న్యూఢిల్లీ: క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ 35వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కొత్త లోగోను ఆవిష్కరించింది. సెబీ మాజీ చైర్మన్‌సహా ప్రస్తుత, మాజీ పూర్తికాల సభ్యుల సమక్షంలో సరికొత్త లోగోను విడుదల చేసింది. గణాంకాలు, టెక్నాలజీ, కన్సల్టేషన్, పార్టనర్‌షిప్ తదితరాల వినియోగం ద్వారా సెక్యూరిటీల మార్కెట్లో అత్యుత్తమ నిర్వహణను కొనసాగిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో పేర్కొంది.
సంస్థకుగల అత్యుత్తమ సంప్రదాయాలు, డేటా, టెక్నాలజీ ఆధారిత కార్యాచరణ, సెక్యూరిటీ మార్కెట్ల అభివృద్ధి, నియంత్రణ, ఇన్వెస్టర్ల పరిరక్షణ కొత్త లోగోలో ప్రతిఫలిస్తున్నట్లు చైర్‌పర్శన్ మాధవి పురీ బచ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. సెబీ 1988 ఏప్రిల్‌లో ఏర్పాటైంది. పరిశ్రమతో చర్చలు, భాగస్వామ్యం తదితరాలను చేపడుతూ సత్సంప్రదాయాలను పాటిస్తున్నట్లు సెబీ ఒక ప్రకటనలో తెలియజేసింది.
Comments
Please login to add a commentAdd a comment