district police office
-
ఉద్యోగం వస్తుందని నమ్మబలికి పెళ్లి చేసుకున్నాడు
నరసరావుపేట: జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ కంచి శ్రీనివాసరావు అధ్యక్షతన సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి బాధితులు పోటెత్తారు. పలు సమస్యలపై అర్జీలు అందజేశారు. సోదరి 4 ఎకరాలు రాయించుకుంది.. నాకు అనారోగ్యం కారణంగా రెండు కళ్లు కని్పంచకుండా పోయాయి. నాకు ఐదెకరాల పొలం ఉంది. కళ్లు కని్పంచని నాకు నా సోదరి అంజమ్మ మాయమాటలు చెప్పి నాలుగు ఎకరాలు రాయించుకుంది. నా పొలం నాకు ఇప్పించి న్యాయం చేయండి. – కేసరి శ్రీనివాసరెడ్డి, అంధుడు, మాచవరం, రొంపిచర్ల మండలంవీసా పేరుతో రూ.3.50లక్షలు కాజేశారుప్లైహై కన్సెల్టెన్సీ అనే పేరుతో గుత్తికొండకు చెందిన బ్రహ్మం అనే వ్యక్తి కన్సెల్టెన్సీని నిర్వహిస్తూ వీసా ఇప్పించేందుకు రూ.7లక్షలు ఖర్చు అవుతుందని, అందులో సగం ముందు చెల్లించాలంటూ నా వద్ద నుంచి రూ.3.50లక్షలు తీసుకున్నాడు. వీసా మంజూరు చేయలేదు. డబ్బులు తిరిగి ఇవ్వలేదు. న్యాయం చేయండి.–పఠాన్ అబ్దుల్ ఖాదర్, పెద్దమసీదు, పిడుగురాళ్లనమ్మించి రూ.లక్ష కాజేశాడు నరసరావుపేటలోని ఓ ప్రైవేటు బ్యాంకులో పనిచేసే శివరామకృష్ణ అనే వ్యక్తి బ్యాంకులో రుణం ఇప్పిస్తానని నా వద్ద నుంచి ఇంటిపన్ను రసీదు, విద్యుత్ బిల్లు రసీదు తీసుకున్నాడు. బ్యాంకు దగ్గరకు తీసుకెళ్లి సంతకాలు పెట్టించి రూ.1.50లక్షలు తీసుకొని బయటకు వచ్చి నాకు రూ.50వేలు ఇచ్చాడు. దీనికి నూటికి రెండురూపాయలు వడ్డీ చెల్లించాలని, మిగతా రూ.లక్ష తాను తీసుకొని నెలకు రూ.4 వడ్డీ చెల్లిస్తానని, మీకు నోటు రాసిస్తానంటూ నమ్మబలికి డబ్బు కట్టకుండా మోసం చేశాడు. అతనిపై చర్యలు తీసుకుని, నా నగదు నాకు ఇప్పించండి. – పొట్టి శౌమ్య, రూపెనగుంట్ల, నకరికల్లు మండలంఉద్యోగం వస్తుందని నమ్మబలికి పెళ్లి చేసుకున్నాడు ఆకాష్ బాబు అనే వ్యక్తి తనకు సబ్ ఇన్స్పెక్టర్ ఉద్యోగం వస్తుందని, తన చెల్లెలు కూడా ఎస్ఐనే అంటూ వాళ్ల తల్లిదండ్రులు సైతం నమ్మబలికి రూ.12లక్షలు కట్నం ఇచ్చేలా మాట్లాడుకొని నన్ను వివాహం చేసుకున్నాడు. వివాహానికి ముందే రూ.6 లక్షలు తీసుకున్నారు. వివాహం అనంతరం రూ.6 లక్షలు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాం. వివాహమైన తర్వాత ఆకాష్బాబుకు ఎటువంటి ఉద్యోగం రాలేదు. మోసంచేసిన ఆకా‹Ùబాబు, అతని తల్లిదండ్రులపై చర్యలు తీసుకోండి. – ఓ మహిళ, క్రిస్టియన్‌పాలెం, నరసరావుపేట -
‘డీపీఓ’లో దొంగలు పడ్డారు!
జిల్లా పోలీసు కార్యాలయం.. నిరంతర పహారా ఉండే ప్రాంతం. డీఐజీ, ఎస్పీ కార్యాలయాలతో పాటు ఎందరో పోలీసు కుటుంబాలుంటాయి. ప్రవేశమార్గంలోనే నిత్యం పోలీసు నిఘా ఉంటుంది. అలాంటి డీపీఓనే దొంగలు టార్గెట్ చేశారు. 15 రోజుల వ్యవధిలోనే రెండుసార్లు చేతివాటం చూపారు. డీపీఓలోని దర్గాలోని హుండీలను కొల్లగొట్టి పోలీసులకే సవాల్ విసిరారు. అనంతపురం క్రైం: నిరంతరం కట్టుదిట్టమైన పోలీస్ పహారా ఉన్న జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో ఉన్న దస్తగిరి స్వామి జెండా కట్ట(దర్గా)లో వరుస చోరీలు చోటు చేసుకున్నాయి. సాక్షాత్తు ఎస్పీ, ఉన్నతాధికారులు, వేల సంఖ్యలో పోలీసులు సంచరించే ఈ ప్రాంతంలోనే 15 రోజుల వ్యవధిలో రెండు సార్లు చోరీలు జరగడం గమనార్హం. దర్గా పెద్దల ఫిర్యాదుతో టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు హుండీలు ఖాళీ.. లాక్‌డౌన్‌కు ముందు డీపీఓలోని దర్గాకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చి మొక్కులు తీర్చుకుని వెళ్లేవారు. గురు, శుక్రవారాల్లో 1,500 మందికిపైగా భక్తులు వస్తుంటారు. ఈ రెండు రోజుల వ్యవధిలోనే రూ.వేలల్లో స్వామికి ముడుపులు అందుతుంటాయి. కరోనా లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి దర్గాను పూర్తిగా మూసివేశారు. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ వ్యక్తి పదిహేను రోజుల క్రితం ఓ హుండీని పగులగొట్టి అందులోని డబ్బు తీసుకెళ్లాడు. ఈ విషయం మరువక ముందే రెండు రోజుల క్రితం మళ్లీ అదే వ్యక్తి దర్గాలోకి చొరబడి మరో హుండీని పగులగొట్టి అందులోని డబ్బు తీసుకెళ్లాడు. చోరీలు జరిగిన దస్తగిరి స్వామి జెండా కట్ట(దర్గా) ఇదే.. రంగంలోకి ‘టూ టౌన్’.. దర్గాలో చోటు చేసుకున్న వరుస చోరీలపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. చుట్టూ పోలీసుల రక్షణ వలయంలో ఉన్న జిల్లా పోలీసు కార్యాలయంలోనే ఈ పరిస్థితి తలెత్తడంతో రక్షణ వ్యవస్థపై ప్రజల్లో అపనమ్మకం చోటు చేసుకునే ప్రమాదం నెలకొంది. దీంతో దర్గా పెద్దల ఫిర్యాదుతో అనంతపురం టూ టౌన్ పోలీసులు రంగంలో దిగారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసు దర్యాప్తును వారు స్వీకరించారు. సీసీ ఫుటేజీలు పరిశీలించారు. డీపీఓకు ఓ చివర దర్గా ఉంది. లాక్డౌన్ నుంచి దర్గా మూసి వేయడంతో అటువైపు ఎవరూ వెళ్లే పరిస్థితి లేదు. దీనిని ఆసరాగా తీసుకున్న దొంగ దర్గా వెనుకవైపు గుల్జార్‌పేట నుంచి వచ్చాడా...? లేక తరచూ డీపీఓ, పోలీసు పెరేడ్ గ్రౌండ్స్‌కు వస్తూ ఇలా దొంగతనాలకు పాల్పడ్డాడా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, రెండు హుండీల్లో పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకెళ్లినట్లు పలువురు పేర్కొంటున్నారు. అయితే కేసు నమోదులో పోలీసులు కేవలం రూ.5 వేలు మాత్రమే నమోదు చేయడం గమనార్హం. నిఘా కరువై.... డీపీఓలో పోలీసుల పహారా నిరంతరం ఉంటుంది. వారిని దాటుకునే ఎవరైనా ముందుకెళ్లాల్సి ఉంటుంది. ఇంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఛేదించుకుని ఓ చివరన ఉన్న దర్గాలోకి దొంగ చొరబడి దర్జాగా హుండీలోని సొమ్ము అపహరించుకెళ్లడంపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు మొదటి సారి చోరీ జరిగినప్పుడే పోలీసులు అప్రమత్తమై ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదంటూ పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. -
జిల్లాలో ‘షీ’ బృందాల విస్తరణ
సంగారెడ్డి క్రైం : మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, ఈవ్‌టీజింగ్ వంటి వాటిని అరికట్టేందుకు షీ టీమ్‌లను విస్తరించినట్లు ఎస్పీ సుమతి తెలిపారు. జిల్లాలోని సంగారెడ్డి, పటాన్చెరు, రామచంద్రపురం, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట పట్టణాలో ్ల పనిచేస్తున్న షీ టీమ్‌లకు జిల్లా పోలీసు కార్యాలయంలో శనివారం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాలను అరికట్టేందుకు ఈ శిక్షణ కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ సింగపూర్ పర్యటనలో అక్కడ మహిళలపై అఘాయిత్యాలు, ఈవ్ టీజింగ్ వంటివి జరుగకుండా తీసుకుంటున్న చర్యలను పరిశీలించి అదే తరహాలో తెలంగాణ రాష్ట్రంలో కూడా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను అరికట్టేందుకు ఉన్నతాధికారులతో చర్చించి షీ టీం బృందాలను ఏర్పాటు చేయాలని ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నామన్నారు. అనంతరం కోర్డుకు సంబంధించి విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులు, నమన్లు, వారెంట్లు తదితర విషయాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీసీఆర్బీ సీఐ రాంచెందర్, ఖాజామొయినుద్దీన్, షీ టీంలకు సంబంధించి 25 మంది సిబ్బంది పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ మానిటరింగ్ అవసరం పుస్తకాలతో పనిలేకుండా ఎలక్ట్రానిక్ మానిటరింగ్ విధానం అలవర్చుకోవాలని ఎస్పీ సుమతి సూచించారు. జిల్లా పోలీసు కల్యాణ మండపంలో శనివారం పోలీసు శాఖలోని వీపీఓలు, స్టేషన్ రైటర్లు, స్టేషన్ అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శిక్షణ ద్వారా తెలుసుకున్న విషయాలతో ప్రజలకు సేవలందించాలన్నారు. కేసులను వెనువెంటనే రిజిస్టర్ చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. అనంతరం సిబ్బంది సమస్యలను ఎస్పీ స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవీందర్‌రెడ్డి, ఐటీల్యాబ్ ఎస్ఐ బాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.