రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇటీవల జారీ చేసిన రూ.53వేల కోట్ల రైట్స్ ఇష్యూలో భాగంగా కంపెనీ అధిపతి ముకేశ్ అంబానీ 5.52లక్షల ఈక్విటీ షేర్లను సొంతం చేసున్నారు. కంపెనీ రెగ్యూలేటరీ ఇచ్చిన సమాచారం ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ షేర్ల కొనుగోలుతో ముకేష్ అంబానీకి వ్యక్తిగతంగా రిలయన్స్‌లో మొత్తం ఈక్విటీ షేర్ల సంఖ్య 80.52లక్షలకు చేరుకుంది. రైట్స్ ఇష్యూకు ముందు 75 లక్షల ఈక్విటీ షేర్లను కలిగి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇష్యూలో ముకేశ్ భార్య నీతూ అంబానీ, పిల్లలు ఇషా, ఆకాశ్, అనంత్‌లు సైతం ఒక్కొక్కరు 5.52లక్షల ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు.
- ఇదే రైట్స్ ఇష్యూలో ప్రమోటర్స్ గ్రూప్ 22.50కోట్ల ఈక్విటీ షేర్లను దక్కించుకుంది. తద్వారా షేర్‌హోల్డింగ్ వాటా 50.07శాతం నుంచి 50.29శాతానికి పెంచుకుంది. మరోవైపు పబ్లిక్ హోర్‌హోల్డింగ్ వాటా 49.93శాతం నుంచి 49.71శాతానికి దిగివచ్చింది.
- ఎల్‌ఐసీ 2.47 కోట్ల ఈక్విటీ షేర్లను సబ్‌స్క్రైబ్ చేసుకుంది. ఈ కొనుగోలుతో ఎల్‌ఐసీ వద్ద మొత్తం ఈక్విటీ షేర్లు 37.18 కోట్లకు చేరుకున్నాయి. తద్వారా రిలయన్స్‌లో ఎల్‌ఐసీ షేర్‌హోల్డింగ్ వాటా 6శాతానికి చేరుకుంది.
- కొత్త పబ్లిక్ షేర్‌హోల్డర్లు 19.74 కోట్ల ఈక్వటీ షేర్లను దక్కించుకున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ రూ.53,124 కోట్లు సమీకరణ లక్ష్యంతో రైట్స్ ఇష్యూ ద్వారా 42.26 షేర్లను విక్రయానికి పెట్టింది. ప్రతిషేరు ధరను రూ.1,257 నిర్ణయించింది. రైట్స్ ఇష్యూకు ఇన్వెస్టర్స్ నుంచి భారీ స్పందన వచ్చింది. గతవారం జూన్ 3న రైట్స్ ముగిసింది. ఈ ఇష్యూకు 1.59 రెట్లు సబ్ స్క్రిప్షన్ లభించింది. ఈ దెబ్బకు ఆర్ఐఎల్ ఏకంగా రూ.84 వేల కోట్లను సమకూర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment