా నమోదైంది. బుధవారమే మొదటి రోజు కావడంతో రాష్ట్రవ్యాప్తంగా స్కూళ్లలో విద్యార్థుల హాజరు తక్కువగా ఉందని, కొద్దిరోజుల్లోనే పుంజుకుంటుందని విద్యాశాఖ అధికారులు చెప్తున్నారు. సగటున 22 శాతం మించలేదు గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లు మినహా అన్ని విద్యాసంస్థలను పునః ప్రారంభించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం తొలిరోజున ప్రభుత్వ స్కూళ్లలో 27.45 శాతం, ప్రైవేటు బడుల్లో 18.35 శాతం విద్యార్థుల హాజరునమోదైంది. మొత్తంగా సగటు హాజరుశాతం 22కు మించలేదని అధికార వర్గాలు తెలిపాయి. రాష్ట్రంలో 405 ఇంటర్ కాలేజీల్లో ఫస్టియర్ విద్యార్థులు 97,520 మందికిగాను 16,907 మంది.. సెకండియర్‌లో 84,038 మందికిగాను 12,687 మంది హాజరయ్యారు. సగటున 15 శాతమే హాజరు నమోదైంది. భయం భయంగానే.. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు ఎక్కువ మంది బడికి వచ్చారు. గ్రామాల్లో తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు కన్పించలేదని ఉపాధ్యాయులు చెప్తున్నారు. అయితే సీజనల్ జ్వరాలు, ఇతర అనారోగ్యం ఉన్నవారిని బడులకు రాకుండా చూశారు. వ్యవసాయ పనులకు వెళ్లే విద్యార్థుల్లో చాలా వరకు పాఠశాలకు రావడానికి ఆసక్తి చూపలేదు. పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. తల్లిదండ్రులు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నారని, క్రమంగా హాజరు పుంజుకుంటుందని అధికారులు చెప్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రైవేటు స్కూళ్లలో హాజరు కాస్త మెరుగ్గా ఉంది. కానీ సమీపంలోని పట్టణాలు, వేరే ఊర్లలో చదువుతున్న విద్యార్థులు మాత్రం వెళ్లలేదు. పాఠశాలల వాహనాలు గ్రామాలకు వచ్చినా తల్లిదండ్రులు పిల్లలను పంపలేదు. పట్టణ, నగర ప్రాంతాల్లోని ప్రైవేటు స్కూళ్లలో హాజరుశాతం తక్కువగా కనిపించింది. ఏడాదిన్నరగా బడులు లేకపోవడం, ఉపాధి అవకాశాలు సన్నగిల్లడంతో చాలామంది తల్లిదండ్రులు సొంతూర్లకు వెళ్లారు. వారు ఇప్పటికిప్పుడు పట్టణాలకు వచ్చే పరిస్థితి లేదు. దానికితోడు ఆన్లైన్ బోధన ఉండటంతో.. దానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థల్లో చాలా వరకు ఆన్లైన్ బోధనకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. చిన్నగదుల్లో ప్రత్యక్ష బోధన వల్ల సమస్యలు రావొచ్చనే ఆలోచనతో ఉన్నాయి. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంతకాలం పరిస్థితిని గమనించాకే స్కూళ్లకు పంపాలని భావిస్తున్నారు. బుధవారం స్కూళ్లు, విద్యార్థుల పరిస్థితి ఇదీ.. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో మొత్తం విద్యార్థులు: 52,22,174 తొలిరోజు హాజరైన విద్యార్థుల సంఖ్య: 11,37,095 (21.77 శాతం) ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థులు: 19,66,234 హాజరైన విద్యార్థులు: 5,39,674 (27.45 శాతం) ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులు: 32,55,940 హాజరైన విద్యార్థులు: 5,97,421 (18.35 శాతం) బడికి రెడీ.. సైకిలే రిపేర్.. ఖమ్మం జిల్లా కేంద్రంలో పాఠశాలకు వెళ్లేందుకు బయలుదేరిన విద్యార్థి ఇతను. సైకిల్ మొరాయించడంతో మధ్యలో ఆగి మరమ్మతు చేయించుకున్నాడు. చిన్న పిల్లలు రాలే.. ఖమ్మం జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో ఉన్న అంగన్వాడీ కేంద్రం ఇది. బుధవారం ఈ కేంద్రాన్ని తెరిచినా.. పిల్లలెవరూ రాక టీచర్ ఖాళీగా కూర్చున్నారు. బడికి కొందరు.. చెత్త ఏరుతున్న మరికొందరు ప్రత్యక్ష బోధన ప్రారంభం కావడంతో.. కొందరు పిల్లలు బడిబాట పట్టినా, మరికొందరు పనులకు వెళ్లారు. భువనగిరి పట్టణంలో కొందరు విద్యార్థులు పాఠశాలకు వెళ్తుండగా.. ఆ ప్రాంతంలోనే మరికొందరు పిల్లలు చెత్త పేపర్లు సేకరిస్తున్న దృశ్యమిది. తొలిరోజే.. తృటిలో తప్పిన ప్రమాదం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని తిమ్మాపూర్ అంగన్వాడీ కేంద్రంలో తొలిరోజు అపశ్రుతి చోటు చేసుకుంది. ఇక్కడి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో శిథిలావస్థలో ఉన్న పాత గదుల్లో కొన్నేళ్లుగా అంగన్వాడీ కేంద్రం కొనసాగుతోంది. బుధవారం ఈ కేంద్రానికి వచ్చిన గర్భిణులు, బాలింతలకు అంగన్వాడీ హెల్పర్ మౌనిక సరుకులు అందజేస్తుండగా.. భవనంపై చెట్టుకొమ్మలు విరిగిపడ్డాయి. ఒక్కసారిగా అందరూ బయటికి పరుగెత్తారు. భవనం పాక్షికంగా దెబ్బతింది. ఇద్దరు విద్యార్థులు.. పది మంది లెక్చరర్లు మహబూబ్‌నగర్ జిల్లా మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 350 మంది విద్యార్థులు ఉండగా.. బుధవారం ఇద్దరు మాత్రమే హాజరయ్యారు. మరోవైపు కాలేజీలోని పది మంది లెక్చరర్లు విధులకు వచ్చారు. మంగళ హారతులిచ్చి.. మెదక్ జిల్లా కుర్తివాడ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మంగళ హారతులతో స్వాగతం పలుకుతున్న ఉపాధ్యాయులు వీరు. విద్యార్థులను శుభ సూచకంతో స్వాగతించాలని ఇలా చేసినట్టు వారు చెప్పారు. బురదలో నడుచుకుంటూ.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులోని బాలుర ఉన్నత పాఠశాల వద్ద బురదలో నడుచుకుంటూ వెళుతున్న విద్యార్థులు. పాఠశాలకు వెళ్లే దారి సరిగా లేకపోవడంతో ఇటీవలి వర్షాలకు నీళ్లు నిలిచి బురదగా మారింది. డప్పులతో విద్యార్థులకు స్వాగతం చాలా రోజుల తర్వాత పాఠశాలలు తిరిగి తెరుచుకోవడంతో విద్యార్థులకు డప్పు చప్పుళ్లతో స్వాగతం పలుకుతున్న దృశ్యమిది. మెదక్ జిల్లా రామాయంపేట మండలం రాయిలాపూర్ పాఠశాలలో అక్కడి సర్పంచ్ నర్సాగౌడ్, ఉపాధ్యాయులు ఇలా స్వాగతం పలికారు. గదులు లేక.. వరండాలో చదువులు ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో వరండాలో కూర్చుని చదువుకుంటున్న విద్యార్థులు వీరు. మొత్తంగా 142 మంది విద్యార్థులు ఉండగా.. మూడే తరగతి గదులు ఉన్నాయి. దీనితో 7, 8వ తరగతుల విద్యార్థులను వరండాలో కూర్చోబెట్టి పాఠాలు చెప్తున్నారు. బడి కూలిపోయేలా ఉంది సార్.. మంత్రి కేటీఆర్‌కు జనగామ ఉపాధ్యాయుల ట్వీట్ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశాలు! జనగామ: జనగామ జిల్లా కేంద్రంలో సిద్దిపేట రోడ్డులో ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాల శిథిలావస్థకు చేరింది. 160 మంది విద్యార్థులున్న ఈ పాఠశాలలో తరగతి గదుల పైకప్పు దెబ్బతింది. ఇటీవలి వర్షాలతో గోడలు తడిసి, గదుల్లోకి నీరు వస్తోంది. ఉపాధ్యాయులు దీనిపై మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ‘‘జనగామలో బాలికల ఉన్నత పాఠశాలలో 160 మంది విద్యార్థులు ఉన్నారు. తరగతి గదులతోపాటు వరండా పైకప్పు కూలిపోవడానికి సిద్ధంగా ఉంది. బడి కోసం కొత్త భవన నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదన రెండేళ్లుగా పెండింగ్‌లో ఉంది. విద్యార్థుల ప్రాణాలను దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవాలి’’ అని కోరారు. దీనిపై స్పందించిన మంత్రి కేటీఆర్.. పాఠశాల తరలింపు, కొత్త భవన నిర్మాణానికి సంబంధించి చర్యలు చేపట్టాలని జిల్లా అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. బడిలో విద్యాశాఖ కమిషనర్.. బీబీనగర్, భూదాన్ పోచంపల్లి: పాఠశాలలు పునః ప్రారంభం అవుతుండటంతో విద్యా శాఖ కమిషనర్ దేవసేన.. బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి స్కూళ్లను సందర్శించారు. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలంలోని రాయరావుపేట, జామీలపేట, పడమటి సోమవారం గ్రామాల్లో ప్రభుత్వ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలను, భూదాన్ పోచంపల్లి పట్టణంలోని మోడల్ స్కూల్‌ను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కోవిడ్ నిబంధనలను సక్రమంగా పాటించాలని ఉపాధ్యాయులు, విద్యార్థులకు సూచించారు. -
తెలంగాణలో తెరచుకున్న బడులు
-
చదువుతో పాటు ప్రాణాలూ ముఖ్యమే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వివిధ పాఠశాలల విద్యార్థులకు చదువు ఎంత ముఖ్యమో.. వారు కరోనా బారినపడకుండా సురక్షితంగా ప్రాణాలతో ఉండడం అంతకంటే ముఖ్యమని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రత్యక్ష తరగతులకు హాజరైన విద్యార్థి కరోనా బారినపడి మృతి చెందితే ఆ విద్యార్థి తల్లిదండ్రుల బాధ, క్షోభ వర్ణనాతీతమని పేర్కొంది. విద్యా సంవత్సరం కోల్పోయినా పరవాలేదు.. పిల్లలు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలనే తల్లిదండ్రులు కోరుకుంటారని వ్యాఖ్యానించింది. పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు యూనిసెఫ్ సూచించినా.. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు అందుకు అనుకూలంగా లేవని అభిప్రాయపడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), విపత్తు నిర్వహణ సంస్థ (డిజాస్టర్ మేనేజ్మెంట్)లు ఇదేవిధంగా చెబుతున్నాయంది. కరోనా మూడో దశ ప్రభావం ముఖ్యంగా పిల్లలపై ఉంటుందనే డాక్టర్ల హెచ్చరికల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులు, సంక్షేమ హాస్టళ్లను ప్రారంభాన్ని నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలంటూ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎంఎస్ రామచందర్‌రావు, జస్టిస్ టి.వినోద్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఆదేశించింది. హడావుడిగా ప్రారంభిస్తున్నారు.. సెప్టెంబర్ 1 నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలంటూ పాఠశాల విద్యాశాఖ జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన అధ్యాపకులు ఎం.బాలక్రిష్ణ దాఖలు చేసిన ప్రజాహిత వ్యాజ్యాన్ని ధర్మాసనం విచారించింది. ఎటువంటి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అకస్మాత్తుగా, హడావుడిగా ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే ఆదేశాలిచ్చారని పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ పేర్కొన్నారు. అయితే ప్రభుత్వం అన్ని అంశాలపై చర్చించిన తర్వాతే ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలనే నిర్ణయం తీసుకుందని అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ నివేదించారు. ప్రభుత్వం సమన్వయం చేయాలి ఈ సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకుంది. ‘విద్యా సంస్థలు తెరవకపోతే విద్యార్థులు నష్టపోతారన్న అభిప్రాయం ఒకవైపు, తెరిస్తే వారి ప్రాణాలను ఎలా కాపాడతారన్న సందేహం మరోవైపు ఉన్నాయి. ఈ రెండింటినీ ప్రభుత్వం సమన్వయం చేయాలి’ అని అభిప్రాయపడింది. పాఠశాలల ప్రారంభంపై ప్రభుత్వానికి పలు ఆదేశాలు, సూచనలు జారీ చేసింది. తాము కోరిన సమాచారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని విద్యా శాఖ కార్యదర్శి, పాఠశాల విద్య, ప్రజా ఆరోగ్య విభాగం సంచాలకులతో పాటు నీలోఫర్‌కు చెందిన నిపుణుల కమిటీలను ఆదేశిస్తూ తదుపరి విచారణను అక్టోబర్ 4కు వాయిదా వేసింది. ఏ పాఠశాలపైనా చర్యలు తీసుకోవద్దు ‘గురుకులాలు తెరవొద్దు. ఇతర పాఠశాలల్లో చదువుకునే ఏ విద్యార్థినీ ప్రత్యక్ష తరగతులకు హాజరుకావాలని యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు. ప్రత్యక్ష తరగతులు ప్రారంభిం చాలంటూ ఇటీవల ఇచ్చిన ఆదేశాల ప్రకారం ప్రత్యక్ష తరగతులు నిర్వహించని ఏ పాఠశాల మీదా ప్రభుత్వం చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి వీల్లేదు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులకు జరిమానా విధించడం లాంటి వాటితో పాటు ఏ రకమైన చర్యలూ తీసుకోరాదు. పాఠశాలలో విద్యార్థి కరోనా బారిన పడితే పాఠశాల యాజమాన్యానికి ఎటువంటి బాధ్యత ఉండదని, ఇందుకు అంగీకరిస్తూ పత్రం సమర్పించాలని విద్యా ర్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం చట్ట విరుద్ధం, అనైతికం. పాఠశాలల యాజమా న్యాలు కేవలం ఆన్లైన్ లేదా కేవలం ప్రత్యక్ష తరగతులు నిర్వహించుకోవచ్చు. లేదా రెండింటినీ నిర్వహించుకునే స్వేచ్ఛ ఉంది.’ వారం రోజుల్లో మార్గదర్శకాలు రూపొందించాలి ‘ఈ ఆదేశాలు ప్రీ ప్రైమరీ, ప్రైమరీ పాఠశాలల విద్యార్థులకే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు వర్తి స్తాయి. పాఠశాలలో ప్రత్యక్ష తరగతుల నిర్వ హణకు సంబంధించి తీసుకోవాల్సిన జాగ్ర త్తలపై వారం రోజుల్లో ప్రభుత్వం మార్గదర్శ కాలు రూపొందించాలి. వీటిని ప్రసార మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం నిర్వహించాలి..’ అని కోర్టు ఆదేశించింది. ఎన్ని పడకలు అందుబాటులో ఉన్నాయి? ‘రాష్ట్రంలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ పాఠశాలలు ఎన్ని ఉన్నాయి ? గురుకులాలు, వసతిగృహాల్లో విద్యా ర్థులు వైరస్ బారినపడకుండా ఎటువంటి చర్యలు తీసుకున్నారు? పాఠశాలల ప్రారంభానికి సంసిద్ధతపై ప్రభుత్వ, ప్రైవేట్ యాజమాన్యాల నుంచి నివేదికలు ఏమైనా తీసుకున్నారా? పిల్లలు కరోనాబారిన పడితే చికిత్స అందించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో ఎన్ని పడకలు అందుబాటులో ఉంచారు?’ తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు సూచించింది. నీలోఫర్ వైద్యులతో కూడిన నిపుణుల కమిటీ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అన్నీ పరిగణనలోకి తీసుకుని... ‘కరోనా మూడో దశ సెప్టెంబర్/అక్టోబర్ నెలల్లో వచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు వస్తున్నాయి. 18 ఏళ్లు నిండిన వారందరికీ వ్యాక్సిన్ ఇప్పటికీ ఇవ్వలేదు. 18 ఏళ్లు నిండని వారికి ఇంకా వ్యాక్సిన్ రాలేదు. చిన్నారులు కరోనా బారిన పడినా, వారికి లక్షణాలు కనిపించే అవకాశం ఉండదని పరిశో« దకులు చెబుతున్నారు. పాఠశాల పిల్లలు టీచింగ్, నాన్‌టీచింగ్ స్టాఫ్‌తో సన్నిహితంగా మెలిగే అవ కాశం ఉంది. అయితే సిబ్బంది అందరికీ ఇంకా వ్యాక్సిన్ ఇవ్వలేదు. వీరి ద్వారా కరోనా విద్యా ర్థులకు వ్యాపించే అవకాశం ఉంది. వారిద్వారా వారి కుటుంబసభ్యులకు రావొచ్చు. అలాగే ఇతర అనారోగ్య సమస్యలు ఉన్న చిన్నారులు సైతం కరోనా బారినపడే అవకాశం ఉంది. విద్యార్థులు భౌతిక దూరం పాటించడం, పాఠశాలలో ఉన్నంత సేపు మాస్కు ధరించడం చాలా కష్టం. అదే సమయంలో కొందరు విద్యార్థుల తల్లిదండ్రులు, కొన్ని పాఠశాలల యాజమాన్యాలు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించాలని కోరుకోవడానికి సహేతుకమైన కారణాలు ఉండొచ్చు. స్మార్ట్ఫోన్లు, ఇంటర్నెట్ సౌకర్యం అందుబాటులో లేనివారు ప్రత్యక్ష తరగతులు కోరుకోవడం సహజమే. అలాగే మధ్యాహ్న భోజన పథకం ఆశించేవారు, ఇతర ఆర్థికపరమైన కారణాలున్నవారు కూడా ఈ విధం గా కోరుకోవచ్చు. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని అందరి హక్కులు, ప్రయోజనాలు, ఆందోళనలను పరిగణనలోకి తీసుకొని ఉత్తర్వులు జారీ చేస్తున్నాం..’ అని ధర్మాసనం స్పష్టం చేసింది. -
‘వ్యాక్సిన్ ఆఫర్’.. ఒక సినిమా టికెట్ కొంటే మరొకటి ఫ్రీ !
దేశవ్యాప్తంగా తమ సినియా థియేటర్లు, మల్టీప్లెక్సులు జులై 30 నుంచి తెరుచుకుంటాయని మల్టీప్టెక్స్ చైన్ పీవీఆర్ సినిమాస్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్స్‌కి వచ్చే కస్టమర్లను ఆకట్టుకునేందుకు ‘జాబ్ ఆఫర్’ను ప్రకటించింది. బొమ్మపడింది దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గిపోవడంతో క్రమంగా సినిమా థియేటర్లు ఓపెన్ అవుతున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు భారీగా తెరుచుకునేందుకు ఉత్సాహంగా ఉండగా కోవిడ నిబంధనల కారణంగా మల్టీప్లెక్స్‌లు కొంచెం తటపటాయిస్తున్నాయి. అయితే వందశాతం కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తమ ఆధీనంలో ఉన్న మల్టీప్లెక్సులు జులై 30 నుంచి ఓపెన్ చేశామని పీవీఆర్ ప్రకటించింది. అందరికీ వ్యాక్సిన్ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోవిడ్ నిబంధనలను వంద శాతం తప్పక పాటిస్తామని పీవీఆర్ ప్రకటించింది. అంతేకాదు తమ మల్టీప్లెక్సులలో పని చేసే సిబ్బంది అందరికీ కో\విడ్ వ్యాక్సిన్ అందించామని తెలిపింది. ప్రేక్షకులు ఎటువంటి సందేహాలు లేకుండా సినిమాలను ఎంజాయ్ చేయవచ్చని చెప్పండి వ్యాక్సిన్ ఆఫర్ మల్టీప్లెక్సుల ఓపెనింగ్ సందర్భంగా వ్యాక్సిన్ ఆఫర్‌ని ప్రకటిచింది పీవీఆర్ సినిమాస్. వ్యాక్సిన్ తీసుకుని పీవీఆర్ సినిమాస్‌కి వచ్చిన వారికి ఎంపిక చేసిన కంటెంట్ (సినిమా)పై ఒక టికెట్‌ను ఉచితంగా అందిస్తోంది. అంతేకాదు ఫుడ్ అండ్ బేవరేజెస్ సెక్షన్లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా అందిస్తామని తెలిపింది. ఈ ఆఫర్ మల్టీప్లెక్సులు ఓపెన్ చేసిన ఒక వారం పాటు అమల్లో ఉంటుందని తేల్చి చెప్పింది. అయితే ఎంపిక చేసిన కంటెంట్ ఏమిటనే దానిపై కచ్చితమైన వివరణ ఇవ్వలేదు. ఆయా మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే సినిమాలు, ఇతర కంటెంట్‌ను బట్టి ఇది మారే అవకాశం ఉంది. -
స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ కీలక సూచనలు
సాక్షి,న్యూఢిల్లీ: కరోనా విలయం,లాక్డౌన్ ఆంక్షలతో స్కూలు విద్య బాగా దెబ్బతింది. తాజాగా స్కూళ్ల ప్రారంభంపై ఐసీఎంఆర్ సెక్రటరీ డాక్టర్ బలరామ్ భార్గవ కీలక సూచనలు చేశారు. ముందు ప్రాథమిక పాఠశాలలను తెరిస్తే మంచిదని సూచించారు. ఎందుకంటే ఇన్ఫెక్షన్ను తట్టుకునే సామర్థ్యం చిన్నారులకు ఎక్కువగా ఉంటుందన్నారు. అలాగే టీచర్లందరికి వ్యాక్సినేషన్ పూర్తయితే స్కూళ్లు తెరవొచ్చని ఆయన పేర్కొన్నారు. సెకండరీ పాఠశాలలకంటే ముందు ప్రాధమిక పాఠశాలలను పునఃప్రారంభిస్తే మంచిదనే సంకేతాలను ప్రభుత్వం మంగళవారం అందించింది. అయితే దీనికంటే ముందు పాఠశాలల బస్సు డ్రైవర్లు, ఉపాధ్యాయులు, పాఠశాలలోని ఇతర సిబ్బందికి టీకాలు వేయడం అవసరమని ఐసీఎంఆర్ డీజీ భార్గవ అన్నారు. కాగా దేశంలో 2-18 ఏళ్ల లోపు వారికి కరోనా టీకా అందించే ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ కోవాక్సిన్ టీకా రెండు,మూడు దశల ట్రయల్స్ డేటా త్వరలోనే వెల్లడికానుందని, దీంతో సెప్టెంబర్ నాటికి టీకా లభించనుందనే అంచనాలను ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణదీప్ గులేరియా ఇటీవల చెప్పారు. డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదంతో పిల్లలకు ఈ టీకా అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. -
‘దుమ్ము’ దులపండి..!
సాక్షి, హైదరాబాద్: విద్యా సంస్థలు పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. గతేడాది మార్చి రెండో వారం నుంచి మూతబడ్డ విద్యా సంస్థలు... వచ్చేనెల ఒకటో తేదీ నుంచి తెరుచుకోనున్నాయి. సుదీర్ఘకాలం మూతబడి ఉండటంతో చెట్లు, పొదలు పెరిగాయి. తరగతి గదులు, బెంచీలు దుమ్ముపట్టాయి. అపరిశుభ్ర వాతావరణం నెలకొనడంతో స్వచ్ఛత కార్యక్రమాన్ని స్థానిక సంస్థలు చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. పాఠశాల/ కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్ వినతికి తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాలు, ఆశ్రమ పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఆదర్శ పాఠశాలలు, సంక్షేమ వసతిగృహాలన్నీ కలిపి 30 వేల వరకు ఉన్నాయి. ఇవన్నీ దాదాపు పది నెలలకు పైగా మూతబడి ఉన్నాయి. ఆన్లైన్ బోధన సాగుతున్న క్రమంలో విద్యా సంస్థలను తెరిచి ఉపాధ్యాయుల హాజరుకు అనుమతిచ్చినప్పటికీ పారిశుధ్యంపై స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో బోధన సిబ్బంది కూర్చునే హాల్, రెస్ట్రూమ్ వరకు శుభ్రం చేశారు. విద్యార్థుల తరగతి గదులు, ప్లేగ్రౌండ్ శానిటైజేషన్‌ను పట్టించుకోలేదు. చదవండి: పాతపంట.. కొత్త సంబురం 20లోగా క్లీన్ చేయాలి గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని విద్యా సంస్థల్లో పారిశుధ్య కార్యక్రమాలు ఈనెల 20వ తేదీలోగా పూర్తి చేయాలి. ఈమేరకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు, కళాశాల ప్రిన్సిపాళ్లు... సంబంధిత పం చాయతీ, మున్సిపాలిటీలకు లేఖలు సమర్పిస్తే వెంటనే సిబ్బంది వచ్చి విద్యా సంస్థల ప్రాంగణాలను శుభ్రం చేయాలి. బుష్ కటింగ్, పిచ్చిమొక్కల తొలగింపుతో పాటు నీటి సరఫరా వ్యవస్థ, మురుగునీటి పారుదల వ్యవస్థను పరిశీలిం చి ఆమేరకు మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. జిల్లా స్థాయి విద్యా పర్యవేక్షణ కమిటీ(డీఎల్ఈఎంసీ)లో సభ్యులుగా ఉన్న జిల్లా పంచాయ తీ అధికారి, మున్సిపల్ కమిషనర్లకు శానిటైజేషన్ పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించింది. ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలని సూచించింది. -
సంక్రాంతి సెలవుల తర్వాత స్కూల్స్ రీఓపెన్
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 18 నుంచి రాష్ట్రంలో పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. తొలుత 9వ తరగతి, ఆపై తరగతుల విద్యార్థులకు క్లాస్‌రూం విద్యాబోధన ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9, 10వ తరగతులతో పాటు ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించిన తరగతుల నిర్వహణకు పలు షరతులతో అనుమతించే అవకాశాలున్నాయి. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం ప్రగతిభవన్‌లో రాష్ట్ర మంత్రులు, జిల్లా కలెక్టర్లతో నిర్వహించనున్న ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో పాఠశాలలు, కళాశాలలను పునః ప్రారంభించే అంశంపై విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య ఆరోగ్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల ముఖ్యమైన అంశాలపై సైతం ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. ఏడు రాష్ట్రాల్లో ఇప్పటికే మొదలు... కోవిడ్–19 మహమ్మారి కారణంగా రాష్ట్రంలో ఇప్పటివరకు పాఠశాలలు, కళాశాలలు, ఉన్నత విద్యా సంస్థలను పునఃప్రారంభించలేదు. విద్యా సంవత్సరం ప్రారంభమై ఏడు నెలలు గడిచిపోయినా, ఇంకా ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభించకపోవడంతో లక్షలాది మంది విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారు. 3వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రస్తుతం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు. రాష్ట్రంతో సహా దేశవ్యాప్తంగా అన్ని రంగాల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా వ్యాప్తి సైతం అదుపులోకి వచ్చిందని రోజువారీ కేసుల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళతో సహా దేశంలోని ఏడు రాష్ట్రాలు ఇప్పటికే 9వ తరగతి, ఆపై విద్యార్థుల కోసం తరగతి గది బోధనలను ప్రారంభించాయి. రాష్ట్రంలో సైతం ఈ నెల 18 నుంచి 9వ తరగతి, ఆపై విద్యార్థులకు ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించడమే మంచిదని రాష్ట్ర విద్యా శాఖ... ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదనలు సమర్పించింది. ఈ మేరకు పాఠశాలలు, కళాశాలలను పునఃప్రారంభించడానికి సంసిద్ధంగా ఉన్నామని ప్రభుత్వా నికి తెలిపింది. సోమవారం నిర్వహించనున్న సమీక్షలో సీఎం కేసీఆర్ సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని విద్యాశాఖ అధికారులు ఆశావహ దృక్పథంతో ఉన్నారు. రోజూ తరగతులు నిర్వహించాలా? లేక రోజు విడిచి రోజు నిర్వహించాలా? షిఫ్టుల వారీగా విభజించాలా? అన్న అంశంపై ఈ సమావేశంలో లోతుగా చర్చించి ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. తరగతి గదులను పునఃప్రారంభించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తే... ప్రస్తుత ప్రత్యేక పరిస్థితులకు తగిన విధంగా ఈ విద్యా సంవత్సరానికి సంబంధించిన బోధన ప్రణాళికలను రూపొందించి ప్రకటించాలని రాష్ట్ర విద్యా శాఖ భావిస్తోంది. 1 నుంచి 8వ తరగతి విద్యార్థులకు మరి కొంతకాలం పాటు ఆన్లైన్ క్లాసులను కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తోంది. 9వ తరగతి, ఆపై విద్యార్థులకు క్లాసులు ప్రారంభించిన తర్వాత ఉత్పన్నమయ్యే పరిస్థితులను అంచనా వేయాలని, రాష్ట్రంలో పెద్దగా కరోనా పాజిటివ్ కేసులు పెరగకపోతే క్రమంగా మిగతా తరగతుల విద్యార్థులకు సైతం క్లాస్‌రూం బోధనను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూపై కలెక్టర్లకు దిశానిర్దేశం రెవెన్యూకు సంబంధించిన అంశాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ గత నెల 31న సమీక్ష నిర్వహించారు. రెవెన్యూకు సంబంధించి పరిష్కరించాల్సిన పలు అంశాలపై ఈ సమావేశంలో సీఎం జిల్లా కలెక్టర్లకు కీలక ఆదేశాలు జారీ చేశారు. సోమవారం జరిగే సమావేశంలో ఈ అంశాలను మళ్లీ కూలంకషంగా చర్చించనున్నారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యూనళ్ల ఏర్పాటు, పార్ట్–బీలో పెట్టిన భూముల పరిష్కారం తదితర అంశాలపై ఈ సమావేశంలో నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమస్యలను సత్వరం పరిష్కరించేందుకు కలెక్టర్లకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నివారణ చర్యలపై చర్చించనున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్షించనున్నారు. ప్రాధాన్యతా క్రమంలో పౌరులకు టీకా వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందించనున్నారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పురోగతిని సమీక్షించి తదుపరి విడత కార్యక్రమాల తేదీలను ప్రకటించే అవకాశముంది. హరితహారం ద్వారా గ్రామాలు, పట్టణాల్లో పచ్చదనం పెంచడానికి తీసుకుంటున్న చర్యలు, భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించనున్నారు. -
స్కూళ్లు తెరుద్దామా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలు, కళాశాలలు, ఇతర ఉన్నత విద్యాసంస్థల్లో తరగతులను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అం శంపై రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఓ నిర్ణయానికి రానుంది. ఏ తరగతి నుంచి క్లాసులు నిర్వహించాలి? ఏ విధంగా నిర్వ హించాలి? ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానం ఏమిటి? తదితర అంశాలపై ఈ నెల 11న సీఎం కేసీఆర్ మం త్రులు, అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రగతి భవన్లో నిర్వహించనున్న సమావేశంలో నిర్ణయం తీసుకో నున్నారు. రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్, వైద్య, ఆరో గ్యం, విద్య, అటవీ శాఖలతో పాటు ఇతర శాఖల అంశాలపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. రెవెన్యూ సమస్యలపై కార్యాచరణ సీఎం కేసీఆర్ గత నెల 31న సీనియర్ అధికారులు, కొందరు కలెక్టర్లతో సమా వేశమై రెవెన్యూ సమస్యల పరిష్కారానికి సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేశారు. 11న జరిగే భేటీలో రెవెన్యూకు సంబంధించిన అంశాలపై కూలంకషంగా చర్చిస్తారు. పెండింగ్ మ్యుటేషన్లు, సాదా బైనామాల క్రమబద్ధీకరణ, ట్రిబ్యునళ్ల ఏర్పాటు, పార్ట్–బీలో చేర్చిన భూ వివాదాలకు పరిష్కారం తదితర విషయాలపై సమావేశంలో చర్చిస్తారు. రెవెన్యూకు సంబంధించిన అన్ని అంశాలను సత్వరంగా పరిష్కరించేందుకు అవసరమైన కార్యాచరణను ఈ సమావేశంలో నిర్ణయిస్తారు. వ్యాక్సిన్‌పై కార్యాచరణ.. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న చర్యలతోపాటు టీకాను ప్రజలకు అందించేందుకు సిద్ధం చేయనున్న కార్యాచరణపై సీఎం ఈ భేటీలో చర్చిస్తారు. అన్ని ప్రాంతాలకు వ్యాక్సిన్ సరఫరా, ప్రాధాన్యతా క్రమంలో టీకాను పౌరులకు వేయడానికి సంబంధించిన కార్యాచరణను రూపొందిస్తారు. పల్లె, పట్టణ ప్రగతిపై.. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల అమలును ఈ సమావేశంలో సీఎం కేసీఆర్ సమీక్షిస్తారు. గ్రామాలు, పట్టణాలకు నిధులు సకాలంలో అందుతున్నాయా వాటి వినియోగం ఎలా ఉంది తదితర అంశాలపై చర్చిస్తారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల్లో భాగంగా చేపట్టిన పనుల పరోగతిని సమీక్షిస్తారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచేందుకు చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమం అమలును సమీక్షిస్తారు. వాస్తవానికి ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టర్లతో సమావేశాన్ని శనివారం నిర్వహించాలని ముందుగా నిర్ణయించినా స్వల్ప అనారోగ్యం కారణంగా ఈ సమావేశాన్ని సోమవారానికి వాయిదా వేసినట్లు సమాచారం. -
మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు
సాక్షి, తాడేపల్లి : రాష్ట్ర వ్యాప్తంగా నేడు(సోమవారం) పాఠశాలలు పునఃప్రారంభం అయ్యాయని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సరేష్ పేర్కొన్నారు. విద్యార్థులు చాలా ఉత్సాహంగా పాఠశాలలు, కళాశాలలకు వస్తున్నారన్నారు. ఈ మేరకు సోమవారం సాక్షి టీవీతో మంత్రి మాట్లాడారు. మొదటి రోజు దాదాపు 80 శాతం హాజరు ఉన్నట్లు వెల్లడించారు. ఇప్పటికే చాలా పాఠశాలలు ‘నాడు-నేడు’ కార్యక్రమం కింద అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు జగనన్న విద్య కానుక ఇచ్చామని, అన్ని వసతులు వారికి అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. తల్లిదండ్రులు, విద్యార్థుల్లో కోవిడ్ పట్ల అవగాహన కల్పించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. చదవండి: ఏపీలో నేటి నుంచి స్కూళ్లు, కాలేజీలు కోవిడ్ నేపథ్యంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకున్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలు 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని అదేశించాం. ఇది న్యాయమైన నిర్ణయం. దాదాపు అయిదారు నెలలు స్కూల్స్ నడవలేదు. అలాంటప్పుడు పూర్తి ఫీజు ఎలా వసూలు చేస్తారు?. వాళ్ళకి టీచర్లు, సిబ్బంది జీతాలు ఉంటాయి కాబట్టి అన్ని ఆలోచించి 70 శాతం ఫీజు నిర్ణయించాం. ఏ ఒక్కరూ అంతకు మించి వసూలు చేయవద్దు. అలా చేస్తున్నట్లు పిర్యాదు వస్తే చర్యలు తప్పవు. ప్రైవేట్ స్కూల్స్, కాలేజీల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరిగా ఉండాలి. ఆయా సంస్థల్లో వసతులపై ఆకస్మిక తనికీలు చేస్తున్నాం’. అని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. చదవండి: ప్రభుత్వానికి మా మద్దతు ఉంటుంది: ఏపీ జేఎంసీ -
నవంబర్ 2 నుంచి కళాశాలలు పునఃప్రారంభం
సాక్షి, విజయవాడ: కళాశాలలు నవంబర్ 2 నుంచి ప్రారంభమవుతాయని ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ హేమచంద్రారెడ్డి తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీనియర్ విద్యార్థులకి మాత్రమే ప్రస్తుతం తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ప్రతీ విద్యార్థికి నెలలో పది రోజులు తరగతులు నిర్వహిస్తామన్నారు. మూడవ వంతు విద్యార్థులనే అనుమతిస్తామని వెల్లడించారు. ఆన్లైన్ క్లాసులు కొనసాగుతాయన్నారు. (చదవండి: ప్రైవేటు పాఠశాలలకు గట్టి షాక్..) ‘‘రెండు సెమిస్టర్లగా అకడమిక్ క్యాలెండర్ రూపొందించాం. మార్చి నెలకి మొదటి సెమిస్టర్.. ఆగస్ట్ నాటికి రెండవ సెమిస్టర్ పూర్తి చేస్తాం. అకడమిక్ క్యాలెండర్‌ని 180 రోజులుగా రూపొందించాం. ఈసెట్ అడ్మిషన్లు నవంబర్ 11 లోపు పూర్తి చేస్తాం. డిగ్రీ ఆన్లైన్ అడ్మిషన్లు, ఇంజనీరింగ్ అడ్మిషన్లని నవంబర్ నెలాఖరుకి పూర్తి చేసి డిసెంబర్ ఒకటి తరగతులు ప్రారంభిస్తాం. కరోనా నేపథ్యంలో అన్ని జాగ్రత్తలతో తరగతులు నిర్వహిస్తాం. కళాశాలకి వచ్చే ప్రతీ విద్యార్ధి తప్పనిసరిగా మాస్క్ ధరించాలి. కళాశాలకి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని’’ ఆయన పేర్కొన్నారు. (చదవండి: గ్రూప్–1 మెయిన్స్‌కు 9,678 మంది) -
2 నుంచి స్కూల్స్.. షెడ్యూల్ ఇదే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వచ్చే నెల 2 నుంచి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకోనున్నాయి. పాఠశాలల్లో మూడు దశల్లో రోజు విడిచి రోజు తరగతులను నడపనున్నారు. కోవిడ్ వ్యాపించకుండా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని తరగతుల పునఃప్రారంభానికి సంబంధించిన షెడ్యూల్‌ను గురువారం విడుదల చేశారు. దీని ప్రకారం.. నవంబర్ 2 నుంచి 9, 10, 11/ఇంటర్ మొదటి సంవత్సరం, 12/ఇంటర్ రెండో సంవత్సరం తరగతులు రోజు విడిచి రోజు.. హాఫ్‌డే మాత్రమే నిర్వహిస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన అన్ని కాలేజీలకూ కూడా నవంబర్ 2నే తరగతులు ప్రారంభిస్తారు. రొటేషన్ పద్ధతిలో తరగతులు ఉంటాయి. నవంబర్ 23 నుంచి 6, 7, 8 తరగతులకు బోధన మొదలవుతుంది. డిసెంబర్ 14 నుంచి 1, 2, 3, 4, 5 తరగతులను ప్రారంభిస్తారు. 1 నుంచి 8వ తరగతి వరకు కూడా రోజు విడిచి రోజు, హాఫ్‌డే మాత్రమే క్లాసులు నిర్వహిస్తారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు ఇదే షెడ్యూల్ వర్తిస్తుంది. చదవండి: రూ.17,300 కోట్లతో వైద్య రంగానికి చికిత్స -
విజయవాడలో బాపు మ్యూజియం పునఃప్రారంభం
-
ఏపీలో నవంబర్ 2వరకు స్కూళ్ల ప్రారంభం వాయిదా
-
హెరిటేజ్ సిటీ హోదా రావాలి
గన్‌ఫౌండ్రీ: హైదరాబాద్ నగరాన్ని యునెస్కో హెరిటేజ్ సిటీగా గుర్తించడానికి తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. పునరుద్ధరించిన ఎంజే మార్కెట్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పురాతన కట్టడాలకు పూర్వ వైభవం తేవాల్సిన అవసరం ఎంతో ఉందని, కట్టడాలను కాపాడుకోవాల్సిన బాధ్యత నగర పౌరులపై ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నో సుందర చారిత్రక కట్టడాలకు హైదరాబాద్ నగరం నిలయమని, వారసత్వ సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల ఎత్తులో జాతీయ పతాకం ఏర్పాటు చేశామని, ఈ జెండా ఈ ప్రాంతానికి కొత్త శోభను తెస్తుందని చెప్పారు. సీఎం కేసీఆర్ చదువుకునే రోజుల్లో ఎంజే మార్కెట్ పరిసరాల్లోని మయూరా హోటల్ ప్రాంతంలో చాలా ఏళ్లు ఉన్నారని, తాను కూడా చదువుకునే రోజుల్లో ఫేమస్ ఐస్‌క్రీమ్ కోసం ఎంజే మార్కెట్‌కు వస్తుండేవాడినని నాటి రోజులను గుర్తు చేసుకున్నారు. రూ.15 కోట్ల వ్యయంతో ఎంజే మార్కెట్‌కు పూర్వ వైభవం కల్పించినట్లు కేటీఆర్ పేర్కొన్నారు. అలాగే రూ.1,000 కోట్లతో యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని పున రుద్ధరిస్తున్నట్లు వెల్లడించారు. రెండేళ్లలోనే ఎంజే మార్కెట్‌ను పునరుద్ధరించిన మున్సిపల్ శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్‌ను అభినందించారు. ఎంజేమార్కెట్‌పై రూపొందించిన సావనీర్‌ను ఆవిష్కరించారు. దీంతోపాటు ఎంజే మార్కెట్‌కు పున ర్వైభవం కల్పించడంలో విశిష్ట సేవలందించిన 16 మందికి మెమెంటోలను అందించారు. కార్యక్రమంలో మంత్రులు మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, కేకే, జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా జాతీయ పతాకం ఎంజే మార్కెట్‌పై 100 అడుగుల భారీ ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ పతాకం ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. పర్యాటకులను ఆకర్షించేందుకు మార్కెట్ చుట్టూ రంగురంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో పాటు లోపల పలు నూతన నిర్మాణాలను చేపట్టారు. -
సురక్షిత బడిబాట
ఇప్పుడు నెలకొన్న పరిస్థితులు అసాధారణమైనవి. ప్రభుత్వాలు అన్ని రంగాల్లో పెను సవాళ్లు ఎదుర్కొనవలసి వస్తోంది. ప్రజారోగ్య, సామాజిక, ఆర్థిక రంగాల సమస్యలతోపాటు పాఠశాల విద్యను మళ్లీ పట్టాలెక్కించడం కూడా సమస్యే. కరోనా వైరస్ మహమ్మారి సృష్టించిన సంక్షోభం నుంచి తెరిపినపడటానికి చేసే ప్రయత్నాలను పరిహసిస్తూ కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఈ వైరస్ నియంత్రణలోకొచ్చాక తిరిగి ప్రారంభం కావాల్సిన కార్యకలాపాల్లో చదువులు అన్నిటి కన్నా ముఖ్యమైనవి. దాన్ని దృష్టిలో పెట్టుకునే పాఠశాలలు తిరిగి తెరవడంపైనా... ఈ విషయంలో తీసుకోవాల్సిన ముందుజాగ్రత్తలపైనా సలహాలు, సూచనలు ఇవ్వాలని ఈ నెల 15న కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఎవరు ఏ తేదీకి బడులు తెరవడానికి సంసిద్ధంగా ఉన్నారో చెప్పాలని సూచించింది. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఈ విషయంలో ఎటూ చెప్పలేకపోయాయం టేనే వర్తమానంలో వైరస్ తీవ్రత ఎంత వుందో అర్థమవుతుంది. ఒక్క అస్సాం మాత్రం ఈ నెలా ఖరున పాఠశాలలు తిరిగి తెరిస్తే బాగుంటుందని చెప్పగా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, మణిపూర్, నాగాలాండ్, రాజస్తాన్, అరుణచల్ ప్రదేశ్, ఒడిశా, లదాఖ్‌లు సెప్టెంబర్ నెలలో ప్రారంభించడం ఉత్తమమని అభిప్రాయపడ్డాయి. ఢిల్లీ, హరియాణ, బిహార్, చండీగఢ్ ఆగస్టులో పాఠశాలలు తెరిస్తే బాగుంటుందని సూచించాయి. తెలంగాణ, ఉత్తరాఖండ్, పశ్చిమబెంగాల్ తదితర 21 ప్రభుత్వాలు నిర్దిష్టంగా చెప్పలేకపోయాయి. పాఠశాలలన్నీ నాలుగు నెలలుగా నిరవధికంగా మూతబడి వుండటం వల్ల దేశవ్యాప్తంగా 25 కోట్లమంది పిల్లలు చదువులకు దూరమయ్యారు. కొన్ని రాష్ట్రాలు ఏదో ఒక మేర దూరవిద్య విధానాన్ని అమలు చేయడం మొదలుపెట్టాయి. కానీ దాని ద్వారా లబ్ధి పొందుతున్న పిల్లల శాతం తక్కువే. ఇంటర్నెట్ సదుపాయం అంతంతమాత్రంగా వుండటం, అలాంటి సదుపాయం వున్నా ఖరీదైన ఉపకరణాలను కొనుక్కునే స్తోమత చాలామంది పిల్లలకు లేకపోవడం పర్యవసానంగా ఆన్లైన్ చదువులు నామమాత్రంగానే సాగుతున్నాయి. ఒక తరం చదువులకు దూరమైతే పిల్లలకు మాత్రమే కాదు... సమాజానికి కూడా ఎంతో నష్టం వాటిల్లుతుంది. దాన్నుంచి కోలుకోవడం కష్టమవుతుంది. అలాగని వైరస్ మహమ్మారి శాంతించకుండా చదువులు మొదలుపెడితే పర్యవసానాలు తీవ్రంగా వుండే ప్రమాదముంటుంది. ఇప్పుడున్న స్థితిలో పిల్లలు ముప్పు బారిన పడకుండా చూడటం అతి ముఖ్యం. రాష్ట్ర ప్రభుత్వాల సిలబస్‌లు చాలావరకూ బోధనకు పరిమితమై ఉంటాయి. తరగతి గదిలోని పిల్లలకు టీచర్ వచ్చి బోధించడం, పాఠ్యాంశాలపై అవగాహన కలి గించడం, వారి సందేహాలు తీర్చడం వగైరాలు అందులోవుంటాయి. ఐబీ, ఐజీసీఎస్ఈ వంటివి ఇందుకు భిన్నం. అందులో పిల్లలు ఒకరితో ఒకరు సంభాషించుకోవడం, చర్చించుకోవడం ఒక భాగం. విద్యార్థులు బృందాలుగా ఏర్పడి తమకిచ్చిన సమస్యల్ని పరిష్కరించడానికి లేదా ప్రాజెక్టుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. టీచర్ల సాయం తీసుకుంటారు. ఇక ఆటపాటలు సరేసరి. ఇప్పు డున్న పరిస్థితుల్లో ఇవన్నీ సాధ్యమవుతాయా? విద్యార్థుల మధ్య ఆరేసి అడుగుల దూరం వుండేలా చూడటం, వారు చెట్టపట్టాలు వేసుకోకుండా చూడటం తప్పనిసరి. పిల్లలు భౌతికదూరం పాటిం చేలా చూడటం, ఇతరత్రా జాగ్రత్తలు తీసుకోవడం ఎలా? వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా విశా లమైన తరగతి గదుల నిర్మాణం ఎలా? తరగతి గదికి వచ్చాక కాదు... బస్సులోనో, మరో వాహనం లోనో బడికి వస్తున్నప్పుడూ, తిరిగి ఇళ్లకు వెళ్తున్నప్పుడు వారితో పాటింపజేయాల్సినవేమిటి? అనారోగ్యం బారిన పడిన పిల్లలు బడికి రాకుండా తల్లిదండ్రులు ఏదోమేరకు జాగ్రత్తలు తీసుకుంటా రనుకున్నా, ఆ పిల్లలు బడికి వచ్చాక సమస్య బయటపడిన పక్షంలో ఎలాంటి జాగ్రత్తలు తీసు కోవాలి? వారిని మళ్లీ సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించడం, ఆ పిల్లలకు సకాలంలో వైద్యం అందేలా చూడటం ముఖ్యం గనుక అందుకు అదనపు ఏర్పాట్లు చేయాల్సి వస్తుంది. ఈ ఏర్పాట్ల కోసం ఎన్నో వ్యయప్రయాసలు తప్పవు. అవసరమైన మానవ వనరులు అందుబాటులోకి తీసుకు రావాల్సివుంటుంది. ఇప్పుడు దాదాపు అన్ని రాష్ట్రాల్లో పిల్లలకు మధ్యాహ్న భోజన సదుపాయం వుంటోంది. ఆ సదుపాయాన్ని కొనసాగించడంలో పాటించాల్సిన జాగ్రత్తలేమిటో చూసుకోవాలి. అలాగే కొత్తగా కేసులు బయటపడినచోట పాఠశాలలు మూతబడక తప్పదు. అప్పుడు ఇతర పాఠ శాల విద్యార్థులతోపాటు వారు కూడా చదువుల్లో ముందుండటానికి ఏం చేయాలో ఆలోచించాలి. ఈ కష్టకాలంలో పిల్లల్లో సహజంగానే భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. తమ ఇంట్లోనో, తమ పొరుగునో సమస్యల్లో చిక్కుకున్నవారి గురించి విని భయాందోళనలతో వుంటారు. దానికి తోడు మునుపటిలా కదలికలుండవు గనుక ఒక రకమైన అసౌకర్యానికి గురవుతారు. తోటి పిల్లల్లో ఎవరికైనా అనారోగ్యం వస్తే ఇవన్నీ మరింతగా పెరుగుతాయి. కనుక సిలబస్ పూర్తి చేయాలన్న తొందరలో టీచర్లు ఒత్తిళ్లు తీసుకురాకూడదు. అసలు బోధనావిధానమే సంపూర్ణంగా మార్చు కోవాల్సి ఉంటుంది. బడులు తెరవడం అంటే వీటన్నిటి విషయంలో సర్వసన్నద్ధంగా వుండటం. చాలా రాష్ట్రాల్లో దశాబ్దాలుగా ప్రభుత్వాలు బడుల్ని నిరాదరిస్తూ వస్తున్నాయి. మెజారిటీ పాఠశాలల్లో మిగిలిన సదుపాయాల మాట అటుంచి సురక్షితమైన తాగునీరు లభ్యత కూడా లేదు. ఈ కరోనా కష్టకాలంలో కూడా అవే పరిస్థితులు కొనసాగితే విద్యార్థులను ముప్పు బారిన పడేసినట్టే. ఇప్పుడే ర్పడిన ఈ అసాధారణ పరిస్థితులకు అనుగుణంగా పాత విధానాలన్నీ సవరించుకోవడం, ప్రభావ వంతంగా బోధించి పిల్లలు విద్యాపరంగా వెనకబడకుండా చూడటం, అవసరమైన సదుపాయాలు అందుబాటులో వుంచడం పాఠశాలల ముందున్న పెను సవాలు. ఆ సవాలును ఎదుర్కొనగలిగే సత్తా ఉన్నప్పుడే పిల్లల్ని రేపటి పౌరులుగా తీర్చిదిద్దడం సాధ్యం. -
తిరిగి తెరుచుకోనున్న ఐకియా స్టోర్
సాక్షి, హైదరాబాద్: కరోనాతో మూతపడిన ఐకియా స్టోర్ సోమవారం నుంచి తిరిగి తెరుచుకోనుంది. భౌతిక దూరం పాటించడంతో పాటు సందర్శకుల సంఖ్యను పరిమితం చేయడం ద్వారా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు స్టోర్ మేనేజర్ అరెలీ రెయిమన్ వెల్లడించారు. తమ వినియోగదారులకు ఇబ్బంది కలగకుండా శరీర ఉష్ణోగ్రతను పరీక్షించడం, ఫేస్ మాస్క్‌లు తప్పనిసరి చేయడం, శానిటైజర్ యంత్రాల వంటి ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. సంస్థ ఉద్యోగులు, కస్టమర్ల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పారు. -
అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు