ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు
సూచీలకు అయిదో రోజూ లాభాలు
ఫెడ్ వడ్డీరేట్ల తగ్గింపు సంకేతాల ప్రభావం
ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో గురువారం ఓ మరపురాని అద్భుతం చోటు చేసుకుంది. జాతీయ స్టాక్ ఎక్సే్చంజీ సూచీ ఎన్‌ఎస్‌ఈ తొలిసారి 25,000 పాయింట్ల శిఖరాన్ని అధిరోహించింది. సెన్సెక్స్, నిఫ్టీలు ఇంట్రాడే, ముగింపుల్లోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పాయి. సెపె్టంబర్‌లో వడ్డీరేట్ల తగ్గింపు ఉండొచ్చని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలతో ఆయిల్‌అండ్‌గ్యాస్, బ్యాంకింగ్ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
ఫలితంగా సెన్సెక్స్ 126 పాయింట్లు పెరిగి 81,868 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 60 పాయింట్లు బలపడి 25 వేల స్థాయిపైన 25,011 వద్ద నిలిచింది. ముఖ్యంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, రిలయన్స్ షేర్లు సూచీలను ముందుకు నడిపించాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి.
ట్రేడింగ్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 388 పాయింట్లు బలపడి 82,129 వద్ద, నిఫ్టీ 127 పాయింట్లు ఎగసి 25,078 వద్ద జీవితకాల గరిష్టాలు అందుకున్నాయి. పశి్చ మాసియాలో యుద్ధ ఉద్రిక్తతల ప్రభావంతో మిడ్‌సెషన్ నుంచి గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు ఎఫ్‌ఎంసీజీ, ఐటీ, యుటిలిటీ, టెక్ షేర్లలో లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. దీంతో సూచీలు ఆరంభ లాభాలు కోల్పోయి స్వల్ప లాభాలతో ముగిశాయి. కాగా అమెరికా మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడవుతున్నాయి.
25,000
ప్రయాణం ఇలా..
→ 1996, ఏప్రిల్ 22న 13 కంపెనీల లిస్టింగ్‌తో నిఫ్టీ సూచీ 1000 పాయింట్ల వద్ద ప్రయాణం ప్రారంభించింది. తొలినాళ్లలో దేశంలో తీవ్ర రాజకీయ అస్థిరత (1996–98), తర్వాత ఆసియా ఆర్థిక సంక్షోభం, డాట్‌కామ్ బబుల్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం(2007) ప్రతికూల ప్రతికూల పరిస్థితులను అధిగమిస్తూ తొలిసారి 5,000 పాయింట్లను చేరేందుకు 11 ఏళ్లు పట్టింది.
→ సత్యం కుంభకోణం, యూరోపియన్ రుణ సంక్షోభం, ట్యాపర్ తంత్రం, జీఎస్‌టీ అమలు సవాళ్ల ఆటుపోట్లను ఎదుర్కొని 25 జూలై 2017న 10,000 మైలురాయిని చేరింది.
→ ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం, కార్పొరేట్ పన్ను, కోవిడ్ మహమ్మారి సూచీని పట్టి కుదిపాయి. కరోనా తొలి వేవ్ సమయంలో 7,600కు పడిపోయిన నిఫ్టీ కేవలం 220 రోజుల్లోనే రెండింతలకు కోలుకోవడం విశేషం. ఈ క్రమంలో 5 ఫిబ్రవరి 2021న 15,000 స్థాయిని అందుకుంది.
→ కరోనా వేళ పెంచిన వడ్డీరేట్లను తగ్గించేందుకు, పెరిగిన ద్రవ్యోల్బణ కట్టడికి ఆర్‌బీఐ, ఫెడ్ రిజర్వ్‌తో పలు దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీరేట్ల పెంపు ప్రారంభం ప్రక్రియ ప్రారంభించాయి. ఇదే సమయంలో ఇజ్రాయిల్ – పాలస్తీనా యుద్ధ భయాలు తెరపైకి వచ్చాయి. ఈ సవాళ్లను ధీటుగా ఎదుర్కొని గతేడాది (2023) సెపె్టంబర్ 11న 20,000 స్థాయికి చేరింది.
→ ఇక 20,000 స్థాయి నుండి 25000 పాయింట్లు చేరేందుకు 220 ట్రేడింగ్ సెషన్ల సమయం తీసుకుంది. సూచీకి ఇదే అత్యంత వేగవంతమైన 5,000 పాయింట్ల లాభం.
Comments
Please login to add a commentAdd a comment