‘బహిరంగ విచారణ జరగాలి’ | Hindenburg Sought A Transparent Public Investigation Into Funds Of SEBI Chief, Check Out The Details | Sakshi
Sakshi News home page

Hindenburg Row: ‘బహిరంగ విచారణ జరగాలి’

Published Mon, Aug 12 2024 9:58 AM | Last Updated on Mon, Aug 12 2024 10:42 AM

Hindenburg sought a transparent public investigation into funds of sebi chief

సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌, తన భర్త ధవల్‌ బచ్‌ల పెట్టుబడులపై పారదర్శకంగా, బహిరంగ విచారణ జరగాలని హిండెన్‌బర్గ్ రీసెర్చ్ కోరింది. బెర్ముడా, మారిషస్‌లోని డొల్ల కంపెనీల ద్వారా అదానీ సంస్థల్లో పెట్టుబడిపెట్టి కృత్రిమంగా వాటి విలువను పెంచారని ప్రధానంగా హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది. దానిపై సెబీ చీఫ్‌ ఇటీవల స్పందిస్తూ హిండెన్‌బర్గ్‌ ఆరోపణలు నిరాధారమైనవని కొట్టిపారేసింది. భర్తతోకలిసి షోకాజు నోటీసులు జారీ చేసింది.

ఈ వ్యవహారంపై హిండెన్‌బర్గ్‌ తన ఎక్స్‌ ఖాతాలో తాజాగా కొన్ని కీలక అంశాలను లేవనెత్తింది.

సెబీ చీఫ్ మాధబి పురి బచ్‌, ఆమె భర్త ధవల్ బచ్ 10 ఆగస్టు 2024న విడుదల చేసిన ప్రకటన ప్రకారం..2015లో మాధబి దంపతులు సింగపూర్‌లో నివసించారు. సెబీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఆమె హోల్‌ టైమ్‌ మెంబర్‌గా ఉండేవారు. ఆ సమయంలోనే తన భర్త చిన్ననాటి స్నేహితుడైన అనిల్ అహుజా అనే చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌ ద్వారా ఇన్వెస్టింగ్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. దీన్ని హైలెట్‌ చేస్తూ బచ్‌ పెట్టుబడులను బహిరంగంగానే నిర్ధారిస్తున్నారని హిండెన్‌బర్గ్‌ చెప్పుకొచ్చింది. ఇలా బచ్‌ ఇన్వెస్ట్‌మెంట్లపై తమ ఒరిజినల్‌ నివేదికలోనూ తెలిపామని హిండెన్‌బర్గ్‌ తన ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది.

ఇదీ చదవండి: మెరుగైన సమాచార లభ్యతపై దృష్టి

మాధబి స్థాపించిన రెండు కన్సల్టింగ్ కంపెనీల్లో తాను 2017లో సెబీలో చేరిన తర్వాత కార్యకలాపాలు నిలిచిపోయాయని హిండెన్‌బర్గ్‌ తెలిపింది. తర్వాత ఆమె భర్త 2019 నుంచి వాటిని నిర్వహిస్తున్నట్లు చెప్పింది. అగోరా అడ్వైజరీ లిమిటెడ్‌(ఇండియా) అనే సంస్థలో తాజా షేర్ హోల్డింగ్ జాబితా ప్రకారం మార్చి 31, 2024 నాటికి మాధబి 99 శాతం వాటా కలిగి ఉన్నారని పేర్కొంది. ఇప్పటికీ ఆ సంస్థ కన్సల్టింగ్ ఆదాయాన్ని సృష్టిస్తోందని చెప్పింది. సింగపూర్ రికార్డుల ప్రకారం మార్చి 16, 2022 వరకు బచ్ ‘అగోరా పార్ట్‌నర్స్ సింగపూర్‌’లో 100 శాతం వాటాదారుగా కొనసాగారని తెలిపింది. సెబీ ఛైర్‌పర్సన్‌గా నియమితులైన రెండు వారాల తర్వాత ఆమె షేర్లను తన భర్త పేరుకు బదిలీ చేసిందని హిండెన్‌బర్గ్‌ ఆరోపించింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement