విద్యార్థినిలు చదువులో రాణించండి
కర్నూలు (కొండారెడ్డి బురుజు): విద్యార్థినులు చదువులో రాణించాలని కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక పేర్కొన్నారు. వాసవి మహిళా కళాశాలలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థినులు తీసుకుంటున్న శిక్షణ ముగిసింది. ముగింపు కార్యక్రమాన్ని వాసవీ కళాశాల యాజమాన్యం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమానికి ఎంపీ ముఖ్య అతిథిగా హాజరై కోర్సు పూర్తి చేసిన విద్యార్థినిలకు సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా అభివృద్ధి చెందుతున్నారని, దీనికి కారణం చదువేనని తెలిపారు. తల్లిదండ్రులు అమ్మాయిలను చదివించడం ఎంత ముఖ్యమో గుర్తించాలని సూచించారు. కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ సోమిశెట్టి వెంకట్రామయ్య, ప్రిన్సిపాల్ అరిమతి సరస్వతి, కోర్స్ కరస్పాండెంట్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.