సాక్షి,ముంబై: ఈ-కామర్స్ మేజర్ ఫ్లిప్‌కార్ట్ ఈ క్వార్టర్‌లో భారీగా నష్టపోయింది. అయితే ఈ పండుగ సీజన్‌లో భారతదేశంలో మొత్తం విక్రయాలలో అగ్రగామిగా ఉన్న కారణంగా ఆదాయం బాగా పుంజుకుందని మార్కెట్ రీసెర్చ్ సంస్థ రెడ్‌సీర్ తెలిపింది. క్యూ2లో ఫ్లిప్‌కార్ట్ నికర ఆదాయం దాదాపు 20 శాతం పెరిగింది. ఆదాయం పుంజుకుని రూ. 61,836 కోట్లుగా ఉంది. (ElonMusk సంచలన ప్రకటన: ఎడ్వర్టైజర్లకు బూస్ట్?)
ఫ్లిప్‌కార్ట్ ఇండియా రెగ్యులేటరీ ఫైలింగ్‌ల ప్రకారం, 2021-22 ఆర్థిక సంవత్సరంలో దాని బిజినెస్-టు-బిజినెస్ యూనిట్ ఫ్లిప్‌కార్ట్ ఇండియా, బిజినెస్-టు-కన్స్యూమర్ ఇ-కామర్స్ యూనిట్ మొత్తం నష్టాలు రూ.7,800 కోట్లకు చేరాయి. ఇందులో మింత్రా, ఇన్‌స్టాకార్ట్ మొదలైన ఫిప్‌కార్ట్ గ్రూప్ సంస్థల ఫలితాలు కూడా ఉన్నాయి.
కాగా రెండు సంస్థల ఉమ్మడి నష్టం గత ఏడాది(2020-21) రూ. 5,352 కోట్లుగా ఉంది. 2020-21లో ఫ్లిప్‌కార్ట్ ఆదాయం రూ. రూ. 51,465 కోట్లు. ఫ్లిప్‌కార్ట్ ఇండియా రూ. 43,349 కోట్లు, ఫ్లిప్‌కార్ట్ ఇంటర్నెట్ సహకారంతో రూ. 8,116 కోట్లుగా ఉంది. సెప్టెంబరు చివరి వారంలో జరిగిన ఫస్ట్ వీక్ పండుగ సీజన్ విక్రయాల్లో ఫ్లిప్‌కార్ట్ 62 శాతం లేదా 24,800 కోట్ల విలువైన అమ్మకాలను సాధించింది. మొత్తం అమ్మకాల విలువ రూ. 40,000 కోట్లుగా ఉంది.
ఇదీ చదవండి: నోకియా జీ60 5జీ సేల్స్ షురూ, ధర ఎంతంటే?
Comments
Please login to add a commentAdd a comment