సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే | Tuhin Kanta Pandey appointed as the new chairman of SEBI succeeding Madhabi Puri Buch | Sakshi
Sakshi News home page

సెబీ కొత్త చీఫ్‌గా తుహిన్ కాంత పాండే

Published Fri, Feb 28 2025 8:54 AM | Last Updated on Fri, Feb 28 2025 8:55 AM

Tuhin Kanta Pandey appointed as the new chairman of SEBI succeeding Madhabi Puri Buch

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) 11వ ఛైర్మన్‌గా మాదబిపురీ బుచ్ స్థానంలో తుహిన్ కాంత పాండే నియమితులయ్యారు. మార్చి 1 నుంచి తాను సెబీ చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఒడిశా కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన ఆయన గతంలో ఆర్థిక కార్యదర్శిగా, రెవెన్యూ కార్యదర్శిగా పనిచేశారు. ఎయిరిండియా ప్రైవేటీకరణలో పాండే కీలక పాత్ర పోషించారు. తుహిన్ కాంత పాండేకు ఫైనాన్స్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్‌లో విస్తృత అనుభవం ఉంది.

తుహిన్ కాంత పాండే అనుభవం

ఆర్థిక కార్యదర్శి: భారత ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన ఆయన వివిధ ఆర్థిక సంస్కరణలు, విధానాల్లో కీలక పాత్ర పోషించారు.

రెవెన్యూ కార్యదర్శి: దేశ రెవెన్యూ వసూళ్లు, పన్ను విధానాలను పర్యవేక్షించే రెవెన్యూ కార్యదర్శి పదవిని కూడా పాండే నిర్వహించారు.

ఎయిరిండియా ప్రైవేటీకరణ: భారతదేశ ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణ కార్యక్రమంలో ముఖ్యమైన ఎయిరిండియా ప్రైవేటీకరణలో కీలక పాత్ర పోషించారు.

పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నిర్వహణ: పాండే తన కెరీర్ అంతటా ప్రభుత్వ సంస్థలు, వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణల నిర్వహణలో నిమగ్నమయ్యారు. అనేక ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థల పునర్నిర్మాణం, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడ్డారు.

ఇదీ చదవండి: రూ.10 లక్షల పెట్టుబడితో ‘సిఫ్‌’

ముందున్న సవాళ్లు..

కొత్త సెబీ ఛైర్మన్ పాండే రెగ్యులేటరీ ఫ్రేమ్ వర్క్, మార్కెట్ సమగ్రతను పెంపొందించడానికి పలు కీలక రంగాలపై దృష్టి సారించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

విజిలెన్స్‌ను బలోపేతం చేయడం: మార్కెట్ మానిప్యులేషన్, ఇన్ సైడర్ ట్రేడింగ్‌(అనధికారికంగా ముందుగానే కంపెనీలోని కీలక సమాచారాన్ని తెలుసుకుని తర్వాత షేర్లు పెరిగాక తిరిగి విక్రయించి లాభపడడం)ను గుర్తించడానికి, వాటిని నిరోధించడానికి పాండే మార్కెట్ నిఘా యంత్రాంగాలను పెంచే అవకాశం ఉంది.

ఇన్వెస్టర్ ప్రొటెక్షన్: కఠినమైన నిబంధనలు, పకడ్బందీ ఆర్థిక విధానల ద్వారా పారదర్శకతతో ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించాలి.

డిజిటల్ సహకారం: నియంత్రణ ప్రక్రియలను క్రమబద్ధీకరించడానికి, మార్కెట్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి సాంకేతికత, డిజిటల్ వేదికల వాడకాన్ని ప్రోత్సహించాల్సి ఉంది.

కార్పొరేట్ గవర్నెన్స్: లిస్టెడ్ కంపెనీల్లో తమ కార్యకలాపాలపై జవాబుదారీతనాన్ని మెరుగుపరిచేందుకు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను బలోపేతం చేయాలి.

సుస్థిర ఆర్థిక విధానాలు: ప్రపంచ పర్యావరణ లక్ష్యాలకు అనుగుణంగా సుస్థిర ఆర్థిక కార్యక్రమాలు, హరిత పెట్టుబడులను ప్రోత్సహించడం.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement