ఇక చదువుల సీజన్‌ | Re opening of schools from 12th | Sakshi
Sakshi News home page

ఇక చదువుల సీజన్‌

Published Thu, Jun 6 2024 5:14 AM | Last Updated on Thu, Jun 6 2024 5:14 AM

Re opening of schools from 12th

జోరందుకున్న ఇంటర్‌ అడ్మిషన్లు 

డిగ్రీ ప్రవేశాలు... ఇంజనీరింగ్‌ హడావుడి 

12 నుంచి స్కూల్స్‌ రీ ఓపెనింగ్‌ 

టీచర్ల బదిలీలు, పదోన్నతులు మొదలు 

వర్శిటీల వీసీల నియామకంపై దృష్టి 

త్వరలో సెర్చ్‌ కమిటీ పరిశీలన 

ప్రైవేటు కాలేజీల్లో మొదలైన పాఠాలు

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల హడావుడి ముగియ డంపై విద్యా రంగంపై అధికారులు దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు రీ ఓపెనింగ్‌ అవుతున్నాయి. స్కూళ్లల్లో మౌలిక సమస్యల పరిష్కారం వైపు అడుగులు వేయాలని జిల్లా అధికారులకు ఆదేశాలు వెళ్ళాయి. 

ఇక ఇంట ర్‌ బోర్డ్‌ ప్రవేశాల మొదలు, ఉన్నత విద్యా మండలి కార్యక్రమాలు, యూనివర్శిటీల ప్రక్షాళన వరకు అన్ని అంశాలపై దృష్టి పెట్టబోతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రతీ అంశంపై ఇటీవల ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించారు. ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. 

7 నుంచి బదిలీలు, పదోన్నతులు 
ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. పార్లమెంట్‌ ఎన్నికల ముందు దీన్ని చేపట్టాలని భావించినా ఎన్నికల కోడ్‌ రావడంతో ప్రక్రియ నిలిచిపోయింది. గత ఏడాది కొంతమంది టీచర్లను బదిలీ చేశారు. కానీ ఇప్పటి వరకూ రిలీవ్‌ చేయలేదు. దాదాపు 50 వేల మంది టీచర్లు బదిలీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. 

మరోవైపు 10 వేల మంది టీచర్ల వరకూ పదోన్నతులు పొందాల్సి ఉంది. ఎస్‌జీటీ నుంచి స్కూల్‌ అసిస్టెంట్, ఎస్‌ఏ నుంచి హెచ్‌ఎం వరకూ ప్రమోషన్లు ఇవ్వడానికి సీనియారిటీ జాబితా కూడా రూపొందించారు. ఎన్నికల కోడ్‌ ముగియడంతో ఈ నెల 7వ తేదీ  నుంచి ఈ ప్రక్రియ చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. 

ఊపందుకుంటున్న అడ్మిషన్లు 
ఇంటర్‌ అడ్మిషన్లకు అనుగుణంగా ఇంటర్‌ కాలేజీలకు బోర్డ్‌ అనుబంధ గుర్తింపు ఇప్పటికే చాలావరకు పూర్తి చేసింది. ఇంకా 600 ప్రైవేటు కాలేజీలకు ఇవ్వాల్సి ఉంది. ఈ నెలాఖరు కల్లా అన్ని డాక్యుమెంట్లు ఇవ్వాలని అధికారులు ఆదేశించారు. మరోవైపు ప్రైవేటు కాలేజీల్లో పెద్ద ఎత్తున అడ్మిషన్లు జరుగుతున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ ప్రవేశాలు ఊపందుకున్నాయి. 

గత ఏడాది 80 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ కాలేజీల్లో చేరారు. ఈ సంవత్సరం మరికొంత మంది చేరే వీలుంది. టెన్త్‌ ఉత్తీర్ణులకు అవసరమైన డిప్లొమా కోర్సుల కౌన్సెలింగ్‌ ప్రక్రియను జూన్‌ నుంచి మొదలు పెట్టే వీలుంది. డిగ్రీ ప్రవేశాలను వేగంగా చేపడుతున్నారు. తొలి దశ సీట్ల కేటాయింపు ఈ నెల 6వ తేదీన జరుగుతుంది. డిగ్రీలో ఏటా 2.20 లక్షల మంది చేరుతున్నారు.  

ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌కూ చురుకుగా ఏర్పాట్లు 
ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఇప్పటికే ప్రకటించారు. ఈ నెలాఖరు నుంచి ఆన్‌లైన్‌ దర ఖాస్తు లు ప్రక్రియ మొదలుపెడతారు. రాష్ట్రంలో 1.06 లక్ష ల ఇంజనీరింగ్‌ సీట్లున్నాయి. ఇందులో 80 వేల వర కూ కనీ్వనర్‌ కోటాలో భర్తీ చేస్తారు. ఈ ప్రక్రియ జూ లై నెలాఖరుకు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో అవసరమై న అన్ని ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఉన్నారు.

వీసీల నియామకాలపై దృష్టి
రాష్ట్రంలోని పది విశ్వవిద్యాలయాల్లో కొత్త వైస్‌ ఛాన్సలర్ల నియామకం కోసం చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెద్ద ఎత్తున వచి్చన దరఖాస్తుల పరిశీలనకు ప్రభు త్వం సెర్చ్‌ కమిటీలను కూడా నియమించింది. మే నెలాఖరుతో వీసీల పదవీ కాలం ముగిసింది. వీరి స్థానంలో ఐఏఎస్‌లను ఇన్‌ఛార్జిలుగా నియమించారు. 

ఎన్నికల కోడ్‌ అడ్డంకిగా ఉండటంతో వీసీల నియామకం ఇంత కాలం చేపట్టలేదు. సెర్చ్‌ కమిటీ భేటీ అయిన, ఒక్కో వర్శిటీ కి ముగ్గురు చొప్పున ఎంపిక చేసి ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. ఇందులో ఒకరిని వీసీగా నియమిస్తారు. ఈ ప్రక్రియ మరో పది రోజుల్లో జరగొచ్చని అధికారులు చెబుతున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement