new services
-
స్టార్ హెల్త్ నుంచి ‘హోమ్ హెల్త్‌కేర్’ సేవలు
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు. దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్హెల్త్, అతుల్య హోమ్‌కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్‌రాయ్ వెల్లడించారు. జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో బాధపడేవారు 044–69006900 నంబర్‌కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్‌ను సూచిస్తామని చెప్పారు. -
ఎన్ఎస్ఈలో కొత్తగా 4 సూచీలు
నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజీ(ఎన్ఎస్ఈ) తాజాగా నగదు విభాగంతోపాటు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్(ఎఫ్‌అండ్‌వో)లో నాలుగు ఇండెక్సులను కొత్తగా ప్రవేశపెడుతోంది. నిఫ్టీ టాటా గ్రూప్ 25 శాతం క్యాప్, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా మాన్యుఫాక్చరింగ్ 50:30:20, నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ 50:30:20, నిఫ్టీ మిడ్‌స్మాల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సూచీలను రూపొందించింది. ఇవి ఈ నెల 8 నుంచి అమల్లోకి రానున్నాయి. నిఫ్టీ500 మల్టిక్యాప్ ఇండియా ఇండెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, టాటా మోటార్స్ కీలకంగా నిలవనున్నాయి. ఇన్ఫ్రా ఇండెక్స్‌లో ఎల్అండ్టీ, ఆర్ఐఎల్, భారతీ ఎయిర్టెల్ ప్రాధాన్యత వహించనున్నాయి. -
కెనరా బ్యాంక్ నుంచి సరికొత్త సేవలు
హైదరాబాద్: కెనరా బ్యాంక్ పలు కొత్త ఉత్పత్తులు, సరీ్వసులు ప్రారంభించింది. ‘కెనరా హీల్’ పేరుతో వినూత్న హెల్త్ ప్రొడక్ట్ ప్రవేశపెట్టింది. ఆసుపత్రుల్లో చికిత్సలకు బీమా క్లెయిమ్ పూర్తిగా రాని సందర్భాల్లో ‘కెనరా హీల్’ ద్వారా రుణ సహాయం అందించనుంది. మహిళల కోసం ‘కెనరా ఏంజెల్’ అనే పేరుతో కస్టమైజ్డ్ సేవింగ్స్ ఖాతాను ప్రవేశపెట్టింది. ఎస్‌హెచ్‌జీ గ్రూప్ సభ్యులకు ఆన్లైన్ ద్వారా తక్షణ రుణ సదుపాయానికి ‘కెనరా ఎస్‌హెచ్‌జీ ఈ–మనీ’ తీసుకొచి్చంది. అలాగే ప్రీ–అప్రూడ్ వ్యక్తిగత రుణాలకు ‘కెనరా రెడీక్యా‹Ù’; ఆన్లైన్ టర్మ్ డిపాజిట్ రుణాలకు ‘కెనరా మైమనీ’; అవాంతరాలు లేని చెల్లింపులకు ‘కెనరా యూపీఐ 123పే ఏఎస్ఐ’ సేవలు ప్రారంభించింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్ సీఈఓ రాజేష్ బన్సాల్, కెనరా బ్యాంక్ ఎండీ, సీఈవో సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు. -
సిటీ బస్.. టాప్ గేర్
హైదరాబాద్: సిటీ బస్సు ఇక రయ్‌రయ్‌మని పరుగులు తీయనుంది. నూతన సంవత్సరం కొత్త సరీ్వసులు అందుబాటులోకి రానున్నాయి. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో ఇప్పటి వరకు కొత్తవాటిని ప్రవేశపెట్టకపోవడంతో ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులను నడపడం అసాధ్యంగా మారింది. మహిళా ప్రయాణికులకు ఉచిత సదుపాయంకల్పించినప్పటి నుంచి ఆక్యుపెన్సీ రేషియో గణనీయంగా పెరిగింది. దీంతో పలు మార్గాల్లో అదనపు బస్సులను నడపడం తప్పనిసరిగా మారింది. ప్రత్యేకంగా ఉదయం, సాయంత్రం స్కూళ్లు, కాలేజీలకు వెళ్లే విద్యార్థుల డిమాండ్ మేరకు బస్సులు అందుబాటులో లేకపోవడంతో నగర శివార్లలోని ఇంజినీరింగ్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పని చేసే ఉద్యోగులు కూడా రద్దీ కారణంగా సకాలంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో యుద్ధప్రాతిపదికన 340 బస్సులను అద్దెకు తీసుకొనేందుకు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ చర్యలు చేపట్టింది. ఇంచుమించు కొత్త ఏడాది ఆరంభంలోనే ఇవి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నగరంలోని వివిధ మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్న ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల తరహాలోనే మరో 500 కొత్త బస్సులను నగరంలో ప్రవేశపెట్టనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జూన్ నాటికి ఈ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు అధికారులు తెలిపారు. దీంతో కొత్త సంవత్సరం 840 కొత్త బస్సులు నగరంలో వినియోగంలోకి రానున్నాయి. ఈ బస్సులతో ప్రయాణికులకు కొంత మేరకు ఊరట లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు. కోటిన్నర దాటి.. మహాలక్ష్మి పథకం గ్రేటర్లో విజయవంతంగా కొనసాగుతోంది. ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రతి రోజు సుమారు 8 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నట్లు అంచనా. డిసెంబరు 9వ తేదీన ఈ పథకం అందుబాటులోకి వచి్చన సంగతి తెలిసిందే. గతంలో 4 నుంచి 5 లక్షల మంది మహిళలు సిటీ బస్సుల్లో ప్రయాణం చేయగా.. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత ఏకంగా 8 లక్షలకు చేరింది. రోజు రోజుకు మహిళా ప్రయాణికులు పెరుగుతున్నారు. దీంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మహిళా ప్రయాణికుల సంఖ్య కోటిన్నర దాటినట్లు అంచనా. గతంలో 67 నుంచి 69 శాతం వరకు ఉన్న ఆక్యుపెన్సీ రేషియో కూడా 80 శాతం దాటింది. రద్దీ రూట్లలో మహిళలు సైతం ఫుట్‌బోర్డుపై ప్రయాణం చేయాల్సివస్తోంది. మరోవైపు ఉచిత ప్రయాణ సదుపాయంతో మహిళా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఉదయం కాలేజీలకు వెళ్లే విద్యారి్థనులు ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయం పూట కాలేజీకి వెళ్లాల్సిన సమయంలో బస్సులు కిక్కిరిసిపోతుండటంతో ప్రయాణం అసాధ్యంగా మారుతోంది. దీంతో అదనపు ట్రిప్పులు ఏర్పాటు చేయాలని విద్యారి్థనులు డిమాండ్ చేస్తున్నారు. నగర శివార్లలో పెరిగిన రద్దీ... ఉచిత ప్రయాణ సదుపాయంతో శివారు ప్రాంతాల్లోంచి నగరంలోకి రాకపోకలు సాగించే బస్సుల్లో రద్దీ భారీగా పెరిగింది. డిమాండ్‌కు తగినవిధంగా బస్సులు లేకపోవడంతో అందుబాటులో ఉన్న బస్సుల్లోనే ప్రయాణం చేయాల్సివస్తోంది. ‘సాధారణంగానే కొద్ది రోజులుగా రాకపోకలు పెరిగాయి. ఈ పథకం వినియోగంలోకి వచి్చన తర్వాత రద్దీ మరింత ఎక్కువైంది. కానీ కొత్త బస్సులు వచ్చే వరకు ట్రిప్పులను పెంచడం సాధ్యం కాదు కదా’ అని ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. డిపోల్లో స్పేర్‌లో ఉండే 10 శాతం బస్సులను సైతం నడుపుతున్నట్లు చెప్పారు. గ్రేటర్లో ప్రజా రవాణా వ్యవస్థను బలోపేతం చేస్తేనే రోడ్లపై వాహనాల రద్దీ తగ్గుతుంది. ఈ దిశగా కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని ఆశిద్దాం. ఫ్యామిలీ–24 టికెట్లు రద్దు మహాలక్ష్మి పథకం వల్ల ప్రయాణికుల రద్దీ పెరిగిన నేపథ్యంలో గ్రేటర్లో జారీ చేసే ఫ్యామిలీ–24, టి–6 టికెట్లను నేటి నుంచి ఉపసంహరించుకోనున్నట్లు ఆర్టీసీ ఎండీ సజ్జరార్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఫ్యామిలీ– 24, టి–6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మి పథకం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ–24, టి–6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా బస్ సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతుంది. దీంతో ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశంతోనే ఈ టికెట్లను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నుంచి సిటీ బస్సుల్లో ఈ టికెట్లు లభించవు. -
కొత్త విభాగంలో అడుగెట్టిన ఫోన్‌పే - వివరాలు
బెంగళూరు: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్డాట్మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. బీఎస్ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు. ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు. స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో సంపూర్ణమైందని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్‌పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు. -
‘గిఫ్ట్ ఏ స్మైల్’ అంబులెన్సులు ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం సందర్భంగా ఇచ్చిన పిలుపు మేరకు ‘గిఫ్ట్ ఏ స్మైల్’పేరిట శాసనసభ్యులు అంబులెన్సులను విరాళంగా అందజేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా శనివారం ప్రగతిభవన్‌లో 21 అంబులెన్సులను ప్రారంభించిన మంత్రి.. వివిధ నియోజకవర్గాల్లో ఆరోగ్య సేవల కోసం వాటిని అందజేశారు. మంత్రులు ఈటల రాజేందర్, మల్లారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీలు రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి మూడేసి చొప్పున, ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి ఒక అంబులెన్సును విరాళంగా అందజేశారు. మంత్రి నిరంజన్‌రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి రెండు, నన్నపునేని నరేందర్, ఆరూరు రమేశ్, వినయ్ భాస్కర్‌తో పాటు వరంగల్‌కు చెందిన లక్ష్మణరావు ఒక్కో అంబులెన్సు చొప్పున ఇచ్చారు. వీటిని ఉమ్మడి మహబూబ్‌నగర్, హైదరాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, ఖమ్మం జిల్లాలోని పలు నియోజకవర్గాల్లో సేవలందించేందుకు ఉపయోగిస్తారు. ఈ అంబులెన్సుల్లో ఆక్సిజన్ వెంటిలేటర్‌తో సహా ఆధునిక సదుపాయాలున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. కార్యక్రమంలో మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతిరాథోడ్, ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్‌భాస్కర్‌తో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఎంపీలు, పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ డాక్టర్ పట్నం మహేందర్‌రెడ్డి రూ.20.50 లక్షల వ్యయంతో సమకూర్చిన అంబులెన్సును కూడా కేటీఆర్ ప్రారంభించారు. -
బీదర్‌కు ట్రూజెట్ సర్వీసులు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రూజెట్ పేరుతో విమాన సేవల్లో ఉన్న హైదరాబాద్ సంస్థ టర్బో మేఘా ఎయిర్వేస్ తాజాగా తన నెట్‌వర్క్‌లోకి బీదర్‌ను చేర్చింది. ఉడాన్ సర్వీసుల్లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు మధ్య ఫ్లయిట్‌ను ప్రతిరోజూ నడుపుతారు. కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కొత్త సర్వీసును శుక్రవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవం అనంతరం మంత్రులు, కంపెనీ ప్రతినిధులతో కలిసి విమానంలో బీదర్ ప్రయాణించారు. బస్సులో 12 గంటల సమయం పడుతుందని, విమానంలో గంట 40 నిమిషాల్లోనే చేరుకున్నామని ఈ సందర్భంగా సీఎం చెప్పారు. బీదర్ చేరికతో ట్రూజెట్ నెట్‌వర్క్‌లో డెస్టినేషన్ల సంఖ్య 24కు చేరుకుందని టర్బో మేఘా ఎయిర్వేస్ డైరెక్టర్ కె.వి.ప్రదీప్ వెల్లడించారు. కార్యకలాపాలు ప్రారంభించిన నాలుగేళ్లలోనే ఈ స్థాయికి చేరుకున్నామని కంపెనీ సీఈవో కల్నల్ ఎల్ఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాగా, స్ప్రింగ్ సర్ప్రైజ్ పేరుతో నాలుగు రోజుల సేల్‌లో భాగంగా బెంగళూరు–బీదర్–బెంగళూరు రూట్లో బేస్ ఫేర్ రూ.699కే అందిస్తోంది. సర్వీసు ప్రారంభిస్తున్న కర్ణాటక సీఎం, తదితరులు -
నచ్చిన చోట శ్రీవారి ‘సేవ’
సాక్షి ప్రతినిధి, తిరుపతి : తిరుమల వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తమవంతు సేవలందించాలనుకునే వారికి టీటీడీ సువర్ణావకాశం కల్పించింది. ఇకపై శ్రీవారి సేవకులు ఎవరైనా తమకిష్టమైన విభాగాల్లో దేవుడి సేవ చేసుకునే అవకాశాన్ని కల్పించనుంది. ఇందుకోసం ఈనెల 25 నుంచి ఆన్లైన్లో శ్రీవారి సేవకులు తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని టీటీడీ ఆదివారం ప్రకటించింది. తిరుమల కొండపై దేవుడి సేవ చేయాలన్న తలంపుతో వచ్చే వారిని శ్రీవారి సేవకులు అంటారు. ఏ రోజు ఎవరెవరు ఎక్కడెక్కడ స్వామివారి సేవ చేసుకోవాలో టీటీడీనే నిర్ణయిస్తుంది. అయితే ఎక్కువ మంది భక్తులు తమకు నచ్చిన చోట సేవలందించలేకపోయమాన్న బాధతో వెళ్లేవారు. ఈ నేపథ్యంలో టీటీడీ శ్రీవారి సేవకులు తమకిష్టమొచ్చిన విభాగాల్లో సేవలు అందించే అవకాశాన్ని కల్పించనుంది. అన్నదానం, ఆరోగ్యశాఖ, నిఘా, భద్రత, కల్యాణకట్ట, వసతి విభాగాలతో పాటు హెల్ప్‌డెస్క్, తిరునామం సేవలను వీరికోసం అందుబాటులోకి తెచ్చింది. భక్తులు తమకు ఇష్టమైన సేవలను తామే ఎంచుకుని 3, 4, 7 రోజుల సేవలు చేసుకునేందుకు వీలు కల్పించనుంది. ఈ నూతన విధానాన్ని మే, జూన్ మాసాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నారు. -
రాయదుర్గం నుంచి బెంగళూరుకు మూడు కొత్త సర్వీసులు
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం నుంచి బెంగళూరుకు మూడు కొత్త సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ మద్దిలేటి తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక డిపో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రెండు సర్వీసులతో పాటు అదనంగా మరో మూడు సర్వీసులు ప్రారంభించినట్లు చెప్పారు. ఒక సర్వీసు రాయదుర్గంలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి, కళ్యాణదుర్గం, పావగడ, హిందూపురం మీదుగా బెంగళూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అదే బస్సు బెంగళూరులో మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి, రాత్రి 8.30 గంటలకు రాయదుర్గం చేరుకుంటుందన్నారు. మరో బస్సు ఉదయం 10 గంటలకు రాయదుర్గంలో బయలుదేరి, పై తెలిపిన రూటులోనే సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5.40గంటలకు బెంగళూరులో బయలుదేరి, రాత్రి 12.30 గంటలకు రాయదుర్గం చేరుకుంటుందన్నారు. మరో సర్వీసు రాయదుర్గంలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి, వేపులపర్తి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, నాగేపల్లిగేటు, అమరాపురం, మడకశిర, హిందూపురం మీదుగా బెంగళూరుకు తెల్లవారు జామున 2.45 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ బస్సు తిరిగి ఉదయం 7గంటలకు బెంగళూరులో బయలుదేరి ఇదే రూటులో మధ్యాహ్నం 2.00 గంటలకు రాయదుర్గం వస్తుందని చెప్పారు. ప్రస్తుతం డిపో పరిధిలో 56 సర్వీసులు నడుస్తుండగా, కొత్తగా నంద్యాల, ధర్మస్థలం నడపడానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ డీఎం మద్దిలేటి తెలిపారు. -
20 నుంచి కొత్త విమాన సర్వీసులు
గన్నవరం(కృష్ణా) : గన్నవరం విమానాశ్రయానికి కొత్త విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. టర్బో మెగా ఎయిర్వేస్కు చెందిన ట్రూజెట్తోపాటు స్పైస్‌జెట్ సంస్థలు కొత్తగా అదనపు విమాన సర్వీసులు నడిపేందుకు ముందుకువచ్చాయి. ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, కడప, తిరుపతికి విమాన సర్వీసులు నడుపుతున్న ట్రూజెట్ సంస్థ ఈ నెల 20వ తేదీ నుంచి హైదరాబాద్‌కు రెండవ విమాన సర్వీసును నడపనుంది. ఈ విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 12.40కు గన్నవరం నుంచి బయలుదేరి 1.40గంటలకు హైదరాబాద్‌కు చేరుకుంటుంది. ఫిబ్రవరి 19 నుంచి వారణాసికి సర్వీస్ స్పైస్‌జెట్ విమాన సంస్థ ఫిబ్రవరి 19వ తేదీ నుంచి వారణాసి నుంచి హైదరాబాద్ మీదుగా ఇక్కడికి నూతన సర్వీస్‌ను ప్రారంభించనుంది. ఈ విమాన సర్వీస్ మంగళవారం మినహా వారంలో ఆరు రోజులపాటు ఉంటుంది. ఈ విమానం ప్రతిరోజు వారణాసి నుంచి ఉదయం 10 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా మధ్యాహ్నం 1.50కు గన్నవరం చేరుకుంటుంది. ఇక్కడ మధ్యాహ్నం 2.40 గంటలకు బయలుదేరి హైదరాబాద్ మీదుగా సాయంత్రం 6.55కు వారణాసి చేరుకుంటుంది. ఈ సర్వీస్ నిమిత్తం స్పైస్‌జెట్ సంస్థ 189 సీటింగ్ కెపాసిటీ కలిగిన 737–800 బోయింగ్ విమానాన్ని నడపనుంది. ప్రస్తుతం ఇక్కడికి రాకపోకలు సాగిస్తున్న విమానాల్లో ఇదే అతిపెద్ద విమానం కావడం విశేషం. -
అత్యాధునిక సేవల్లో ఎస్బీఐ
‘అనంత’లో తొలి డిజిటల్ బ్రాంచి ప్రారంభం అనంతపురం అగ్రికల్చర్: అన్ని బ్యాంకుల కన్నా అత్యాధునిక సేవలు అందించడమే లక్ష్యంగా ఆధునిక పరిజ్ఞానంతో కూడిన డిజిటల్ ఇన్టచ్ బ్రాంచిని తొలిసారిగా ‘అనంత’లో ఏర్పాటు చేశామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తిరుపతి డిప్యూటీ జనరల్ మేనేజర్ (డీజీఎం) ఎం.బాలసుబ్రమణియన్ తెలిపారు. నగరంలోని సూర్యానగర్ మెయిన్‌రోడ్డులో ఏర్పాటు చేసిన డిజిటల్ బ్రాంచిని శుక్రవారం ఆర్ఎం ఎంవీఆర్ మురళీకృష్ణ, బ్రాంచి మేనేజర్ ఎస్వీ ప్రసాద్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీఎం, ఆర్ఎం మాట్లాడుతూ ఇక్కడ నగదు, పేపరు, మనషులతో పనిలేకుండా ఆధునిక యంత్రపరికరాలు, కంప్యూటర్లతోనే బ్యాంకింగ్ సేవలు పొందవచ్చన్నారు. కైవేసీ ఫారాలు ఉంటే ఖాతాదారులు స్వంతంగానే కొత్తగా ఖాతాలు తెరవడం, ఏటీఎం కార్డులు పొందడం, చెక్‌బుక్కులు తీసుకోవడం, లావాదేవీలు జరపడం, నెట్ బ్యాంకింగ్, స్వయం సేవా మిషన్ ద్వారా పాస్‌బుక్కులో వివరాలు నమోదు చేసుకోవడం లాంటివి సులభంగా చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. హౌసింగ్, వెహికల్ లోన్లు కూడా తీసుకోవచ్చన్నారు. డిజిటల్ ఇన్టచ్ బ్రాంచి 24 గంటలూ పని చేస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ఖాతాదారులు అన్ని వర్గాల ప్రజలు వినియోగించుకోవాలని సూచించారు. ఖాతాదారుల స్పందనను బట్టి భవిష్యత్తులో ధర్మవరం, హిందూపురం, కదిరి పట్టణాల్లో కూడా ఇలాంటి శాఖను అందుబాటులోకి తెస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎస్బీఐ అధికారులు హరిబాబు, శ్రీకాంత్, విద్యాసాగర్, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
‘మీ సేవ’ లావాదేవీలు 7 కోట్లు పైనే
నేడు మరిన్ని సేవలను ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ‘మీసేవ’ విభాగం రూ.7 కోట్ల లావాదేవీలను పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో మరికొన్ని ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన సేవలను ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. రెవెన్యూ, పోలీసు, పౌర సరఫరాల విభాగాలకు చెందిన కొత్త సేవలను శుక్రవారం హోటల్ హరితప్లాజాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐటీశాఖ మంత్రి కె.తారకరామారావు ఆవిష్కరించనున్నట్లు ఎలక్ట్రానిక్స్ విభాగం ఉన్నతాధికారులు తెలిపారు. -
నాలుగు కొత్త సర్వీసులు
హిందూపురం అర్బన్ : హిందూపురం ఆర్టీసీ డిపో నుంచి నాలుగు కొత్త సర్వీసులు ప్రారంభించినట్లు ఆర్టీసీ డీఎం గోపినాథ్ ఆదివారం తెలిపారు. తెల్లవారుజాము 4.30 గంటలకు హిందూపురం–కర్నూలు, 0ఉదయం 7.30 గంటలకు హిందూపురం–తిరుపతికి సర్వీసులు నడుస్తున్నాయన్నారు. తర్వాత హిందూపురం–విజయవాడకు 4 గంటలకు హైటెక్ బస్సును నడిపిస్తున్నట్లు ∙చెప్పారు. ఈ బస్సు కదిరి, పులివెందుల మీదుగా విజయవాడకు చేరుకుంటుందన్నారు. వీటికి రిజర్వేషన్ సదుపాయం కూడా ఉందని వివరించారు. -
నేటి నుంచి విజయవాడకు స్పైస్‌జెట్ నూతన సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): స్పైస్‌జెట్ విమాన సంస్థ సోమవారం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్తగా మరో రెండు విమాన సర్వీసులను నడపనుంది. తిరుపతి నుంచి గన్నవరం మీదుగా వైజాగ్‌కు ఈ సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఐదు సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ కొత్త సర్వీసులతో ఆ సంఖ్య ఏడుకు చేరుకోనుంది. ఈ విమానం ప్రతిరోజు ఉదయం 11.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 12.15కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని, 25 నిమిషాల విరామం అనంతరం మధ్యాహ్నం 12.40 ఇక్కడి నుంచి బయలుదేరి 13.35కు వైజాగ్‌కు చేరుకుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తిరిగి వైజాగ్ నుంచి 14.20కు బయలుదేరి సాయంత్రం 15.20 ఇక్కడికి చేరుకుని 20 నిమిషాల విరామం అనంతరం బయలుదేరి 16.45కు తిరుపతి చేరుకుంటుందన్నారు. -
మరిన్ని నగరాలకు ట్రూజెట్
- నేటి నుంచి హైదరాబాద్ నుంచి బెంగళూరుకు - త్వరలో విశాఖ, విజయవాడలకు - ట్రూజెట్ ఎండీ ఉమేష్ వంకాయలపాటి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: టాలీవుడ్ నటుడు రామ్‌చరణ్ బ్రాండ్ అంబాసిడర్, డెరైక్టర్‌గా ఉన్న చౌక విమానయాన సంస్థ ట్రూజెట్ తన సర్వీసులను మరిన్ని నగరాలకు విస్తరిస్తోంది. సెప్టెంబర్ 10 నుంచి హైదరాబాద్- బెంగళూరు, బెంగళూరు-షిరిడీ (ఔరంగాబాద్)లకు కొత్త సర్వీసులను ప్రారంభిస్తున్నట్లు ట్రూజెట్ తెలిపింది. ఈ కొత్త సర్వీసులతో కలిపి మొత్తం ఆరు పట్టణాలకు తాము విమాన సర్వీసులను అందిస్తున్నామని, త్వరలోనే దక్షిణాదిలోని అన్ని ప్రధాన పట్టణాలకు విస్తరించనున్నట్లు ట్రూజెట్ మేనేజింగ్ డెరైక్టర్ ఉమేష్ వంకాయలపాటి తెలిపారు. ఈ నెలాఖరుకు మూడో విమానం అందుబాటులోకి వస్తుందని, దీంతో విజయవాడ, విశాఖపట్నంలకు సర్వీసులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కోరిక మేరకు సాధ్యమైనంత త్వరగా హైదరాబాద్ నుంచి విజయవాడకు సర్వీసును ప్రారంభించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా ఈ మధ్యనే ట్రూజెట్ విమాన సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మా సర్వీసులకు డిమాండ్ బాగుందని, లోడ్ ఫ్యాక్టర్ 85 నుంచి 90 శాతంగా ఉందన్నారు. ప్రారంభించిన రెండు నెలల్లోనే నిర్వహణా లాభాలను ఆర్జిస్తున్నట్లు తెలిపారు. -
విశాఖ నుంచి ఇండిగో సర్వీసులు
ముంబై: విస్తరణ ప్రణాళికలో భాగంగా మరిన్ని నగరాలను కలుపుతూ ఆదివారం నుంచి 6 కొత్త విమాన సర్వీసులను ఇండిగో ప్రారంభించనుంది. విశాఖ, ఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్, రాంచీ, కోల్‌కతాల నుంచి కొత్త సర్వీసులు నిర్వహిస్తామని సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. బెంగళూరు - భువనేశ్వర్, విశాఖ విమాన సేవలు ఆదివారం నుంచి, మిగిలి నవి ఏప్రిల్ 6 నుంచి మొదలవుతాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 36 నగరాల మధ్య 485 సర్వీసులు నిర్వహిస్తుండడంతో ఈ రం గంలో మరింత బలపడతామని తెలిపింది. -
మరో పది మీ సేవలు
సాక్షి, రాజమండ్రి : ‘ఈ సువిధా’ పేరుతో మున్సిపాలిటీల్లో నిర్వహిస్తున్న మీ సేవా కేంద్రాల్లో జనవరి ఒకటో తేదీ నుంచి మరో పది కొత్త సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెస్తున్నారు. దీంతో మీ సేవా కేంద్రాల్లో లభించే సేవల సంఖ్య 48కు పెరగనుంది. ఇప్పటి వరకూ 43 శాఖలకు చెందిన 38 రకాల సేవలను మీసేవా కేంద్రాల్లో అందిస్తున్నారు. వీటిలో 15 సేవలు ప్రత్యేకంగా మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థల పౌరులకు సంబంధించినవి ఉన్నాయి. కొత్తగా చేరుస్తున్న వాటితో 70 శాతం పుర సేవలు మీ సేవల ద్వారా అందుబాటులోకి వస్తాయని అధికారులు చెబుతున్నా రు. జిల్లాలోని రెండు నగరపాలక సంస్థలు, ఏడు మున్సిపాలిటీల్లో పురపాలక శాఖ పరిధిలో 58 మీ సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటన్నింటిలో ఈ సేవలను పౌరులు పొందే అవకాశం ఉంది. కొత్త సర్వీసులు ఇవే... కొత్తగా చేరుస్తున్న సర్వీసులను కొన్నింటిని తక్షణ ప్రాతిపదికగా అందుబాటులోకి తెస్తున్నారు. కాగా మరి కొన్నింటిని మాత్రం సిబ్బందికి పూర్తిగా శిక్షణ ఇచ్చిన తర్వాత జనవరి ఒకటి నుంచి అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. కొత్తగా చేరుతున్న సేవల ప్రకారం పుర పౌరులు నీటి కుళాయి కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మున్సిపాలిటీల్లో వ్యాపారం చేసుకునేందుకు లెసైన్సుకు దరఖాస్తు చేయవచ్చు. లెసైన్సుల రెన్యువల్, కొత్త భవన నిర్మాణానికి అనుమతులకు దరఖాస్తు చేసుకోవచ్చును. కొత్త ఎసెస్మెంట్ కోసం అభ్యర్థన పత్రాలు దాఖలు చేయవచ్చు. ఎసెస్మెంట్ల సబ్ డివిజన్ కోసం మీసేవ ద్వారా అభ్యర్థన పత్రం దాఖలు చేయవచ్చు. పన్ను మినహాయింపు, వేకెన్సీ రెమిషన్ అభ్యర్థనలు, స్థల అనుభవ, స్వాధీన ధ్రువ పత్రాలతో పాటు ఆస్థి యాజమాన్య బదలాయింపులకు కూడా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. అవగాహన కార్యక్రమాలు ట్రేడ్ లెసైన్సులు, భవన నిర్మాణ అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు, తదితర సేవలు అందించాలంటే మీసేవ నిర్వాహకులకు తగిన అవగాహన అవసరం అని అధికారులు భావిస్తున్నారు. అందుకోసం మున్సిపల్ రీజియన్ల వారీగా సిబ్బందికి శిక్షణలు ఇవ్వనున్నారు. రాజమండ్రి రీజియన్ పరిధిలోకి వచ్చే ఉభయగోదావరి, కృష్ణాజిల్లాల మీ సేవా కేంద్రాల సిబ్బందికి కొత్త సేవలపై ఈ నెల 27న అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషణ్ ప్రాంగణంలో ఈ శిక్షణను ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం కొత్తగా ప్రవేశ పెట్టిన పది సేవలు కొత్త సంవత్సరం నుంచి పూర్తి స్థాయిలో అమలులోకి వస్తాయి. పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్‌రెడ్డి ఆదేశాల మేరకు పురపాలక శాఖ అధికారులు కొత్త సేవలకు సన్నాహాలు చేస్తున్నారు. -
ఇండిగో కొత్త సర్వీస్‌లు
న్యూఢిల్లీ: తక్కువ రేట్లకు విమాన సర్వీసులు అందించే ఇండిగో ఆదివారం నుంచి దేశీయంగా 10 కొత్త సర్వీసులు ప్రారంభించనుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్‌కతాల నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆదిత్య ఘోష్ తెలియజేశారు. చెన్నై-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా, హైదరాబాద్-గోవా, చెన్నై-గోవా (వయా హైదరాబాద్) మధ్య తాజా నాన్-స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ నుంచి ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా మధ్య కూడా కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.