రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం నుంచి బెంగళూరుకు మూడు కొత్త సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ డిపో మేనేజర్ మద్దిలేటి తెలిపారు. సోమవారం సాయంత్రం స్థానిక డిపో కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రెండు సర్వీసులతో పాటు అదనంగా మరో మూడు సర్వీసులు ప్రారంభించినట్లు చెప్పారు.
ఒక సర్వీసు రాయదుర్గంలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి, కళ్యాణదుర్గం, పావగడ, హిందూపురం మీదుగా బెంగళూరుకు మధ్యాహ్నం 12.30 గంటలకు చేరుకుంటుందన్నారు. అదే బస్సు బెంగళూరులో మధ్యాహ్నం 2గంటలకు బయలుదేరి, రాత్రి 8.30 గంటలకు రాయదుర్గం చేరుకుంటుందన్నారు. మరో బస్సు ఉదయం 10 గంటలకు రాయదుర్గంలో బయలుదేరి, పై తెలిపిన రూటులోనే సాయంత్రం 4.30 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుందన్నారు. తిరిగి సాయంత్రం 5.40గంటలకు బెంగళూరులో బయలుదేరి, రాత్రి 12.30 గంటలకు రాయదుర్గం చేరుకుంటుందన్నారు.
మరో సర్వీసు రాయదుర్గంలో రాత్రి 7.30 గంటలకు బయలుదేరి, వేపులపర్తి, బ్రహ్మసముద్రం, శెట్టూరు, కుందుర్పి, నాగేపల్లిగేటు, అమరాపురం, మడకశిర, హిందూపురం మీదుగా బెంగళూరుకు తెల్లవారు జామున 2.45 గంటలకు చేరుకుంటుందన్నారు. ఈ బస్సు తిరిగి ఉదయం 7గంటలకు బెంగళూరులో బయలుదేరి ఇదే రూటులో మధ్యాహ్నం 2.00 గంటలకు రాయదుర్గం వస్తుందని చెప్పారు. ప్రస్తుతం డిపో పరిధిలో 56 సర్వీసులు నడుస్తుండగా, కొత్తగా నంద్యాల, ధర్మస్థలం నడపడానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆర్టీసీ డీఎం మద్దిలేటి తెలిపారు.