ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో సాధించిన ప్రోత్సాహకర ఫలితాలు ఐటీ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా కౌంటర్‌కు డిమాండ్‌ను పెంచాయి. మరోపక్క రైట్స్ ఇష్యూ ప్రారంభమైన నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీ ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్ కౌంటర్ సైతం వెలుగులో నిలుస్తోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఆసక్తి చూపడంతో ఈ రెండు కౌంటర్లూ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
టెక్ మహీంద్రా లిమిటెడ్
సాఫ్ట్‌వేర్ సేవల దిగ్గజం టెక్ మహీంద్రా ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 21 శాతం అధికంగా రూ. 972 కోట్ల నికర లాభం ఆర్జించింది. ఈ బాటలో త్రైమాసిక ప్రాతిపదికన పన్నుకు ముందు లాభం 33 శాతం వృద్ధి చూపి రూ. 1283 కోట్లను తాకింది. నిర్వహణ లాభ మార్జిన్లు స్వల్పంగా బలపడి 14.3 శాతానికి చేరాయి. ఈ నేపథ్యంలో టెక్ మహీంద్రా షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో 6 శాతం జంప్‌చేసి రూ. 703కు చేరింది. ప్రస్తుతం 3 శాతం లాభంతో రూ. 685 వద్ద ట్రేడవుతోంది. తొలి అర్ధగంటలోనే ఈ కౌంటర్లో 11.3 మిలియన్ షేర్లు ఎన్‌ఎస్‌ఈ, బీఎస్‌ఈలలో చేతులు మారడం గమనార్హం!
ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ సర్వీసెస్
రూ. 3089 కోట్ల సమీకరణకు నేటి నుంచి రైట్స్ ఇష్యూ చేపట్టిన నేపథ్యంలో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్ షేరు జోరందుకుంది. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో 5 శాతం జంప్‌చేసి రూ. 135 వద్ద ట్రేడవుతోంది. రైట్స్‌లో భాగంగా రూ. 2 ముఖ విలువగల 61.78 కోట్ల ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. వాటాదారుల వద్ద గల ప్రతీ 1 షేరుకీ మరొక షేరుని కేటాయించనుంది. ఆగస్ట్ 11న ముగియనున్న రైట్స్ ఇష్యూకి రూ. 50 ధరను నిర్ణయించిన విషయం విదితమే.
Comments
Please login to add a commentAdd a comment