Madhabi Puri Buch
-
ఎఫ్‌అండ్‌వో చర్చాపత్రంపై సెబీకి భారీగా ఫీడ్‌బ్యాక్
ముంబై: ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ట్రేడింగ్‌కి సంబంధించి విడుదల చేసిన చర్చాపత్రంపై దాదాపు 6,000కు పైగా పరిశ్రమవర్గాల నుంచి సలహాలు, సూచనలు వచ్చాయని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బచ్ తెలిపారు. ఆ ఫీడ్‌బ్యాక్ మొత్తాన్ని టెక్నాలజీ ద్వారా వేగవంతంగా ప్రాసెస్ చేసినట్లు ఆమె చెప్పారు. నిఘా, ప్రాసెసింగ్‌ను మెరుగుపర్చేందుకు పలు కృత్రిమ మేథ (ఏఐ) ఆధారిత సాంకేతికతలపై సెబీ పని చేస్తోందని మాధవి వివరించారు. ఎఫ్‌అండ్‌వో ట్రేడింగ్‌కి సంబంధించి ఇన్వెస్టర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు, డెరివేటివ్ మార్కెట్లలో స్థిరత్వం తెచ్చేందుకు తీసుకోతగిన చర్యలపై జూలైలో సెబీ చర్చాపత్రాన్ని విడుదల చేసింది. కనీస కాంట్రాక్టు సైజును పెంచడం, పొజిషన్ లిమిట్స్‌ను ఇంట్రా–డేలో పర్యవేక్షించడం, స్ట్రైక్ ప్రైస్‌లను క్రమబదీ్ధకరించడం, నియర్ కాంట్రాక్ట్ ఎక్స్పైరీ మార్జిన్‌ను పెంచడం తదితర ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. -
‘బహిరంగ విచారణ జరగాలి’
సెబీ చీఫ్ మాధబి పురి బచ్, తన భర్త ధవల్ బచ్‌ల పెట్టుబడులపై పారదర్శకంగా, బహిరంగ విచారణ జరగాలని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కోరింది. బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్ ఆరోపించింది. దానిపై సెబీ చీఫ్ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్ తన ఎక్స్ ఖాతాలో తాజాగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది.సెబీ చీఫ్ మాధబి పురి బచ్, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్ టైమ్ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ద్వారా ఇన్వెస్టింగ్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్ చేస్తూ బచ్ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్ చెప్పుకొచ్చింది. ఇలా బచ్ ఇన్వెస్ట్మెంట్లపై తమ ఒరిజినల్ నివేదికలోనూ తెలిపామని హిండెన్‌బర్గ్ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది.SEBI Chief Madhabi Puri Buch and her husband Dhaval Buch releases a statement in the context of allegations made by Hindenburg on 10th Aug 2024 against them."The investment in the fund referred to in the Hindenburg report was made in 2015 when they were both private citizens… pic.twitter.com/g0Ui18JVNT— ANI (@ANI) August 11, 2024Buch’s response now publicly confirms her investment in an obscure Bermuda/Mauritius fund structure, alongside money allegedly siphoned by Vinod Adani. She also confirmed the fund was run by a childhood friend of her husband, who at the time was an Adani director.SEBI was…— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024ఇదీ చదవండి: మెరుగైన సమాచార లభ్యతపై దృష్టిమాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్నర్స్ సింగపూర్’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్ ఆరోపించింది.Buch’s statement also claims that the two consulting companies she set up, including the Indian entity and the opaque Singaporean entity “became immediately dormant on her appointment with SEBI” in 2017, with her husband taking over starting in 2019.Per its latest shareholding… pic.twitter.com/gh7jS3zJKZ— Hindenburg Research (@HindenburgRes) August 11, 2024 -
చిన్న షేర్లలో అవకతవకలు
ముంబై: చిన్న, మధ్యతరహా స్టాక్స్‌లో అవకతవకలు జరుగుతున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవీ పురి పేర్కొన్నారు. కొంతమంది అసహజ లావాదేవీలకు తెరతీసినట్లు గుర్తించామని తెలియజేశారు. చిన్న, మధ్యతరహా సంస్థల(ఎస్ఎంఈలు) విభాగంలో కృత్రిమంగా ధరల పెంపును చేపడుతున్నట్లు వెల్లడించారు. ఎస్ఎంఈ విభాగం ఐపీవోలతోపాటు.. సెకండరీ మార్కెట్లోనూ అక్రమ లావాదేవీలు జరుగుతున్నట్లు అభిప్రాయపడ్డారు. వెరసి రిసు్కలు అధికంగాగల విభాగంలో ఇన్వెస్టర్లు మరింత జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉన్నట్లు సూచించారు. ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా మహిళా పాత్రికేయులతో ముచ్చటించిన పురి పలు అంశాలను ప్రస్తావించారు. ప్రధాన విభాగంతో పోలిస్తే ఎస్ఎంఈ విభాగం ప్రత్యేకమైనదని ఇన్వెస్టర్లు అర్ధం చేసుకోవలసి ఉన్నట్లు పురి పేర్కొన్నారు. ప్రధాన విభాగంలోని కంపెనీలు తప్పనిసరిగా సమాచారాన్ని వెల్లడించవలసి ఉంటుందని, అయితే ఎస్ఎంఈ విభాగం రిసు్కలు విభిన్నంగా ఉంటాయని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో టీ+0 సెటిల్మెంట్ సెక్యూరిటీల టీ+0 సెటిల్మెంట్ను మార్చి 28 నుంచి ఆప్షనల్ పద్ధతిలో ప్రవేశపెట్టనున్నట్లు పురి తెలియజేశారు. గత కొద్ది నెలల్లో భారీగా దూసుకెళుతున్న స్మాల్, మిడ్ క్యాప్ విభాగం షేర్ల విలువలపై స్పందిస్తూ కొన్ని కౌంటర్లలో అసహజ లావాదేవీలు నమోదవుతున్న సంకేతాలున్నట్లు వెల్లడించారు. ధరలను మ్యానిప్యులేట్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇవి బుడగలవంటివని వ్యాఖ్యానించారు. ఇలాంటి బుడగలు తలెత్తేందుకు అనుమతించకూడదని, ఇవి పగలిపోతే ఇన్వెస్టర్లపై ప్రతికూల ప్రభావం పడుతుందని స్పష్టం చేశారు. ఇది మార్కెట్లకు మంచిదికాదని అభిప్రాయపడ్డారు. స్టాక్ బ్రోకర్లకు కఠిన నిబంధనలు కాగా, అర్హతగల స్టాక్ బ్రోకర్(క్యూఎస్బీ)గా గుర్తించే మార్గదర్శకాలను సెబీ తాజాగా విస్తృతం చేసింది. తద్వారా మరింతమంది బ్రోకర్లను నిబంధనల పరిధిలోకి తీసుకువచ్చేందుకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు సెక్యూరిటీల మార్కెట్లో ఇన్వెస్టర్ల విశ్వాసాన్ని పెంపొందించే దిశగా తాజా చర్యలకు తెరతీసింది. యాజమాన్య సంబంధ లావాదేవీల పరిమాణం, నిబంధనలు, సమస్యల పరిష్కారం తదితర అంశాలను స్టాక్ బ్రోకర్లను క్యూఎస్బీలుగా గుర్తించడంలో పరిగణనలోకి తీసుకోనున్నట్లు ఒక సర్క్యులర్‌లో మార్కెట్ రెగ్యులేటర్ సెబీ పేర్కొంది. -
మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్
న్యూఢిల్లీ: కొత్త ఏడాది(2024)లో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లలో లావాదేవీ చేపట్టిన రోజునే సెటిల్మెంట్ పూర్తికానుంది. స్టాక్ ఎక్సే్ఛంజీలలో మార్చికల్లా అదే రోజు సెటిల్మెంట్కు తెరతీయనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవీ పురి బచ్ తాజాగా వెల్లడించారు. వెరసి 2024 మార్చి నుంచి టీప్లస్‌జీరో సెటిల్మెంట్ను ప్రవేశపెట్టనున్నట్లు పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) నిర్వహించిన ప్రపంచ ఆర్థిక విధానాల వేదిక 2023లో బచ్ పేర్కొన్నారు. ఈ బాటలో ఇప్పటికే సెబీ స్టాక్ లావాదేవీల సెటిల్మెంట్ గడువులను తగ్గిస్తూ వస్తోంది. దీంతో ప్రస్తుతం లావాదేవీ చేపట్టిన మరుసటి రోజు (టీప్లస్1) సెటిల్మెంట్ అమలవుతోంది. దీన్ని మరో 3 నెలల్లోగా ఒకే రోజుకు పరిమితం చేయనున్నట్లు బచ్ చెప్పారు. కాగా.. టీప్లస్‌జీరో సెటిల్మెంట్ అమలు తదుపరి అప్పటికప్పుడు(ఇన్‌స్టేనియస్) సెటిల్మెంట్ను తీసుకురానున్నట్లు వెల్లడించారు. అయితే ఇది ఆప్షనల్‌గా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. -
Madhabi Puri Buch: ఇక అదే రోజు సెటిల్మెంట్
ముంబై: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ రానున్న(2024) మార్చికల్లా స్టాక్ ఎక్సే్ఛంజీలలో నిర్వహించే లావాదేవీల సెటిల్మెంట్ను అదే రోజు పూర్తిచేసేందుకు వీలు కలి్పంచనుంది. ఇప్పటికే లావాదేవీ చేపట్టిన ఒక్క రోజులోనే(టీప్లస్ 1) సెటిల్మెంట్ పూర్తవుతోంది. అయితే మార్చికల్లా లావాదేవీ నిర్వహించిన రోజే(టీప్లస్0) సెటిల్మెంట్కు తెరతీసే లక్ష్యంతో ఉన్నట్లు సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బచ్ పేర్కొన్నారు. ఆపై మరో 12 నెలల్లోగా లావాదేవీ నమోదైన వెంటనే అప్పటికప్పుడు(ఇన్స్టెంట్) సెటిల్మెంట్కు వీలు కలి్పంచాలని భావిస్తున్నట్లు తెలియజేశారు. వెరసి రియల్‌టైమ్ ప్రాతిపదికన లావాదేవీల పూర్తిని చేపట్టాలని ఆశిస్తున్నట్లు సెబీ బోర్డు సమావేశం తదుపరి విలేకరుల సమావేశంలో మాధవి వెల్లడించారు. స్టాక్ మార్కెట్ లావాదేవీల ఇన్స్టెంట్ సెటిల్మెంట్ ఆలోచనపై మార్కెట్ మేకర్స్ నుంచి ఈ సందర్భంగా సలహాలు, సూచనలను ఆహా్వనిస్తున్నట్లు తెలియజేశారు. కొత్త సెటిల్మెంట్ను ప్రస్తుత సెటిల్మెంట్కు సమాంతరంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. కొత్త సెటిల్మెంట్ను ఐచ్ఛికంగా ఎంపిక చేసుకోవచ్చని మాధవి తెలిపారు. అయితే కొన్ని ఎంపిక చేసిన భారీ ప్రొడక్టులకు మాత్రమే అది కూడా ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటుందని వెల్లడించారు. ఈ ఏడాది జనవరి నుంచి స్టాక్ మార్కెట్ లావాదేవీల సెటిల్మెంట్ గడువును టీప్లస్ 2 నుంచి టీప్లస్ 1కు తగ్గించిన సంగతి తెలిసిందే. -
ఐపీవో అధిక వేల్యుయేషన్స్‌పై సెబీ దృష్టి
ముంబై: పబ్లిక్ ఇష్యూలకు సంబంధించి భారీ ప్రీమియంలు, అధిక వేల్యుయేషన్ల అంశాన్ని పరిశీలించనున్నట్లు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చీఫ్ మాధవి పురి బుచ్ తెలిపారు. పెద్దగా తెలియని కంపెనీలు కూడా ఇన్వెస్టర్లను ఆకర్షించేందుకు ఫేస్ వేల్యూను తక్కువగా చూపించి, షేరును మాత్రం భారీ ప్రీమియం రేటుకు ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఆమె వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు పబ్లిక్ ఇష్యూల టైమింగ్‌ను మార్కెట్‌కి వదిలేయాలన్నదే సెబీ ఉద్దేశమని మాధవి చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉన్నప్పుడే కంపెనీలు ఇష్యూకి వస్తాయని, ఎప్పుడు రావాలనేది సెబీ నిర్దేశించడమనేది ఇటు ఇన్వెస్టర్లు, అటు సంస్థకు ప్రయోజనకరంగా ఉండబోదని ఆమె పేర్కొన్నారు. -
నష్టాలొస్తున్నా ఫ్యూచర్స్ ట్రేడింగ్
ముంబై: ఫ్యూచర్స్, ఆప్షన్స్ విభాగంలో 90 శాతం మంది నష్టపోతున్నా.. ఇన్వెస్టర్లు మాత్రం డెరివేటివ్స్‌నే ఇష్టపడుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోందని మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ వ్యాఖ్యానించారు. ఇన్వెస్టర్లు దీర్ఘకాలిక దృష్టితో మదుపు చేయాలని, తద్వారా ద్రవ్యోల్బణాన్ని మించి రాబడులు అందుకోవడానికి అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు. బీఎస్ఈలో ఇన్వెస్టర్ రిస్క్ రిడక్షన్ యాక్సెస్ (ఐఆర్‌ఆర్‌ఏ) ప్లాట్‌ఫాంను ఆవిష్కరించిన సందర్భంగా బుచ్ ఈ విషయాలు తెలిపారు. సెబీ ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో ట్రేడింగ్ చేసిన 45.24 లక్షల మందిలో కేవలం 11 శాతం మంది మాత్రమే లాభాలు ఆర్జించినట్లు వెల్లడైందని ఆమె చెప్పారు. పరిస్థితులు తమకు అనుకూలంగా ఉండవని తెలిసీ చాలా మంది ఇన్వెస్టర్లు డెరివేటివ్స్‌పై బెట్టింగ్ చేస్తుండటమనేది తనకు కాస్త గందరగోళ వ్యవహారంగా అనిపిస్తుందని బుచ్ చెప్పారు. ప్రతిరోజూ ఎఫ్‌అండ్‌వో సెగ్మెంట్లో డబ్బులు పోగొట్టుకోవడం కన్నా పెట్టుబడుల విషయంలో దీర్ఘకాలికమైన, నిలకడైన వ్యూహాన్ని పాటించడం శ్రేయస్కరమని, తద్వారా సంపదను సృష్టించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆమె వివరించారు. ఐఆర్ఆర్ఏతో పొజిషన్ల స్క్వేర్ ఆఫ్.. బ్రోకరేజీ సిస్టమ్‌లో అంతరాయం ఏర్పడ్డ పక్షంలో ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్లను స్క్వేర్ ఆఫ్ చేసుకునేందుకు ఐఆర్‌ఆర్‌ఏ ప్లాట్‌ఫాం ఉపయోగపడుతుంది. పరిశ్రమ వర్గాల ప్రకారం బ్రోకరేజ్ సిస్టమ్ పనిచేయకపోతే ఐఆర్ఆర్ఏని డౌన్లోడ్ చేసుకునేందుకు ట్రేడర్‌కి ఎస్ఎంఎస్ వస్తుంది. దాన్ని ఉపయోగించుకుని రెండు గంటల వ్యవధిలోగా ట్రేడరు తమ ఓపెన్ పొజిషన్స్‌ను స్క్వేర్ ఆఫ్ చేసుకోవచ్చు. రూపాయి రికార్డ్ కనిష్టం డాలరుతో మారకంలో దేశీ కరెన్సీ చరిత్రాత్మక కనిష్టానికి చేరింది. ఇంటర్‌బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో డాలరుతో మారకంలో 12 పైసలు కోల్పోయి 83.38 వద్ద ముగిసింది. ఇది సరికొత్త కనిష్టంకాగా.. ఇంతక్రితం ఈ నెల 13న 83.33 వద్ద నిలవడం ద్వారా లైఫ్‌టైమ్ కనిష్టానికి చేరింది. కాగా.. వారాంతాన రూపాయి 83.26 వద్ద నిలవగా.. తాజాగా 83.25 వద్ద స్థిరంగా ప్రారంభమైంది. ఆపై బలహీనపడుతూ చివరికి 83.38కు చేరింది. అయితే ఆరు ప్రధాన కరెన్సీలతో మారకంలో డాలరు 0.4 శాతం నీరసించి 103.48 వద్ద కదులుతున్నప్పటికీ ముడిచమురు బలపడటం, విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు ప్రభావం చూపినట్లు ఫారెక్స్ వర్గాలు పేర్కొన్నాయి. లండన్ మార్కెట్లో బ్రెంట్ చమురు బ్యారల్ 0.75 శాతం పెరిగి 81.21 డాలర్లకు చేరింది. ఇక మరోవైపు ఈ నెల 10కల్లా దేశీ విదేశీ మారక నిల్వలు 46.2 కోట్ల డాలర్లు తగ్గి 590.32 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సహారా ఇష్యూ కొనసాగుతుంది
ముంబై: గ్రూప్ వ్యవస్థాపకుడు సుబ్రతా రాయ్ మరణించినప్పటికీ సహారా అంశం కొనసాగనున్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురి బుచ్ పేర్కొన్నారు. అనారోగ్య కారణాలతో 75ఏళ్ల రాయ్ మంగళవారం కన్ను మూసిన సంగతి తెలిసిందే. సహారా అంశం కంపెనీకి సంబంధించినదని, వ్యక్తులతో సంబంధం లేకుండా ఈ ఇష్యూ కొనసాగుతుందని తెలియజేశారు. ఫిక్కీ ఇక్కడ నిర్వహించిన ఒక సదస్సు సందర్భంగా విలేకరులకు బుచ్ ఈ విషయాలు వెల్లడించారు. సహారా ఇన్వెస్టర్లకు వాపసు చేయాల్సిన రూ. 25,000 కోట్లు సెబీ ప్రత్యేక ఖాతాల్లోనే ఉండగా, రాయ్ మరణించిన నేపథ్యంలో బుచ్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఆధారాలున్న ఇన్వెస్టర్ల క్లయిములకు అనుగుణంగా సుప్రీం కోర్టు నియమిత కమిటీ సొమ్ములు వాపసు చేస్తున్నట్లు బుచ్ తెలియజేశారు. వివరాల్లోకి వెడితే.. సహారా గ్రూప్‌లో భాగమైన సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్(ఎస్‌ఐఆర్‌ఈసీఏ), సహారా హౌసింగ్ కార్పొరేషన్ సంస్థలు .. ఓఎఫ్‌సీడీల (డిబెంచర్లు) ద్వారా 2007–08లో ఇన్వెస్టర్ల నుంచి నిధులను సేకరించడం వివాదాస్పదమైంది. దీనితో పోంజీ స్కీముల ఆరోపణల మీద సహారా గ్రూప్ 2010 నుంచి సమస్యల్లో చిక్కుకుంది. ఆపై 2014లో సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు రాయ్‌ను అరెస్ట్ చేశారు. గ్రూప్ కంపెనీలు రెండింటికి సంబంధించి ఇన్వెస్టర్లకు రూ. 20,000 కోట్లు వాపస్ చేయకపోవడంతోపాటు .. కోర్టుముందు హాజరుకావడంలో విఫలం చెందడంతో రాయ్ అరెస్ట్ అయ్యారు. తదుపరి రాయ్ బెయిల్ పొందినప్పటి కీ గ్రూప్ కంపెనీల సమస్యలు కొనసాగాయి. ఈ క్రమంలో ఇన్వెస్టర్లకు రిఫండ్ చేయడానికి, న్యాయస్థానం ఆదేశాల మేరకు సెబీ ప్రత్యేక ఖాతాల్లోకి సహారా గ్రూప్ రూ. 24,000 కోట్లు జమ చేసింది. -
ఫండ్స్‌కు కూడా త్వరలోనే టీప్లస్1
న్యూఢిల్లీ: మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణ సమయాన్ని ఒక్కరోజుకు తగ్గించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పూరి బుచ్ తెలిపారు. స్టాక్ మార్కెట్లో ఇప్పటికే నగదు విభాగంలో అన్ని రకాల స్క్రిప్‌లకు టీప్లస్1 వధానం అమలవుతున్న విషయాన్ని గుర్తు చేశారు. మ్యూచువల్ ఫండ్ యూనిట్లపై దీని ప్రభావం ఉంటుందన్నారు. ప్రస్తుతం మ్యూచువల్ ఫండ్స్‌లో యూనిట్ల కేటాయింపు, ఉపసంహరణకు టీప్లస్2 విధానం అమలవుతోంది. ట్రేడ్ చేసిన తర్వాత నుంచి రెండో రోజు ముగింపునే యూనిట్ల కేటాయింపు, లేదా నగదు జమ ప్రస్తుతం సాధ్యపడుతోంది. టీప్లస్ 1 అమల్లోకి వస్తే ట్రేడ్ చేసిన మరుసటి రోజే లావాదేవీ సెటిల్మెంట్ పూర్తవుతుంది. నిజానికి ఈ ఏడాది ఫిబ్రవరి ముందు వరకు టీప్లస్3 అమల్లో ఉండేది. ఈక్విటీలకు టీప్లస్1 అమల్లోకి వచి్చన వెంటనే, ఫండ్స్ టీప్లస్2కు మారాయి. మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ల ఉపసంహరణ కాలాన్ని తగ్గించడం వల్ల తమ అంచనా ప్రకారం ఇన్వెస్టర్లకు రూ.230 కోట్ల మేర ప్రయోజనం సమకూరిందని మాధురి తెలిపారు ప్రస్తుతానికి సెబీ ముందు ఆరు మ్యూచువల్ ఫండ్ దరఖాస్తులు అపరిష్కృతంగా ఉన్నట్టు వెల్లడించారు. నిబంధనలు వేగంగా అమలు.. పరిశ్రమ నిబంధనలను వేగంగా అమలు చేయడానికి పూర్తిగా కొత్త ఆర్కిటెక్చర్‌ను ప్రవేశపెట్డడాన్ని పరిశీలిస్తున్నట్టు సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. సెబీ ప్రకటించిన నిబంధన అమలు చాలా కష్టంగా ఉంటుందనే అభిప్రాయం భాగస్వాముల నుంచి వ్యక్తమవుతుండడంతో నూతన ఆర్కిటెక్చర్ఫై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇదొక రెగ్యులేటరీ శాండ్‌బాక్స్‌గా పేర్కొన్నారు. నిబంధనల అమలులో పరిశ్రమకు సహకారం అందించే మాదిరిగా ఉంటుందన్నారు. నిబంధనలను పాటించేందుకు కంపెనీలు రూ.వేల కోట్లు ఖర్చు చేయాలని సెబీ కోరుకోవడం లేదన్నారు. డీలిస్టింగ్ సులభతరం.. డీలిస్టింగ్ విధానాన్ని సమీక్షిస్తామని సెబీ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. దీనిపై సంప్రదింపుల పత్రాన్ని డిసెంబర్ నాటికి విడుదల చేస్తామని ప్రకటించారు.డీలిస్టింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడమే దీని ఉద్దేశ్యమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న రివర్స్ బుక్ బిల్డింగ్ విధానంపై ఆందోళనలు ఉన్నట్టు చెప్పారు. కంపెనీలో 10 శాతానికి పైగా వాటా కొనుగోలు చేయడం ద్వారా ఆపరేటర్లు రేట్లను పెంచి, కంపెనీలకు భారంగా మారుతున్నట్టు పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ ఆధ్వర్యంలోని కమిటీ ఈ అంశాన్ని అధ్యయనం చేస్తున్నట్టు చెప్పారు. డీలిస్టింగ్‌కు ఫిక్స్డ్ ధర విధానాన్ని తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. రివర్స్బుక్ బిల్డింగ్ విధానంలో వాటాదారులు తమకు నచి్చన ధరను కోట్ చేసుకునే స్వేచ్ఛ ఉంటుంది. ఫిన్‌ఫ్లూయెన్సర్స్ (ఆర్థికంగా ప్రభావితం చేసే వ్యక్తులు) పై సంప్రదింపుల పత్రాన్ని తీసుకువస్తామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. ఫిన్ఫ్లూయెన్సర్ను సెబీ నియంత్రించలేదని స్పష్టం చేశారు. వారు తమ వ్యక్తిగత హోదాలో చేసే సిఫారసులను భారతీయ చట్టాల కింద నిషేధించలేమని స్పష్టం చేశారు. కాకపోతే వీరితో ఎలాంటి లావాదేవీలు నిర్వహించకుండా స్టాక్ బ్రోకర్లు, మ్యూచువల్ ఫండ్స్‌ను నియంత్రించగలమన్నారు. తక్షణమే సెటిల్మెంట్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌ల్లో లావాదేవీ నమోదైన వెంటనే పరిష్కరించే సెటిల్మెంట్ విధానాన్ని (ఇన్స్టానియస్) తీసుకురావడమే తమ లక్ష్యమని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ తెలిపారు. ప్రస్తుతం దీనిపైనే దృష్టి పెట్టామని చెబుతూ.. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురావచ్చని సంకేతం ఇచ్చారు. నిజానికి సెబీ ఇటీవలే స్టాక్స్‌కు టీప్లస్1 సెటిల్మెంట్ను తీసుకొచి్చంది. నూతన విధానంలో దీన్ని మరింత తగ్గించనున్నట్టు తెలుస్తోంది. నూతన సెటిల్మెంట్ను అమలు చేసే విషయమై భాగస్వాములతో సంప్రదింపులు కొనసాగిస్తున్నామని సెబీ చైర్పర్సన్ తెలిపారు. క్యాపిటల్ మార్కెట్లలో సమయం ఎంతో ముఖ్యమని చెబుతూ.. ఆలస్యం అనేది ఆర్థిక వ్యవస్థలో ఉత్పాదకతపై ప్రభావం చూపుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. -
సెబీ కొత్త లోగో ఆవిష్కరణ
న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది. గణాంకాలు, టెక్నాలజీ, కన్సల్టేషన్, పార్టనర్షిప్ తదితరాల వినియోగం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో అత్యుత్తమ నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది. సంస్థకుగల అత్యుత్తమ సంప్రదాయాలు, డేటా, టెక్నాలజీ ఆధారిత కార్యాచరణ, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ, ఇన్వెస్టర్ల పరిరక్షణ కొత్త లోగోలో ప్రతిఫలిస్తున్నట్లు చైర్‌పర్శన్ మాధవి పురీ బచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెబీ 1988 ఏప్రిల్‌లో ఏర్పాటైంది. పరిశ్రమతో చర్చలు, భాగస్వామ్యం తదితరాలను చేపడుతూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది. -
సైబర్ దాడులను ఎదుర్కొనే కొత్త వ్యవస్థలు
బెంగళూరు: సైబర్ దాడులను అధిగమించే వ్యవస్థలను ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోందని, వచ్చే మార్చి నాటికి కొత్త వ్యవస్థ పనిచేయడం ప్రారంభిస్తుందని సెబీ చైర్పర్సన్ మాధవి పురి తెలిపారు. సైబర్ భద్రత విషయంలో ప్రతి ఒక్కరూ ఆందోళన చెందుతున్నట్టు ఆమె తెలిపారు. సంక్షోభం ఎదురైనప్పుడు దాన్ని అధిగమించే చక్కని ప్రణాళికను స్టాక్ ఎక్సే్ఛేంజ్‌లు, డిపాజిటరీలు కలిగి ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ‘‘ఏదో సాధారణ ప్రామాణిక విపత్తు రికవరీ ప్రణాళికలు అన్నవి కేవలం లొకేషన్ డౌన్‌టైమ్, హార్డ్‌వేర్, నెట్వర్క్ బ్రేక్‌డౌన్‌లనే పరిగణనలోకి తీసుకుంటాయి. సాఫ్ట్వేర్ బ్రేక్‌డౌన్, సమస్య విస్తరణను కాదు. సైబర్ దాడిలో సాఫ్ట్‌వేర్‌పైనే ప్రభావం పడుతుంది. దాంతో విపత్తు రికవరీ సైట్ కూడా ప్రభావానికి గురవుతుంది. దీనిపైనే మా ఆందోళన అంతా. అందుకే దేశంలోని రెండు పెద్ద స్టాక్ ఎకేŠస్ఛ్‌ంజ్‌లు అయిన ఎన్ఎస్ఈ, బీఎస్ఈ తగిన భద్రతా వ్యవస్థలను అమల్లో పెట్టేలా చర్యలను సెబీ తీసుకుంది’’అని మాధవి వివరించారు. ప్రస్తుతం ఈ పని పురోగతిలో ఉందంటూ, ఇది వచ్చే మార్చి నాటికి పనిచేయడం మొదలు పెడుతుందన్నారు. ‘‘ప్రతిపాదిత యంత్రాంగంలో ప్రతి క్లయింట్‌కు సంబంధించి అన్ని రకాల పొజిషన్లు, తనఖా తదితర వివరాలన్నీ ‘ఏ’ ఎక్సే్ఛేంజ్ (ఆన్లైన్)లో ఉంటాయి. ఈ డేటా అంతా కూడా వెళ్లి ఎక్సే్ఛేంజ్ ‘బీ’ లోని స్టోరేజ్ బాక్స్‌లో (డేటా సెంటర్) ఎప్పటికప్పుడు నిల్వ అవుతుంటుంది. ఒకవేళ ఎక్సే్ఛేంజ్ ఏ బ్రేక్‌డౌన్ అయితే, అది సాఫ్ట్వేర్ దాడి (సైబర్ దాడి) అని సెబీ నిర్ధారిస్తే.. అప్పుడు ఎక్సేంజ్ బీలో డేటా అప్లోడ్ అయ్యే బటన్‌ను సెబీ ప్రెస్ చేస్తుంది’’అని సెబీ చైర్పర్సన్ వివరించారు. -
స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నారా?
న్యూఢిల్లీ: పెట్టుబడుల విషయంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా ఉండాలని, తగినంత శ్రద్ధ చూపించాలని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ సూచించారు. మార్కెట్ వదంతుల ఆధారంగా పెట్టుబడులు పెట్టొద్దని హితవు పలికారు. సెబీ వద్ద నమోదైన మధ్యవర్తుల ద్వారానే వ్యవహారాలు నిర్వహించాలని కోరారు. వరల్డ్ ఇన్వెస్టర్స్ వీక్ (10 నుంచి 16వ తేదీ వరకు) సందర్భంగా సెబీ వెబ్సైట్లో తన సందేశాన్ని పోస్ట్ చేశారు. ఇన్వెస్టర్లు తమకుంటూ ఆర్థిక ప్రణాళిక రూపొందించుకుని, తమ ఆర్థిక లక్ష్యాలకు సరిపోలే పెట్టుబడి సాధనాలను ఎంపిక చేసుకోవాలని సూచించారు. క్రమం తప్పకుండా పొదుపు చేయడం, భిన్నమైన సాధనాల్లో ఇన్వెస్ట్ చేయడం ప్రాథమిక సూత్రాల్లో భాగమన్నారు. మన మార్కెట్ల విస్తృతి ఎంతో పెరిగిందని గుర్తు చేస్తూ.. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్టర్లలో పెద్ద ఎత్తున అవగాహన, రక్షణ గురించి తెలియజేయడం తప్పనిసరి అని బుచ్ పేర్కొన్నారు. పెట్టుబడుల ప్రక్రియలను సులభతరం చేశామని, అన్ని రకాల విషయాలను ఎప్పటికప్పుడు మార్కెట్లకు వెల్లడించేలా చేశామని చెప్పారు. -
ఐపీవో నిబంధనలు కఠినతరం
ముంబై: ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) నిబంధనలను కఠినతరం చేస్తూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిర్ణయం తీసుకుంది. ఏ అంశాల ప్రాతిపదికన ఆఫర్ ధరను నిర్ణయించారన్న వివరాలను ఆఫర్ డాక్యుమెంట్, ప్రైస్ బ్యాండ్ ప్రకటనల్లో ’ఇష్యూ ధరకు ప్రాతిపదిక’ సెక్షన్ కింద వెల్లడించడాన్ని తప్పనిసరి చేసింది. ఇష్యూయర్లు ఇందుకోసం గతంలో జరిపిన నిధుల సమీకరణ, లావాదేవీలను ప్రాతిపదికగా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి వాటితో పాటు కీలక పనితీరు సూచికలను (కేపీఐ) ముసాయిదా ప్రాస్పెక్టస్‌లో వివిధ సెక్షన్ల కింద ఇస్తున్నా.. ఆఫర్ డాక్యుమెంట్లలోని ఆర్థిక వివరాల సెక్షన్లలో ఉండటం లేదు. ఎటువంటి ట్రాక్ రికార్డు లేని కొత్త తరం కంపెనీలు పెద్ద యెత్తున ఐపీవోలకు వస్తుండటం, ఇన్వెస్టర్లు నష్టపోతుండటం జరుగుతున్న నేపథ్యంలో సెబీ శుక్రవారం బోర్డు సమావేశం సందర్భంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల విషయంలో తగు నిర్ణయాలు తీసుకునేందుకు ఇది దోహదపడగలదని సెబీ చైర్పర్సన్ మాధవి పురి బుచ్ పేర్కొన్నారు. అలాగే ఐపీవో యోచనలో ఉన్న కంపెనీలు ఆఫర్ డాక్యుమెంట్లను ’ప్రీ–ఫైలింగ్’ చేసే ప్రత్యామ్నాయ విధానాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదనకూ సెబీ ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ఇష్యూకి వచ్చే సంస్థలు తమ ఆఫర్ పత్రాలను బహిరంగ పర్చకుండా, ప్రాథమిక సమీక్ష కోసం సెబీ, స్టాక్ ఎక్సే్చంజీలకు అందించాల్సి ఉంటుంది. ప్రీ–ఫైలింగ్‌తో పాటు ప్రస్తుతం అమల్లో ఉన్న ప్రాసెసింగ్ విధానం కూడా ఇకపైనా కొనసాగుతుంది. మరిన్ని నిర్ణయాలు.. ► మ్యుచువల్ ఫండ్ యూనిట్ల కొనుగోలు, విక్రయాలను ఇన్సైడర్ ట్రేడింగ్ నిబంధనల పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనకు ఆమోదం. ప్రస్తుతం ఈ నిబంధనలు లిస్టెడ్ కంపెనీలు లేదా లిస్ట్ కాబోతున్న సంస్థలకు మాత్రమే వర్తిస్తున్నాయి. ► మ్యుచువల్ ఫండ్ సబ్స్క్రిప్షన్ లావాదేవీలకు కూడా రెండంచెల ధృవీకరణను సెబీ తప్పనిస రి చేసింది. ఇది 2023 ఏప్రిల్ 1 నుంచి అమ ల్లోకి వస్తుంది. ప్రస్తుతం యూనిట్ల విక్రయ సమయంలో ఆన్లైన్ లావాదేవీలకు టూ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను, ఆఫ్‌లైన్ లావాదేవీలకు సంతకం విధానాన్ని అనుసరిస్తున్నారు. ► ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) విషయంలో నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు సంబంధించి కనీస షేర్‌హోల్డింగ్ నిబంధనను తొలగించింది. ప్రస్తుతం కనీసం 10 శాతం వాటా, కనిష్టంగా రూ. 25 కోట్ల విలువైన షేర్లను విక్రయిస్తున్న పక్షంలోనే నాన్–ప్రమోటర్ షేర్హోల్డర్లకు ఓఎఫ్ఎస్లో పాల్గొనే వీలుంటోంది. ► పోర్ట్‌ఫోలియో మేనేజర్లు తమ క్లయింట్ల నిధులు, షేర్ల నిర్వహణకు సంబంధించి వివిధ టీమ్‌లు పోషించే పాత్రలు, బాధ్యతలు అలాగే రిస్కు నిర్వహణ విధానాలు మొదలైనవి రాతపూర్వకంగా ఉంచాలి. ► స్వతంత్ర డైరెక్టర్ల నియామకాలు, తొలగింపునకు కొత్త నిబంధనలను సెబీ ఆమోదించింది. వీటి ప్రకారం నియామకం లేదా తొలగింపునకు సాధారణ తీర్మానం, మైనారిటీ షేర్‌హోల్డర్ల మెజారిటీ తీర్మానం అంటూ రెండు పరామితులు ఉంటాయి. ► ప్రభుత్వ రంగ సంస్థల (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌కి సంబంధించి ఓపెన్ ఆఫర్ ధర లెక్కింపు విధానంలో మార్పులు చేశారు. వీటి ప్రకారం రేటును లెక్కించేందుకు గత 60 ట్రేడింగ్ రోజుల వాల్యూమ్ వెయిటెడ్ సగటు మార్కెట్ రేటు (వీడబ్ల్యూఏఎంపీ)ను ప్రాతిపదికగా తీసుకోవాలన్న నిబంధనను తొలగించారు. ► క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు.. పరిశ్రమల వర్గీకరణ కోసం ప్రామాణిక విధానాన్ని పాటించాలన్న ఆదేశాల అమలుకు డెడ్‌లైన్‌ను సెబీ రెండు నెలల పాటు నవంబర్ 30 వరకూ వాయిదా వేసింది. -
సెకండరీ మార్కెట్లోనూ అస్బా
ముంబై: సెకండరీ మార్కెట్ లావాదేవీల్లోనూ ఏఎస్బీఏ(అస్బా) తరహా సౌకర్యాలకు తెరతీసే యోచనలో ఉన్నట్లు క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ తాజాగా పేర్కొన్నారు. ప్రైమరీ మార్కెట్‌కు ఇదెంతో ప్రయోజనకారిగా ఉన్నప్పుడు సెకండరీ మార్కెట్లోనూ ఎందుకు ప్రవేశపెట్టకూడదంటూ ప్రశ్నించారు. అప్లికేషన్‌కు మద్దతుగా బ్యాంక్ ఖాతాలో ఇన్వెస్టర్ సొమ్ము తాత్కాలిక నిలుపుదల చేసే అస్బా తరహా సౌకర్యాలను సెకండరీ మార్కెట్లోనూ ప్రవేశపెట్టేందుకు ప్రస్తుతం కసరత్తు జరుగుతున్నట్లు గ్లోబల్ ఫిన్‌టెక్ ఫెస్ట్‌కు హాజరైన మాధవీ పురీ వెల్లడించారు. అస్బాలో భాగంగా ఐపీవోకు దరఖాస్తు చేసే ఇన్వెస్టర్లకు షేర్ల కేటాయింపు జరిగాకే సొమ్ము బ్యాంకు ఖాతా నుంచి బదిలీ అయ్యే సంగతి తెలిసిందే. ప్రస్తుతం సెకండరీ మార్కెట్ లావాదేవీల్లో ఇన్వెస్టర్ల సొమ్ము బ్రోకర్లవద్ద ఉంటున్నదని, అస్బా తరహా సౌకర్యముంటే ఇందుకు తెరపడుతుందని తెలియజేశారు. లోపాలకు చెక్ సెకండరీ మార్కెట్లో వ్యవస్థాగత లోపాలను తగ్గించే లక్ష్యంతో అస్బా ఆలోచనకు తెరతీసినట్లు మాధవీ పురీ వెల్లడించారు. ఫిన్‌టెక్ సంస్థలను తమ వ్యాపార విధానాల(బిజినెస్ మోడల్)లో ఇలాంటి వాటికి తావీయకుండా చూడాలంటూ ఈ సందర్భంగా సూచించారు. లోపాలకు ఆస్కారమిస్తే నియంత్రణ సంస్థల చర్యలకు లోనుకావలసి వస్తుందని హెచ్చరించారు. ఆడిటెడ్ లేదా వేలిడేటెడ్కాని బ్లాక్ బాక్స్తరహా బిజినెస్ మోడళ్లను అనుమతించబోమంటూ స్పష్టం చేశారు. -
ఐపీవో ధరల్ని నిర్ణయించడం సెబీ పని కాదు
ముంబై: ఆధునికతరం(న్యూఏజ్) టెక్నాలజీ కంపెనీలు పబ్లిక్ ఇష్యూలను చేపట్టే విషయంలో ధరల నిర్ణయంపై సెబీ ప్రభావం ఉండబోదని క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ చైర్‌పర్శన్ మాధవీ పురీ బచ్ పేర్కొన్నారు. ఇది తమ బాధ్యత కాదని స్పష్టం చేశారు. అయితే ఇలాంటి ఇష్యూలకు సంబంధించి ఏవైనా ఆందోళనలుంటే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్లు బాధ్యత తీసుకోవచ్చని తెలియజేశారు. ఐపీవో చేపట్టదలచిన స్టార్టప్‌లు కంపెనీ విలువలో ఏర్పడిన మార్పులు తదితర కొన్ని భవిష్యత్ అంశాలను వెల్లడించేందుకు సిద్ధపడాలని సూచించారు. ఐపీవోకు ముందు షేర్ల జారీ, ఐపీవోకు ఆశిస్తున్న ధర వ్యత్యాసం వంటి అంశాలను వివరించవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. ప్రధానంగా ఐపీవోకు ఏ ధరను ఆశిస్తున్నారో అది మీ బిజినెస్‌ను ప్రతిబింబించాలని విశ్లేషించారు. పలు మార్పులు న్యూటెక్ కంపెనీల ఐపీవో ధరల నిర్ణయంలో పలు మార్పులు చోటు చేసుకున్నట్లు బచ్ తెలియజేశారు. న్యూఏజ్ టెక్ కంపెనీల ఐపీవో ధరలను నిర్ణయించడం తమ బిజినెస్‌కాదంటూనే సంస్థలు తమ బిజినెస్ ఆధారంగా స్వేచ్చగా నిర్ణయం తీసుకోవచ్చని సూచించారు. గతంలో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్‌గా పనిచేసిన బచ్ పరిశ్రమల సమాఖ్య ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ప్రసంగించారు. ఇటీవల స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ చేపట్టిన పేమెంట్ ప్లాట్‌ఫామ్ పేటీఎమ్ షేరు ఐపీవో ధరతో పోలిస్తే మూడోవంతుకు పతనమైన విషయం విదితమే. దీంతో ఇన్వెస్టర్లు న్యూఏజ్ టెక్ కంపెనీల ఐపీవోలకు అధిక ధరల నిర్ణయంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కొద్ది రోజులుగా మరికొన్ని న్యూఏజ్ కంపెనీల షేర్లు సైతం ఐపీవో ధరలతో పోలిస్తే పతన బాటలో సాగుతున్నాయి. ఈ నేప థ్యంలో సెబీ చైర్‌పర్శన్ బచ్ వ్యాఖ్యలకు ప్రాధా న్యత ఏర్పడినట్లు నిపుణులు తెలియజేశారు. -
సెబీ తొలి మహిళా ఛైర్మన్‌కు కరోనా: ఆర్థికమంత్రి సీతారామన్ స్పందన
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా సెబీ చైర్పర్సన్ మాధవి పూరీ బుచ్కి కరోనా సోకింది. సెబీ తొలి మహిళా ఛైర్మన్‌గా మాజీ ఐసిఐసిఐ బ్యాంకర్, మాధవి పూరి బుచ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమితులయ్యారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాల శాఖ, సెబీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఇండియాస్ ఎకనామిక్ జర్నీ@75' కార్యక్రమానికి బుచ్ హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా సోకిన కారణంగా ఆమె ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో బుచ్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్ 'నెట్రా (న్యూ ఇ-ట్రాకింగ్ అండ్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్)' పోర్టల్ ఇండియన్ డెవలప్మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ (ఐడియాస్) మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు. కాగా దేశంలో దాదాపు మూడు నెలల తరువాత కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 5, 233 కొత్త కేసులు నమోదు కాగా 7 మరణాలు సంభవించాయి.