హైదరాబాద్ వెళ్లాల్సిన సైజెట్ విమానం సాంకేతిక కారణాలతో రెండు గంటల పాటు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిలిచిపోయింది.
కృష్ణా(గన్నవరం): హైదరాబాద్ వెళ్లాల్సిన సైజెట్ విమానం సాంకేతిక కారణాలతో రెండు గంటల పాటు కృష్ణాజిల్లా గన్నవరం విమానాశ్రయంలో నిలిచిపోయింది. దీంతో పలువురు మంత్రులతోపాటు ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. స్పెస్ జెట్‌కు చెందిన విమానం ప్రతిరోజు మధ్యాహ్నం 2.20 గంటలకు ఇక్కడికి వచ్చి 2.40కి హైదరాబాద్ బయలుదేరుతుంది. కాగా శనివారం విమానాన్ని సాంకేతిక లోపం కారణంగా నిలిపివేశారు.
సుమారు రెండు గంటలపాటు మరమ్మతులు చేసిన తర్వాత విమానాన్ని ప్రయాణానికి సిద్ధం చేశారు. హైదరాబాద్ వెళ్లాల్సిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కె.ఇ.కృష్ణమూర్తి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు, ప్రభుత్వ ప్రచార సలహాదారు పరకాల ప్రభాకర్‌తోపాటు పలువురు వీఐపీలు లాంజ్‌రూమ్‌లో నిరీక్షించారు. 4.30 గంటలకు విమానం హైదరాబాద్‌కు బయలుదేరింది.