![నేటి నుంచి విజయవాడకు స్పైస్‌జెట్ నూతన సర్వీసులు](/styles/webp/s3/article_images/2017/09/3/61461523892_625x300.jpg.webp?itok=iGdeUlaz)
నేటి నుంచి విజయవాడకు స్పైస్‌జెట్ నూతన సర్వీసులు
విమానాశ్రయం (గన్నవరం): స్పైస్‌జెట్ విమాన సంస్థ సోమవారం నుంచి విజయవాడ గన్నవరం ఎయిర్‌పోర్టుకు కొత్తగా మరో రెండు విమాన సర్వీసులను నడపనుంది. తిరుపతి నుంచి గన్నవరం మీదుగా వైజాగ్‌కు ఈ సర్వీసులను ప్రారంభించనుంది. ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలకు ఐదు సర్వీసులను నడుపుతున్న ఈ సంస్థ కొత్త సర్వీసులతో ఆ సంఖ్య ఏడుకు చేరుకోనుంది.
ఈ విమానం ప్రతిరోజు ఉదయం 11.10 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి 12.15కు గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటుందని, 25 నిమిషాల విరామం అనంతరం మధ్యాహ్నం 12.40 ఇక్కడి నుంచి బయలుదేరి 13.35కు వైజాగ్‌కు చేరుకుంటుందని ఆ సంస్థ ప్రతినిధులు తెలిపారు. తిరిగి వైజాగ్ నుంచి 14.20కు బయలుదేరి సాయంత్రం 15.20 ఇక్కడికి చేరుకుని 20 నిమిషాల విరామం అనంతరం బయలుదేరి 16.45కు తిరుపతి చేరుకుంటుందన్నారు.