నరసరావుపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు పోటెత్తారు. పలు సమస్యలపై అర్జీలు అందజేశారు.
సోదరి 4 ఎకరాలు రాయించుకుంది..
నాకు అనారోగ్యం కారణంగా రెండు కళ్లు కని్పంచకుండా పోయాయి. నాకు ఐదెకరాల పొలం ఉంది. కళ్లు కని్పంచని నాకు నా సోదరి అంజమ్మ మాయమాటలు చెప్పి నాలుగు ఎకరాలు రాయించుకుంది. నా పొలం నాకు ఇప్పించి న్యాయం చేయండి.
– కేసరి శ్రీనివాసరెడ్డి, అంధుడు, మాచవరం, రొంపిచర్ల మండలం
వీసా పేరుతో రూ.3.50లక్షలు కాజేశారు
ప్లైహై కన్సెల్టెన్సీ అనే పేరుతో గుత్తికొండకు చెందిన బ్రహ్మం అనే వ్యక్తి కన్సెల్టెన్సీని నిర్వహిస్తూ వీసా ఇప్పించేందుకు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని, అందులో సగం ముందు చెల్లించాలంటూ నా వద్ద నుంచి రూ.3.50లక్షలు తీసుకున్నాడు. వీసా మంజూరు చేయలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. న్యాయం చేయండి.
–పఠాన్ అబ్దుల్ ఖాదర్, పెద్దమసీదు, పిడుగురాళ్ల
నమ్మించి రూ.లక్ష కాజేశాడు
నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే శివరామకృష్ణ అనే వ్యక్తి బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నా వద్ద నుంచి ఇంటిపన్ను రసీదు, విద్యుత్ బిల్లు రసీదు తీసుకున్నాడు. బ్యాంకు దగ్గరకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించి రూ.1.50లక్షలు తీసుకొని బయటకు వచ్చి నాకు రూ.50వేలు ఇచ్చాడు. దీనికి నూటికి రెండురూపాయలు వడ్డీ చెల్లించాలని, మిగతా రూ.లక్ష తాను తీసుకొని నెలకు రూ.4 వడ్డీ చెల్లిస్తానని, మీకు నోటు రాసిస్తానంటూ నమ్మబలికి డబ్బు కట్టకుండా మోసం చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని, నా నగదు నాకు ఇప్పించండి.
– పొట్టి శౌమ్య, రూపెనగుంట్ల, నకరికల్లు మండలం
ఉద్యోగం వస్తుందని నమ్మబలికి పెళ్లి చేసుకున్నాడు
ఆకాష్ బాబు అనే వ్యక్తి తనకు సబ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగం వస్తుందని, తన చెల్లెలు కూడా ఎస్‌ఐనే అంటూ వాళ్ల తల్లిదండ్రులు సైతం నమ్మబలికి రూ.12లక్షలు కట్నం ఇచ్చేలా మాట్లాడుకొని నన్ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే రూ.6 లక్షలు తీసుకున్నారు. వివాహం అనంతరం రూ.6 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. వివాహమైన తర్వాత ఆకాష్‌బాబుకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. మోసంచేసిన ఆకా‹Ùబాబు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోండి.
– ఓ మహిళ, క్రిస్టియన్‌పాలెం, నరసరావుపేట
Comments
Please login to add a commentAdd a comment