ఐదు రోజులకు రూ.7,500
చెన్నై: ప్రముఖ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ దేశవ్యాప్తంగా 50 పట్టణాల్లో ఇంటి వద్దే ఆరోగ్య సంరక్షణ సేవలను ప్రారంభించింది. ‘హోమ్ హెల్త్‌కేర్ సర్వీస్’ పేరుతో తీసుకొచి్చన ఈ సేవలను రానున్న రోజుల్లో మిగిలిన పట్టణాలకు సైతం విస్తరిస్తామని సంస్థ ఎండీ, సీఈవో ఆనంద్‌రాయ్ తెలిపారు.
దేశవ్యాప్తంగా కస్టమర్ల ఇంటివద్దే ఆరోగ్య సంరక్షణ సేవలు అందించేందుకు వీలుగా కేర్24, పోరి్టయా, కాల్‌హెల్త్, అతుల్య హోమ్‌కేర్, అర్గాలాతో సహకార ఒప్పందం కుదుర్చుకున్నట్టు చెప్పారు. కోయింబత్తూర్, పుణె, ఢిల్లీ, కోల్‌కతాలో ఈ సేవలను పరీక్షించి చూశామని, ఆ తర్వాతే ఇతర పట్టణాలకు విస్తరించాలని నిర్ణయించినట్టు ఆనంద్‌రాయ్ వెల్లడించారు.
జ్వరం, తీవ్రమైన గ్యాస్ట్రోఎంటరైటిస్, తీవ్రమైన గ్యాస్ట్రైటిస్, మూత్రనాళ ఇన్ఫెక్షన్‌తో బాధపడేవారు 044–69006900 నంబర్‌కు లేదా స్టార్ హెల్త్ మొబైల్ అప్లికేషన్ నుంచి అభ్యర్థన పంపి, ఇంటి వద్దే వైద్య సేవలను అందుకోవచ్చు. కస్టమర్ నుంచి అభ్యర్థన వచి్చన వెంటనే వైద్య బృందం స్టార్ హెల్త్ కస్టమర్ ఇంటికి చేరుకుని, వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించి, అవసరమైన ఔషధాలు సూచిస్తారు. ఐదు రోజుల చికిత్సకు (వైద్యులు, నర్సుల ఫీజులు సహా) ఒక్క రోగి రూ.7,000–7,500 వరకు చెల్లించాల్సి ఉంటుందని స్టార్ హెల్త్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ హరిహర సూదన్ తెలిపారు. తదుపరి చికిత్స అవసరం పడితే సమీపంలోని హాస్పిటల్‌ను సూచిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment