
కడప వైఎస్సార్ సర్కిల్: సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా రామకృష్ణ మరోసారి ఎన్నికయ్యారు. సోమవారం వైఎస్సార్ జిల్లా కడపలో సీపీఐ 26వ రాష్ట్ర మహసభల సందర్భంగా జెడ్పీ సమావేశ మందిరంలో రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా ఈశ్వరయ్య ఎన్నికయ్యారు.
అలాగే ప్రజా సమస్యలపై కూడా పలు తీర్మానాలు చేశారు. రామకృష్ణ రెండోసారి రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికైన సందర్భంగా ఆయనకు సీపీఐ జాతీయ నేతలతో పాటు పలువురు నాయకులు అభినందనలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment