సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే పలు రంగాలకు చెందిన సెలబ్రిటీలు, సాధారణ ప్రజలు కోవిడ్ బారిన పడ్డారు. తాజాగా సెబీ చైర్‌పర్సన్ మాధవి పూరీ బుచ్‌కి కరోనా సోకింది. సెబీ తొలి మహిళా ఛైర్మన్‌గా మాజీ ఐసిఐసిఐ బ్యాంకర్, మాధవి పూరి బుచ్ ఈ ఏడాది ఫిబ్రవరిలో నియమితులయ్యారు.
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఐకానిక్ వారోత్సవాల్లో భాగంగా ఆర్థిక వ్యవహారాల శాఖ, సెబీ సంయుక్తంగా నిర్వహిస్తున్న 'ఇండియాస్ ఎకనామిక్ జర్నీ@75' కార్యక్రమానికి బుచ్ హాజరు కావాల్సి ఉంది. కానీ కరోనా సోకిన కారణంగా ఆమె ఈ కార్యక్రమానికి రాలేకపోయారు. దీంతో బుచ్ కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాలా సీతారామన్ 'నెట్రా (న్యూ ఇ-ట్రాకింగ్ అండ్ రిమోట్ అడ్మినిస్ట్రేషన్)' పోర్టల్ ఇండియన్ డెవలప్‌మెంట్ అండ్ ఎకనామిక్ అసిస్టెన్స్ స్కీమ్ (ఐడియాస్) మొబైల్ అప్లికేషన్‌ను ప్రారంభించారు.
కాగా దేశంలో దాదాపు మూడు నెలల తరువాత కరోనా వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య వేగంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 5, 233 కొత్త కేసులు నమోదు కాగా 7 మరణాలు సంభవించాయి.
Comments
Please login to add a commentAdd a comment