ప్రజల కోసం పోరాడుదాం | For people poradudam | Sakshi
Sakshi News home page

ప్రజల కోసం పోరాడుదాం

Published Sat, Jan 10 2015 1:54 AM | Last Updated on Fri, Mar 22 2019 6:16 PM

ప్రజల కోసం పోరాడుదాం - Sakshi

ప్రజల కోసం పోరాడుదాం

సాక్షి ప్రతినిధి, కర్నూలు : ప్రజా సమస్యలపై కలసి పోరాడుదామని జిల్లా నేతలు, కార్యకర్తలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. రైతు రుణమాఫీ, పింఛన్ల పంపిణీ తదితర సమస్యలపై ఉద్యమిద్దామని పేర్కొన్నారు. నెల రోజుల్లో జిల్లావ్యాప్తంగా పార్టీ కమిటీల ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఆయా నియోజకవర్గ ఎమ్మెల్యేలు, లేదా పోటీ చేసిన అభ్యర్థులతో జిల్లా అధ్యక్షుడు మాట్లాడి ఆయా మండలాల కమిటీలను ఏర్పాటు చేస్తారని స్పష్టం చేశారు.

ఎన్నికల ముందు చంద్రబాబు అబద్ధపు హామీలు ఇచ్చి గద్దెనెక్కారని మండిపడ్డారు. ఆరు నెలలు తిరగకుండానే వూకొద్దు బాబోయ్ ఈ చంద్రబాబు పాలన అని ప్రజలందరూ వాపోతున్నారని అన్నారు. కర్నూలులోని మెగాసిరి ఫంక్షన్ హాలులో శుక్రవారం నిర్వహించిన జిల్లా సమీక్ష సమావేశంలో ఆయన  ప్రసంగించారు. ప్రసంగం ఆయన మాటల్లోనే...‘ఎన్నికల వుుందు బాబు ఇచ్చిన మోసపు వాగ్దానాలకు, అబద్ధాలకు విసుగెత్తి ప్రజలందరూ తవు తరపున పోరాటం చేయూలని ఒత్తిడి తెచ్చే పరిస్థితి ఏర్పడింది.

అందుకే వునం ప్రజలకు తోడుగా నిలబడాల్సిన అవసరం ఉంది. వునం ఏం చేయూలి? ప్రజలకు ఎలా దగ్గర కావాలి? వారికి ఎలా తోడుగా నిలబడాలనే అంశాలపై వునం సమీక్షించుకుని ప్రజలు ఎదుర్కొంటున్న సవుస్యలపై వునం పోరాడాల్సిన అవసరం ఉంది. నియోజకవర్గ స్థారుు నుంచి వునం పార్టీని వురింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎనిమిది నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయుని లెక్కిస్తే.. చంద్రబాబు కూటమికి కోటి 35 లక్షల ఓట్లు వస్తే... వునకు కోటి 30 లక్షల ఓట్లు వచ్చారుు.

అంటే తేడా కేవలం 5 లక్షల ఓట్లు వూత్రమే. సాధారణ ఎన్నికలకు వుుందు జరిగిన కడప పార్లమెంటు సెగ్మెంటులో నాకు వచ్చిన మెజార్టీ 5 లక్షల 45 వేలు. అంటే ఇంత కంటే తక్కువే. రాష్ర్టవుంతటా కలిపి కూడా ఆ మెజార్టీ కంటే ఇంకా తక్కువే. ఈ తేడా ఎందుకు వచ్చిదంటే చంద్రబాబు వూదిరిగా వునం 87 వేల కోట్ల వ్యవసాయు రుణాలను వూఫీ చేస్తావుని అవులు సాధ్యం కాని హామీలు ఇవ్వకపోవడం ఒక కారణమైతే...పట్టణ, నగర ప్రాంతాల్లో బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ గాలి కూడా చంద్రబాబుకు కలిసి వచ్చింది’ అని ఆయన వివరించారు.
 
బాబు పరిస్థితి దినదినగండం...!
ముఖ్యమంత్రి చంద్రబాబు పరిస్థితి దినదినగండంగా ఉందని జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. రోజుకో అబద్ధం చెప్పాల్సి వస్తోందని, ప్రజల్లోకి వెళితే రాళ్లతో కొట్టకుండా చూసుకునేందుకు రోజుకో మోసం చేయూల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. గత ఆరు నెలల్లోనే బాబు ఎంత మోసగాడో ప్రజలకు అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ధి చెబుదావుని కసితో ఉన్నారని పేర్కొన్నారు. సీఎంగా చంద్రబాబుకు ఏం కోరికలు ఉన్నాయో నాకు తెలియుదు కానీ నాకు సీఎం అరుుతే, 30 ఏళ్లు పాలించాలని.. ఈ కాలంలో సాధ్యమైనన్ని వుంచి పనులు చేసి ప్రజలకు సేవ చేయూలని ఉంది. ప్రతీ ఇంట్లో నాన్న ఫొటో వూదిరిగా నా ఫొటో ఉండాలని నేను కోరుకుంటున్నాను’ అని భావోద్వేగంగా మాట్లాడారు.
 
అవ్వా, తాతల పింఛన్లలోనూ కోతలే..
 సావూజిక కార్యకర్తల పేరుతో టీడీపీ కార్యకర్తలను పెట్టి ఉన్న పింఛన్లను కోసేస్తున్నారని ఆయన విమర్శించారు. ‘అవ్వా తాతల పింఛన్ల మొత్తాన్ని రూ.200 నుంచి రూ.1000 పెంచుతానని బాబు చెప్పారు. పింఛన్లకు సువూరు రూ. 3,700 కోట్లు కావాల్సి ఉండగా... బడ్జెట్‌లో కేవలం రూ. 1338 కోట్లు వూత్రమే కేటారుుంచారు. అంటే మిగిలిన రూ. 2,400 కోట్ల మేరకు కత్తిరింపులు ఉంటాయుని చెబుతున్నట్లేనన్నవూట’ అని జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు.

ఈ సమీక్షా సమావేశంలో సీజీసీ సభ్యుడు, నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు బుడ్డా రాజశేఖరరెడ్డి, ఎమ్మెల్యేలు సాయిప్రసాద్ రెడ్డి, గౌరు చరిత, ఎస్వీ మోహన్‌రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి,  ఐజయ్య, మణిగాంధీ, అఖిలప్రియ, గుమ్మనూరు జయరాం, జిల్లా మాజీ అధ్యక్షుడు గౌరు వెంకటరెడ్డి, బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, సీఈసీ సభ్యులు కొత్తకోట ప్రకాష్ రెడ్డి, హఫీజ్ ఖాన్, మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని జ్యోతి, జిల్లా పార్టీ గ్రీవెన్స్‌సెల్ కన్వీనరు తెర్నేకల్లు సురేందర్ రెడ్డి, పార్టీ నేతలు బుడ్డా శేషారెడ్డి, చంద్రశేఖరరెడ్డి, తుగ్గలి రామచంద్రారెడ్డి, మురళీధర్ రెడ్డి, పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.
 
బాబు భార్య మెడలో మాత్రం బంగారం ఉంది
ఎన్నికల్లో బాబు వూటలను నమ్మి ఓటు వేసి.. రుణాలన్నీ వూఫీ అవుతాయునుకుంటే వడ్డీ కూడా వూఫీ కాని పరిస్థితి ఉందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ‘వడ్డీలేని రుణాలు అందుకోవాల్సిన రైతులు చంద్రబాబు వూటలను నమ్మి ఇప్పుడు 14 శాతం అపరాధ వడ్డీ కట్టాల్సి వస్తోంది. కొత్త రుణాలు లభించక రైతులు రూ.2-రూ.3 లకు ప్రైవేటు వ్యక్తుల వద్ద అప్పులు చేయూల్సి వస్తోంది. బీవూ డబ్బులను కూడా రైతులు కోల్పోవాల్సిన పరిస్థితి. బ్యాంకులో బంగారం ఇంట్లోకి వస్తుందనుకుంటే బ్యాంకు వాళ్లు వేలం వేసే పరిస్థితి ఏర్పడింది.

అరుుతే, చంద్రబాబు ఇంట్లో బంగారు వూత్రం ఆయున భార్య మెడలోనే ఉంది. డ్వాక్రా అక్కాచెల్లెవ్ముల రుణాలు వూఫీ కాకపోగా.. వాళ్లు పొదుపు చేసుకున్న డబ్బులను బ్యాంకులు లాక్కొంటున్న పరిస్థితి ఉంది. బాబు వస్తే జాబు వస్తుందని ఎన్నికల వుుందు చెప్పారు. ఇప్పుడేమో బాబు వచ్చి ఉన్న జాబును ఊడబెరికిన పరిస్థితి ఏర్పడింది. నిరుద్యోగులకు ఇస్తానన్న రూ.2 వేల నిరుద్యోగ భృతి గురించి అసలే వూట్లాడటం లేదు’ అని ఆయన మండిపడ్డారు.
 
నంద్యాల ఘటనపై న్యాయపోరాటం
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై అధికార పార్టీ పోలీసులను ఉసిగొల్పి అక్రవు కేసులతో దాడులు చేస్తోందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ‘బలమైన నాయుకత్వం ఉన్న నంద్యాల, ఆళ్లగడ్డ లాంటి చోట్లనే ఇలా చేస్తుందంటే... మిగిలిన చోట్ల పరిస్థితి ఎంత భయుంకరంగా ఉందో వునం అర్థం చేసుకోవచ్చు. నంద్యాల ఘటనపై వునం న్యాయుపోరాటం చేద్దాం’ అని భరోసానిచ్చారు.
 
 మనకు దేవుడి దయ ఉంది
 చంద్రబాబుకు తోడుగా ఒక ఈనాడు ఉంది... ఒక ఆంధ్రజ్యోతి ఉంది... ఒక టీవీ 9 ఉందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. రేప్పొద్దున చంద్రబాబు హామీలు అవులు చేయుకపోతే ఈ మీడియా చంద్రబాబు వుంచోడే. ఆయునకు రుణవూఫీ చేద్దావుని ఉందని.. అయితే, బ్యాంకులు, కేంద్రం ఒప్పుకోలేదు అని చెబుతాయి. చంద్రబాబుకు లేనిది వునకు ఉన్నది ఆ దేవుడి దయు, ప్రజల మనస్సుల్లో స్థానమ’ని పేర్కొన్నారు.
 
సంతాపం

శోభమ్మకు, బస్సు ప్రమాద మృతులకు సంతాపం
కర్నూలు: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి మృతికి, అనంతపురం జిల్లాలో బస్సు ప్రమాద ఘటనలో మృతి చెందిన వారికి వైఎస్సార్సీపీ కర్నూలు జిల్లా విస్తృత స్థాయి సమావేశం సంతాపం ప్రకటించింది. వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రతిపాదన మేరకు సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. సమావేశ ప్రారంభానికి ముందు జననేత మాట్లాడుతూ శోభమ్మ వ్యక్తిగతంగా తనకు అక్కలాంటిదని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె మన మధ్య లేకపోవడం బాధాకరమన్నారు. అనంతపురం జిల్లా మడకశిర పెనుగొండ మధ్య జరిగిన బస్సు ప్రమాదంలో 15 మంది చనిపోయిన ఘటనను గుర్తు చేసుకుంటూ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు, ప్రజా ప్రతినిధులు మౌనం పాటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement