Meet IKEA India First Woman CEO Susanne Pulverer, Know Her Details - Sakshi
Sakshi News home page

IKEA India CEO: ఐకియా ఇండియాకి కొత్త చీఫ్‌.. తొలిసారి మహిళకు అవకాశం

Published Thu, Feb 24 2022 11:55 AM | Last Updated on Thu, Feb 24 2022 1:14 PM

IKEA Appointed Susanne Pulverer As First Woman CEO For IKEA India - Sakshi

ప్రపంచంలోనే అతి పెద్ద ఫర్నీచర్‌ అమ్మకాల సంస్థ ఐకియా కీలక నిర్ణయం తీసుకుంది. ఐకియా ఇండియాకి కొత్త చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌గా సుసాన్నే పుల్‌వీరర్‌ను నియమిస్తున​​​​‍్నట్టు ప్రకటించింది. సీఈవో పోస్టులో ఓ మహిలను ఐకియా నియమించడం ఇదే తొలిసారి. ప్రస్తుత సీఈవోగా ఉన్న పీటర్‌ బెడ్‌జెట్‌ స్థానంలో ఆమె పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. 

స్వీడన్‌కి చెందిన ఈ సంస్థ భారత్‌లో మార్కెట్‌ విస్తరణపై ఎక్కువగా ఫోకస్‌ చేస్తోంది. ఐకియా సంస్థ ఇండియాలో తమ తొలి స్టోర్‌ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేసింది. ఆ తర్వాత మిగిలిన నగరాల్లోకి విస్తరించింది. తాజాగా మెగా స్టోర్లకు బదులు మినీ స్టోర్లు కూడా ఏర్పాటు చేయాలి ఐకియా నిర్ణయించింది. ఈ తరుణంలో ఇండియాకి కొత్త సీఈవోగా సుసాన్నే పుల్‌వీరర్‌ను నియమించింది.  1997లో ఐకియాలో చేరిన సుసాన్నే అంచెలంచెలుగా ఎదుగుతూ ఐకియా ఇండియా సీఈవో స్థాయికి చేరుకున్నారు. 
 

చదవండి: కొత్తగా సిటీ స్టోర్లు.. ప్రైస్‌వార్‌కి రెడీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement