
ప్రముఖ మెసేజింగ్ టూల్ హాట్ మెయిల్ సహ వ్యవస్థాపకుడు సబీర్ భాటియా ఇటీవల భారతదేశ ఇంజినీరింగ్ వ్యవస్థ గురించి, ఆవిష్కరణల సామర్థ్యం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత ఆవిష్కరణలో చైనా సాధించిన విజయాలతో సరితూగే భారతదేశ సామర్థ్యానికి ఆటంకాలు ఎదురవుతున్నాయని చెప్పారు. చాలా మంది భారతీయ ఇంజినీర్లు కొత్త సాంకేతికత సృష్టించడానికి బదులుగా వాటి నిర్వహణ వైపు మొగ్గు చూపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
99 శాతం భారతీయ ఇంజినీర్లు అపార జ్ఞానాన్ని కలిగి ఉన్నట్లు తెలిపారు. కానీ చాలావరకు స్పష్టమైన ఉత్పత్తులను సృష్టించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆలోచించలేకపోతున్నట్లు చెప్పారు. ఈ మనస్తత్వం మెరుగైన ఆవిష్కరణలను ప్రోత్సహించే భారతదేశ సామర్థ్యాన్ని అణచివేస్తుందని అభిప్రాయపడ్డారు. ఒరిజినల్ సాఫ్ట్‌వేర్ సృష్టి కంటే ఔట్ సోర్సింగ్‌పై దృష్టి సారించే వ్యాపారవేత్తలపై భారత్ ప్రశంసలు కురిపించడం విడ్డూరంగా ఉందన్నారు. క్రిటికల్ థింకింగ్, ప్రాక్టికల్ స్కిల్స్‌ను ప్రోత్సహించేందుకు భారత్ తన విద్యావ్యవస్థను సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని భాటియా వ్యాఖ్యానించారు. దీన్ని చైనా సమ్మిళిత విద్యా విధానాలతో పోల్చారు. ఇది సృజనాత్మకత, మౌలిక సదుపాయాల అభివృద్ధిలో వారి విజయానికి దోహదపడిందని తెలిపారు.
ఇదీ చదవండి: గోల్డెన్ ఛాన్స్! తగ్గిన బంగారం ధర.. ఎంతంటే..
ఇంజినీరింగ్ విద్య, వర్క్ కల్చర్ విషయంలో భారత్ పునరాలోచించుకోవాలని భాటియా పిలుపునిచ్చాయి. సాంకేతిక నైపుణ్యాలకు విలువనివ్వడం, సృజనాత్మకత వృద్ధి చెందేలా తగిన వాతావరణాన్ని పెంపొందించడంపై దృష్టి సారించాలని సూచించారు.