ఇండిగో కొత్త సర్వీస్‌లు | indigo to launch new services | Sakshi
Sakshi News home page

ఇండిగో కొత్త సర్వీస్‌లు

Published Sun, Dec 15 2013 2:55 AM | Last Updated on Sat, Sep 2 2017 1:36 AM

indigo to launch new services

న్యూఢిల్లీ: తక్కువ రేట్లకు విమాన సర్వీసులు అందించే ఇండిగో ఆదివారం నుంచి దేశీయంగా 10 కొత్త సర్వీసులు ప్రారంభించనుంది. హైదరాబాద్ సహా బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, గోవా, కోల్‌కతాల నుంచి ఈ సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు సంస్థ ప్రెసిడెంట్, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఆదిత్య ఘోష్ తెలియజేశారు. చెన్నై-హైదరాబాద్, చెన్నై-కోల్‌కతా, హైదరాబాద్-గోవా, చెన్నై-గోవా (వయా హైదరాబాద్) మధ్య తాజా నాన్-స్టాప్ విమాన సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. 22వ తేదీ నుంచి ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-గోవా మధ్య కూడా కొత్త సర్వీసులు ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement