బెంగళూరు: ఫిన్‌టెక్ సంస్థ ఫోన్‌పే తాజాగా స్టాక్ బ్రోకింగ్ విభాగంలోకి ప్రవేశించింది. షేర్‌డాట్‌మార్కెట్ పేరిట ప్రత్యేక ప్లాట్‌ఫాంను ప్రారంభించింది. బీఎస్‌ఈ ఎండీ సుందరరామన్ రామమూర్తి బుధవారం దీన్ని ఆవిష్కరించారు.
ప్రాథమికంగా స్టాక్స్, ఈటీఎఫ్‌లతో ప్రారంభించి క్రమంగా ఫ్యూచర్స్, ఆప్షన్స్ తదితర సెగ్మెంట్స్‌ను కూడా ఇందులో అందుబాటులోకి తేనుంది. దీనికి ఉజ్వల్ జైన్ సీఈవోగా వ్యవహరిస్తారు.
స్టాక్ బ్రోకింగ్ సెగ్మెంట్‌లోకి ఎంట్రీ ద్వారా తమ ఆర్థిక సేవల పోర్ట్‌ఫోలియో సంపూర్ణమైందని ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ తెలిపారు. మరోవైపు, 2025 నాటికల్లా ఫోన్‌పే నిర్వహణ లాభాలను సాధించే అవకాశం ఉందని సమీర్ నిగమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment