
న్యూఢిల్లీ: ఫిన్‌టెక్ కంపెనీ ఫోన్‌పే తాజాగా రూ.828 కోట్ల అదనపు నిధులను జనరల్ అట్లాంటిక్ నుంచి సమీకరించింది. ప్రస్తుతం కొనసాగుతున్న రూ.8,281 కోట్ల ఫండింగ్ రౌండ్‌లో భాగంగా జనరల్ అట్లాంటిక్, దాని సహ ఇన్వెస్టర్లు ఫోన్‌పే కంపెనీకి తాజా నిధులతో కలిపి రూ.4,554 కోట్లు అందించారు. ఈ పెట్టుబడులకు ముందు ఫోన్‌పే విలువను రూ.99,372 కోట్లుగా లెక్కించారు.
‘ఈ పెట్టుబడి సంస్థ వ్యాపారం, వృద్ధి సామర్థ్యంలో జనరల్ అట్లాంటిక్ నమ్మకాన్ని పునరుద్ఘాటిస్తుంది’ అని ఫోన్‌పే తెలిపింది. జనరల్ అట్లాంటిక్ నుండి ఈ తాజా నిధులతో ఫోన్‌పే ప్రస్తుత రౌండ్‌లో మొత్తం రూ.7,039 కోట్ల ప్రాథమిక మూలధనాన్ని సేకరించింది. రిబ్బిట్ క్యాపిటల్, టైగర్ గ్లోబల్, టీవీఎస్ క్యాపిటల్ ఫండ్‌లు కూడా కంపెనీ ప్రస్తుత రౌండ్‌లో పెట్టుబడి పెట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment