రిలయన్స్ ఇండస్ట్రీస్ వార్షిక దీపావళి విందులో 'రతన్ టాటా'కు ముఖేష్ అంబానీ ఫ్యామిలీ, వేలాది మంది ఉద్యోగులు నివాళులర్పించారు. నీతా అంబానీ 'గ్రేట్ సన్ ఆఫ్ ఇండియా' అని రతన్ టాటాను కొనియాడారు. దూరదృష్టి కలిగిన పారిశ్రామికవేత్త, పరోపకారి, ఎల్లప్పుడూ సమాజ శ్రేయస్సు కోసం ఆలోచించే వ్యక్తి అని అన్నారు.
దివంగత పారిశ్రామికవేత్త రతన్ టాటా.. మా మామయ్య ధీరూభాయ్ అంబానీకి, నా భర్త ముకేశ్ అంబానీకి, మా కుటుంబానికి మంచి స్నేహితులు. ఆకాష్ అంబానీకి మార్గదర్శి అని నీతా అంబానీ అన్నారు. మహనీయుడు రతన్ టాటాకు నివాళిగా అందరూ మౌనం పాటించాలని పేర్కొన్నారు. ఈ సమయంలో ముకేశ్ అంబానీ భావోద్వేగానికి గురైనట్లు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment